Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్..దీప మీద దొంగతనం వేసిన జ్యోత్స్న.. శౌర్య నెక్లెస్ కొట్టేసిందన్న పారిజాతం-karthika deepam 2 serial today may 8th episode parijatam and jyotsna falsely accuse deepa of stealing the necklace ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Today: కార్తీకదీపం 2 సీరియల్..దీప మీద దొంగతనం వేసిన జ్యోత్స్న.. శౌర్య నెక్లెస్ కొట్టేసిందన్న పారిజాతం

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్..దీప మీద దొంగతనం వేసిన జ్యోత్స్న.. శౌర్య నెక్లెస్ కొట్టేసిందన్న పారిజాతం

Gunti Soundarya HT Telugu
May 08, 2024 07:49 AM IST

Karthika deepam 2 serial today may 8th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్న తన నెక్లెస్ దీప దొంగతనం చేసిందని నిందలు వేస్తుంది. సుమిత్ర దీపని సపోర్ట్ చేస్తున్నప్పటికీ పారిజాతం ఇందులోకి శౌర్యని కూడా లాగుతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ మే 8వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 8వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today may 8th episode: కారులో జ్యోత్స్న లేకపోవడంతో కార్తీక్ కంగారుపడతాడు. వెంటనే తనకి ఫోన్ చేస్తాడు. జ్యోత్స్న దీప వాళ్ళని తలుచుకుని రగిలిపోతుంది. ఎక్కడ ఉన్నావ్ అంటే నువ్వు టీ తాగుతూ హాయిగా కబుర్లు చెప్పుకో అని సీరియస్ గా మాట్లాడుతుంది.

జ్యోత్స్న ఆటోలో రావడం చూసి పారిజాతం షాక్ అవుతుంది. ఏమైంది ఎందుకు ఆటోలో వచ్చావని అడుగుతుంది. కార్తీక్ ఎక్కడ అని అంటే కాకా హోటల్ లో టీ తాగుతున్నాడు. దీప అక్కడే ఉంది కదా అంటుంది. అది ఎందుకు వచ్చిందని పారిజాతం అడుగుతుంది.

మీరు మాట మీద నిలబడరు

కార్తీక్ మీద జ్యోత్స్న ఫుల్ ఫైర్ లో ఉంటుంది. దీపని ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లగొట్టడం గురించి ఆలోచించమని బంటుకి పారిజాతం చెప్తుంది. కార్తీక్ శౌర్య మాటలు గుర్తు చేసుకుంటాడు. దీపతో మాట్లాడాలని అంటే సరే అయితే నేను కారు దిగి వెళ్లిపోతుంటే కార్తీక్ ఆపుతాడు.

తనని శత్రువులుగా కాకుండా సుమిత్ర మేనల్లుడుగా మాత్రమే చూడమని అడుగుతుంది. విషయం ఏమిటని అడుగుతుంది. చెప్పే విషయం విని మొహం చిట్లించడాలు, చెప్పగానే కనుబొమ్మలు ఎత్తి కోపంగా చూడటం, మధ్యలోనే వెళ్ళిపోవడం చేయకుండా తన ఉద్దేశం అర్థం చేసుకోమని అంటాడు.

శౌర్య గురించి మాట్లాడతాడు. శౌర్యకి నేను తన తండ్రి గురించి చెప్తానని భయపడుతున్నారా? మీరు చెప్పేవరకు నేను చెప్పనని అంటాడు. మీరు మాట మీద నిలబడే మనిషి కాదని దీప అనేస్తుంది. మీరు మీ అత్తయ్యతో బయటకు వెళ్లారని రౌడీ చెప్పింది ఆవిడ ఏది అని అడుగుతాడు.

నీ కోడలు అసలు రూపం ఇదే

నరసింహ వాళ్ళు అటుగా వెళ్తూ కార్తీక్, దీప వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తారు. ఆవిడ ఎక్కడికో వెళ్లిందో అని కవర్ చేస్తుంది. నీ కోడలి అసలు రూపం చూడు. అసలు దానికి వాడికి ఏ సంబంధం లేకుండా ఇలా మాట్లాడుతుందా అని నరసింహ అనసూయని రెచ్చగొడతాడు.

దీపని కడిగేస్తానని అనసూయ ఆవేశపడుతుంటే నరసింహ ఆపుతాడు. దాని ఏమైనా అంటే వాడు ఊరుకొడు. వాడితో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుందని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. మీ అత్త కూడా ఇక్కడికే వచ్చింది కదా ఇక మీరు వెళ్లిపోవాల్సిన అవసరం లేదు అంటాడు.

నరసింహ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్తానని మొత్తం అబద్ధాలు చెప్తాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోండి. రౌడీని మంచి స్కూల్ లో చేర్పించండి. నా వంతు సహాయం చేస్తాను అంటాడు. తనకు అవసరం లేదని అంటుంది. దీప ఇక్కడ ఉంటే తాను ఉండలేనని తనని ఊరు పంపించమని శోభ అనసూయతో చెప్తుంది.

నెక్లెస్ మిస్సింగ్

నా బిడ్డని నేను చదివించుకోగలను ఎవరి సహాయం అవసరం లేదని అంటుంది. జ్యోత్స్న పారిజాతం దగ్గర తన బాధ మొత్తం చెప్తుంది. బావ నన్ను అసలు పట్టించుకొకపోతే ఎలా అని బాధపడుతుంది. కార్తీక్ లో మార్పు ఈ మధ్య మొదలైందని అంటుంది.

మొన్న బర్త్ డేకి కేవలం రోజ్ ఫ్లవర్ ఇచ్చి సరిపెట్టుకున్నాడు. లాస్ట్ ఇయర్ నా బర్త్ డే కి బావ డైమండ్ నెక్లెస్ ఇచ్చాడు అది నేను ఇప్పటికీ జాగ్రత్తగా పెట్టుకున్నాను చూడు అని నెక్లెస్ కోసం వెతికితే కనిపించదు. నాలుగు రోజుల క్రితమే బావకి చూపించానని అంటే పారిజాతం నవ్వుతుంది.

అది ఇంకెక్కడ ఉంటుంది చేరాల్సిన చోటుకి చేరి ఉంటుందని అంటుంది. కార్తీక్, దీప కారులో ఇంటికి వస్తారు. జ్యోత్స్న సుమిత్ర వాళ్ళ దగ్గరకు వచ్చి తన డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదని చెప్తుంది. బయట వాళ్ళు ఇంట్లో తిరిగితే ఇంట్లో వస్తువులు బయటకు వెళ్తాయని పారిజాతం ఇన్ డైరెక్ట్ గా దీపని అంటుంది.

దీప దొంగ

అప్పుడే దీప, కార్తీక్ ఇంట్లోకి అడుగుపెట్టడం చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. దీప శౌర్యని పిలుస్తుంది. జ్యోత్స్న నెక్లెస్ దీప కొట్టేసిందని పారిజాతం నింద వేస్తుంది. తీసిన వస్తువు ఎక్కడ పెట్టిందో చెప్పమని అంటుంది. నిజం తెలియకుండా నిందించడం తప్పు అని దశరథ అంటాడు.

అవుట్ హౌస్ కి వెళ్ళి అంతా వెతికించమని వస్తువు లేకపోతే అప్పుడు దీప దొంగ కాదని నమ్ముతానని అంటుంది. దీప ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. దీప సమాధానం చెప్పలేక మౌనంగా లేదు మన మీద ఉన్న గౌరవంతో అంటుంది. గ్రానీ మాట్లాడిన దాంట్లో తప్పు లేదని జ్యోత్స్న కూడా దీపని దొంగ అంటుంది.

దీప ఎలాంటిదో నీకు తెలుసు కదాని కార్తీక్ జ్యోత్స్నని వారిస్తాడు. సంస్కారం నేర్చుకోమని అంటే నీ సంస్కారం ఇందాక టీ కొట్టి దగ్గర చూశానని అంటుంది. అసలు ఏం జరుగుతుందని దశరథ అడుగుతాడు. దీప దొంగతనం చేయడం మీరు చూశారా అని కార్తీక్, దశరథ పారిజాతాన్ని ఆపేందుకు చూస్తారు.

నెక్లెస్ కనిపించడం లేదంటే దాన్ని తీయాల్సిన అవసరం బయట వాళ్ళకే ఉంటుంది. జ్యోత్స్న గదిలోకి అంత చొరవగా వెళ్ళేది దీప తర్వాత శౌర్య. దీప తీయకపోయిన పిల్లతో చేయించి ఉండవచ్చు కదా అంటుంది. నా కూతురితో నేను దొంగతనం చేయించానని అంటున్నారా అని దీప బాధగా అడుగుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point