కార్తీకదీపం 2 సీరియల్.. నరసింహని రెచ్చగొట్టిన శోభ.. అనసూయ గురించి సుమిత్రకు చెప్పిన దీప, వినేసిన కార్తీక్
Karthika deepam 2 serial today may 10th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప ఆత్మాభిమానం మీద కొట్టి తనని ఎలాగైనా ఆ ఇంట్లో నుంచి పంపించేయమని శోభ నరసింహకి వార్నింగ్ ఇస్తుంది.
Karthika deepam 2 serial today may 10th episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతాడు. మిమ్మల్ని చూడగానే ఆ ఇంట్లో వంట మనిషి అనుకున్నాను కానీ ఆయన నిన్ను ఏవండీ అంటున్నాడు. ఆయన తలుచుకుంటే ఎంతైనా సహాయం చేయగలడు. అయినా నువ్వు నా దగ్గర పని చేయడం ఏంటమ్మా అని అడుగుతాడు.
కడియంకి అండగా దీప
ఒకరికి ప్రమాదం జరగబోతుంటే నేను కాపాడాను. నేను కాపాడిన సుమిత్రమ్మ మేనల్లుడు అతను. కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వస్తుందని చెప్తుంది. అక్కడ నేను మాత్రం ఎన్నాళ్ళు ఉంటాను అవసరం తీరిపోయిన తర్వాత వెళ్లిపోవాల్సిందే కదా అంటుంది.
మళ్ళీ వెళ్లిపోతావా అని కడియం అంటే లేదు నా కూతురిని చదివించుకోవాలి. చాలా బాధ్యతలు ఉన్నాయి అప్పటి వరకు ఎక్కడికి వెళ్లనని అంటాడు. నరసింహ దీప వచ్చి ఏం గొడవ పడుతుందోనని భయంగా ఉందని అంటాడు. అనసూయ శోభ మీద పెత్తనం చేయాలని చూస్తుంది.
రోడ్డు మీద ఛీ కొట్టించి గెంటిస్తా
నిన్ను ఇంట్లో ఉంచుకుంది నా మీద పెత్తనం చేయడానికి, మేపడానికి కాదు. దీపని వదిలించుకోవడానికి ముందు దాన్ని వదిలించుకుని ఆ తర్వాత నిన్ను రోడ్డు మీద నీ కొడుకుతో ఛీ కొట్టించి మరీ గెంటిస్తానని శోభ మనసులో అనుకుంటుంది.
నువ్వు నా మొదటి కోడలు అయితే ఎంత బాగుండేదోనని అనసూయ అంటుంది. మొదటి కోడలు రెండో కోడలు ఏంటి ఉన్న ఒక్క కోడలిని నేనే అని శోభ నోటికి పని చెప్తుంది. దీప ఇక్కడే ఉంటే కూతురిని ఇంటికి తీసుకొచ్చి గొడవ చేస్తుంది. అత్త అన్న మాట నలుగురు అనకముందే ఏదో ఒకటి జరగాలి.
విడాకులు తీసుకుంటావో లేదంటే దూరంగా తరిమేస్తావో నీ ఇష్టం. తిట్టినా కూడా దానికి భయం లేదని అంటే అయితే కొట్టు దానికి ఆత్మాభిమానం ఎక్కువ దాని మీద కొట్టమని చెప్తుంది. మనం పొమ్మంటే అది పోయింది దాని బతుకు ఏదో అది బతుకుతుందని అనసూయ అంటుంది.
దీపని ఆ ఇంట్లో లేకుండ చేయాలి
శోభ మాత్రం అసలు తగ్గదు. నువ్వు ఏదైనా చేస్తావా లేదంటే మా అమ్మని రమ్మని చెప్తాను. రానివ్వు వస్తే ఏమౌతుందని అనసూయ అంటుంది. మా అత్త నాంచారి వస్తే పొయ్యిలో నిప్పులు ఒడిలో వేసుకునట్టేనని అంటాడు. దీప జోలికి వెళ్లకు ఆ ఇంట్లో పెద్దావిడ తనని కూతురిలా చూసుకుంటుంది. నీ మీద పోలీస్ కేసు పెడతానని అన్నదని అనసూయ చెప్తుంది.
దీప ఆ ఇంట్లోనే ఉంటే రెచ్చగొట్టి పోలీసు కేసు పెట్టిస్తారు. నువ్వు వెళ్ళి మాట్లాడి అది ఆ ఇంట్లో ఉండకుండా చేయమని చెప్తుంది. అది రెచ్చగొట్టిందని దీప దగ్గరకు వెళ్ళకు అది సామాన్యురాలు కాదు. సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉండమని అనసూయ కొడుక్కి సలహా ఇస్తుంది.
నువ్వు చెప్పే అబద్ధాలు శౌర్య నమ్ముతుంది కానీ నేను నమ్మను అంటుంది. దీపని తీసుకుని పక్కకి తీసుకెళ్ళి అసలు విషయం అడుగుతుంది. మీ అత్తయ్య ఎక్కడని అంటుంది. మీరిద్దరూ నరసింహ ఇంటికి వెళ్లారా అని అడుగుతుంది. కార్తీక్ దీప వాళ్ళని చూస్తుంది.
మీ ఆయన్ని రెండో పెళ్లి గురించి అడిగిందా? అని సుమిత్ర అడుగుతుంది. అంటే దీపకు నరసింహ చేసిన అన్యాయం ఇదాని అనుకుంటాడు. అందుకే దీప వాడిని వదిలేసింది, వాడే తండ్రి అని కూతురికి ఎప్పటికీ తెలియకూడదని అనుకుంటుంది.
నాకు చీవాట్లు పెట్టింది
దీప బాధగా మాట్లాడుతుంది. రాత్రి మీ దగ్గర శపథాలు చేసిన మనిషి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చీవాట్లు పెట్టింది. అప్పులు చేసి ఊరు వదిలి వెళ్ళిపోయిన కొడుకుది ఏ తప్పు లేదంట. తప్పంతా నాదేనట. చివరికి తన కొడుకు రెండో పెళ్లి కూడా సమర్థించిందని చెప్తుంది.
నీకు నీ కూతురికి మాకు ఏ సంబంధం లేదని చెప్పింది. నేను భర్త వదిలేసిన ఆడదాన్ని కాదు అత్త వదిలేసిన ఆడదాన్ని కూడా. వాళ్ళకు నేను నా కూతురు అవసరం లేదు. ఎలా బతుకుతారో పోయి బతకండి అంది. ఇప్పుడు మా అత్తయ్యకు ఆ రెండో ఆవిడ కోడలు అంట.
నా కూతురికి నేనున్నా
నాన్న పోయినప్పుడు కూడా ఇంతగా బాధపడలేదు. ఆయన చనిపోయి దూరం అయ్యాడు. వీళ్ళు బతికే ఉండి దూరం అయ్యారు. ఇప్పుడు నేను నిజంగానే అనాథని అయ్యాను. అలా అని నేను ఏడుస్తూ కూర్చొను. నాకు ఎవరూ లేకపోవచ్చు కానీ నా కూతురికి నేను ఉన్నాను.
ఈ ఆకలి కష్టాలు, కన్నీళ్ళు తెలియనివ్వను. అందుకే నేను ఒక హోటల్ లో పని చేరాను. ఇక నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం మిగల్లేదు నా ప్రాణం ఒక్కటే అది నా కూతురు. అందుకే అది నాన్న, నానమ్మ గురించి అడిగితే ఏదో ఒక అబద్ధం చెప్తున్నాను.
దీప మాటలన్నీ కార్తీక్ వింటాడు. నీకు జరిగిన దానికి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది. పోలీసు కేసు పెట్టి నాలుగు తన్నించాలని సుమిత్ర అంటుంది. దీప మాత్రం వద్దని అంటుంది. వాళ్ళే బంధాలు టెంపెసుకుంటే ఎవరి మీద కేసు పెడితే ఏం వచ్చిద్దని అంటుంది.
నీకు నేనున్నాను
నేను ఎవరి జోలికి వెళ్లాలని అనుకోవడం లేదని దీప చెప్తుంది. నీ తండ్రి బతికి ఉంటే నీకు ఈ కష్టం వచ్చేది కాదని సుమిత్ర అంటుంది. నీ కూతురికి నువ్వు ఉన్నావ్ నీకు నేను ఉన్నాను. నేను ఉండగా నువ్వు ఎప్పటికీ అనాథవి కాదు. నువ్వు ఎక్కడ పని చేయాల్సిన నేను చూసుకుంటానని అంటుంది.
వద్దు ఉండటానికి ఇల్లు ఇచ్చారు తిండి పెడుతున్నారు చాలు. ఏ బంధం లేకపోయినా నన్ను చూసుకుంటున్నారని దీప చెప్తుంది. బంధం లేదని నువ్వు అనుకుంటున్నావ్ కానీ నువ్వు బాధపడితే నా సొంత మనిషికి బాధ కలిగినట్టు అనిపిస్తుంది.
నువ్వు ఇక్కడే ఉండి నీకు నచ్చిన పని చేసుకో నువ్వు సంతోషంగా ఉంటే చాలు. నీకు ఈ అమ్మ ఉందనే విషయం ఎప్పటికీ మర్చిపోకు అని ప్రేమగా చెప్తుంది. అత్త చెప్పింది కరెక్ట్ దీపకు నాన్న ఉంటే ఈ పరిస్థితి రానిచ్చే వాడు కాదని కార్తీక్ అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.