Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప భర్త గురించి తెలుసుకున్న పారిజాతం.. నరసింహ చేసిన పనికి రగిలిపోయిన అనసూయ-karthika deepam 2 serial today may 3rd episode anasuya shocked when deepa informs narasimha second marriage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప భర్త గురించి తెలుసుకున్న పారిజాతం.. నరసింహ చేసిన పనికి రగిలిపోయిన అనసూయ

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప భర్త గురించి తెలుసుకున్న పారిజాతం.. నరసింహ చేసిన పనికి రగిలిపోయిన అనసూయ

Gunti Soundarya HT Telugu
May 03, 2024 07:07 AM IST

Karthika deepam 2 serial today may 3rd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహ దీప భర్త అనే విషయం బంటు పారిజాతానికి చెప్తాడు. అటు దీప కూడా నరసింహ రెండో పెళ్లి చేసుకున్నాడని అనసూయకి చెప్పడంతో కోపంతో రగిలిపోతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ మే 3వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 3వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today may 3rd episode: దీప కనిపించకపోతే మిమ్మల్నే అడుగుతానని సీఐ కార్తీక్ కి చెప్తాడు. వారం రోజుల్లో దాడి చేసిన వ్యక్తిని పట్టుకుంటానని, సాక్షిని జాగ్రత్తగా చూసుకోమంటాడు. ఏం జరుగుతుందో అర్థం కాక అనసూయ అయోమయంగా చూస్తుంది.

ఏం జరుగుతుంది?

దశరథ అనసూయ గురించి అడుగుతాడు. తన అత్తయ్య అని ఊరి నుంచి తమ కోసం వచ్చిందని దీప చెప్తుంది. నువ్వు చేసింది నాకు నచ్చలేదు. నేను ప్రేమగా షరియా మెడలో చైన్ వేస్తే అది కూడా వదిలేసి వెళ్లిపోతావా అని శివనారాయణ అంటాడు. ఆ చైన్ ని సుమిత్ర శౌర్య మెడలో వేయమని చెప్తాడు.

అనసూయ గొలుసు చూసి ఆశ్చర్యపోతుంది. కొన్ని బంధాలు ముడివేసేది కలకాలం ఉండాలని తెంపుకుపోవడానికి కాదని సుమిత్ర అంటుంది. ఈ ఇల్లు ఏంటి, ఈ మనుషులు ఏంటి? వాళ్ళు నిన్ను సొంత మనిషిలాగా చూడటం ఏంటి? అసలు ఏం జరుగుతుందని అనసూయ దీపని అడుగుతుంది.

నరసింహ దీప మొగుడు

రెండు రోజుల్లో వస్తానని చెప్పి అసలు రాలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇక్కడ ఇన్ని భోగాలు ఉంటే ఎందుకు వస్తావని అనసూయ నోరు పారేసుకుంటుంది. బంటు పారిజాతం దగ్గరకు వస్తాడు. నగలు ఏమి లేకుండా బీదరాలిగా పారిజాతం ఉండటం చూసి తనని అమ్మమ్మ గారు అని పిలుస్తాడు.

మా అమ్మగారు ఎక్కడని అంటాడు. పారిజాతం ఫైర్ అవుతుంది. నగలు, మేకప్ లేకపోయేసరికి గుర్తు పట్టలేకపోయానని అంటాడు. దీప తిరిగి రావడం కాదు తీసుకొచ్చాడని చెప్తుంది. అప్పగించిన పని ఏమైందని పారు అడుగుతుంద. మొన్న వచ్చన వాడి పేరు నరసింహ దీప మొగుడు. వాడు క్యాబ్ నడుపుతూ ఉంటాడని బంటు పారిజాతానికి చెప్తాడు.

తప్పు చేశావా?

వచ్చిన వాడు ఎవరో సుమిత్రకు తెలుసు కానీ చెప్పకుండా డ్రామాలు ఆడిందని పారిజాతం అనుకుంటుంది. మొగుడు ఇక్కడ ఉంటే దానికి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? దీప మొగుడికి, ఇప్పుడు వచ్చిన అత్తకి మధ్య ఏదో కథ జరుగుతుంది అది ఏంటో తెలుసుకోవాలని పారిజాతం చెప్తుంది.

నరసింహ కనిపించాడా అని అనసూయ దీపని అడుగుతుంది. దీప విషయం చెప్పకుండా దాటవేయాలని చూస్తుంది. దీంతో అనసూయ నోటికి పని చెప్తుంది. విషయం చెప్పడం లేదంటే ఏం తప్పు చేశావని అనసూయ గట్టిగా నిలదీస్తుంది.

అవును తప్పు చేశాను నీ కొడుకుతో పెళ్లి అనగానే తలవంచుకుని తప్పు చేశాను. అందుకు ఈరోజు ఏడుస్తున్నాను. నీకు కొడుకు ఉన్నాడు కానీ నాకు భర్త ఉన్నా లేనట్టే అంటుంది. నరసింహ ఏమన్నాడు కొట్టాడా? అని అడుగుతుంది.

రెండో పెళ్లి చేసుకున్నాడు

దీప బాగా ఏడుస్తుంది. నరసింహ రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది. నువ్వు ఎందుకు ఊరుకున్నావని అంటుంది. నాకు ఎందుకు అన్యాయం చేశావని నిలదీసి అడిగానని చెప్తుంది. కట్టుకున్న దానికి, ఉంచుకున్న దానికి తేడా తెలియని మనిషితో ఏం మాట్లాడాలి.

అతనికి భార్య, కూతురు, తల్లి ఎవరూ అవసరం లేదు. అతని దారి అతను చూసుకున్నాడు. అక్కడ నుంచి వస్తుంటేనే గుడి దగ్గర సుమిత్ర గారిని కలిశానని చెప్తుంది. వాడు నిన్ను అప్పుల్లో వదిలేశాడు అనుకున్నాను కానీ కష్టాల్లో వదిలేశాడని అంటుంది.

నువ్వు వస్తే నీ మొగుడితో రా లేదంటే డబ్బుతో రా అన్నావ్. ఇక్కడ రెండూ లేవు ఎక్కడికైనా దూరంగా వెళ్లాలని అనుకున్నాను. అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి ఊరికి బయల్దేరానని చెప్తుంది. సమాధానం చెప్పడానికి అక్కడ మనకు ఏమి మిగల్లేదు.

దీప కష్టం తెలుసుకున్న సుమిత్ర

చేతిలో డబ్బులు లేకుండా ఊర్లో అడుగుపెడితే అప్పుల వాళ్ళు తంతారు. వారం రోజులు టైమ్ పెట్టారు డబ్బులు కడితే ఇల్లు ఉంటుంది లేదంటే ఉండదని అనసూయ బాధపడుతుంది. ఆ ఇంట్లో వాళ్ళు ఇవేవీ నిన్ను అడగలేదా అని అనసూయ అంటే అడిగారు కానీ ఎవరికీ చెప్పలేదని సుమిత్ర గారికి చెప్పొద్దని దీప చెప్తుంది.

అప్పుడే వెనుక సుమిత్ర ఉంటుంది. కాంచనకు తన భర్త ప్రేమగా అన్నం తినిపిస్తాడు. కార్తీక్ ఇంటికి వస్తాడు. ఊరు వెళ్లిపోతున్న ఆడవాళ్ళని వెనక్కి తీసుకొస్తున్నారంట, బాధ్యత కూడా తీసుకున్నారంట కదాని కార్తీక్ తండ్రి సెటైర్ గా మాట్లాడతాడు. అంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

 

IPL_Entry_Point