Karthika Deepam 2 Serial today Episode | కార్తీకదీపం 2 సీరియల్: దీపని ఇంటికి తీసుకొచ్చిన కార్తీక్
Karthika deepam 2 serial may 2nd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ దీపని తిరిగి ఇంటికి తీసుకుని వస్తాడు. దీపని ఎవరో వెళ్లిపొమ్మని చెప్పారని సీఐ సుమిత్ర కుటుంబం మీద నిందలు వేస్తాడు. ఇక నుంచి తన బాధ్యత మీదే అంటూ కార్తీక్ కి దీపని అప్పగిస్తాడు.
Karthika deepam 2 serial may 2nd episode: దీపని ఎవరూ పంపించలేదని తనే వెళ్లిపోయిందని కార్తీక్ పోలీసులకు చెప్తాడు. ఎవరి మీద నిందలు వేయాల్సిన పని లేదు వెళ్ళి దీపని తీసుకొస్తానని చెప్తాడు. సీఐ దశరథ వాళ్ళ మీద అరుస్తాడు.
తప్పు చేసింది దీప
నేను అంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటని సుమిత్ర అనుకుంటుంది. మళ్ళీ దీప దగ్గరకు వెళ్లారా అని సుమిత్ర పారిజాతాన్ని నిలదీస్తుంది. చెప్పకుండా వెళ్ళిపోయి తప్పు చేసింది తనని అనకుండా గ్రానీని ఎందుకు అంటున్నావ్ అంటుంది.
మన ఇంట్లో ఉన్న మనిషి గురించి వేరే ఇంట్లో ఉంటున్న బావకి తెలిసింది కానీ మనకి తెలియలేదు. తీసుకొస్తాను అన్నాడు అంటే దీప వాళ్ళు ఎక్కడ ఉన్నారో బావకి తెలుసు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్లారో బావకి తెలుసు. నీతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందని అంటుంది.
చెప్పకుండా వెళ్ళిపోయి చాలా తప్పు చేశావ్ అని సుమిత్ర బాధపడుతుంది. దీప వాళ్ళు ఊరు వెళ్లబోతుంటే కార్తీక్ వచ్చి దీప నువ్వు అర్జెంట్ గా ఇంటికి రావాలని అంటాడు. ఇంటికి పోలీసులు వచ్చారు మీరు కనిపించడం లేదని గొడవ జరుగుతుందని చెప్తాడు.
దీపని కలుసుకున్న అనసూయ
నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారంటే తానే చెప్పానని అంటాడు. పోలీసులు వెయిట్ చేస్తున్నారని కావాలంటే మళ్ళీ తనే డ్రాప్ చేస్తానని మాట ఇస్తాడు. దీంతో దీప ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకుంటుంది. కారులో వెళ్తుండగా శౌర్యకి అనసూయ కనిపిస్తుంది.
ఊరు నుంచి ఎప్పుడొచ్చావని దీప అడుగుతుంది. రెండు రోజులు అవుతుంది నీకోసం వెతుకుతూ ఉన్నాను. బస్టాండ్ లో పడుకుంటే ఎవడో డబ్బులు కొట్టేశాడని నోరు వేసుకుని దీప మీద పడుతుంది. మల్లేష్ ఇచ్చిన డబ్బులు అవి పోయాయని చెప్తుంది.
దీప మీద అరిచిన సుమిత్ర
మేము సైకిల్ కోసం ఊరు వస్తున్నాం తీసుకురావచ్చు కదా శౌర్య అంటుంది. ఇంకెక్కడ సైకిల్ అమ్మేశానని చెప్పడంతో శౌర్య ఏడుపు మొహం పెడుతుంది. అత్తయ్య ఇక్కడకి వచ్చిందంటే ఊర్లో ఏం జరిగిందో ఏంటోనని దీప కంగారుపడుతుంది. దీపని తీసుకుని కార్తీక్ ఇంటికి వస్తాడు.
అనసూయ సుమిత్ర వాళ్ళ ఇల్లు చూసి నోరు వెళ్లబెడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ఇక్కడే ఉండమని చెప్పానా లేదా? నీకు అర్థం కాలేదా లేదంటే నా మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నావా? ఎవరికి చెప్పి వెళ్ళావ్. మీరు బాధ్యత తీసుకున్న మనిషి మీకు చెప్పకుండా వెళ్లిపోయిందని సీఐ అంటున్నారు ఏం చెప్పమంటావ్ అని సుమిత్ర గట్టిగా నిలదీస్తుంది.
సుమిత్రని అనుమానించిన సీఐ
నిజంగా వెళ్లాల్సిన అవసరం వస్తే నాకు ఒక మాట చెప్పాలి కదా ఊరికే అందరితో మాటలు పడేలా చేయవద్దని కోపంగా అంటుంది. మేడమ్ నీ మీద చూపిస్తున్న కోపం నిజమేనా లేదంటే కావాలని ఇప్పుడు మాట్లాడుతున్నారా అని సుమిత్రని సీఐ అనుమానిస్తాడు.
దీప వెళ్ళిపోవడం వెనుక ఎవరో ఉన్నారు. నిన్ను వెళ్లిపొమ్మన్న మనిషి ఎవరు?అని అడుగుతాడు. నన్ను ఎవరు వెళ్లిపొమ్మని చెప్పలేదు నేనే వెళ్లిపోవాలని అనుకున్నానని చెప్తుంది. కానిస్టేబుల్స్ సస్పెక్ట్ ని తీసుకొస్తారు. సుమిత్ర మీద అటాక్ చేసిన వాడు వీడెనా అని సీఐ అతన్ని చూపించి దీపని అడుగుతాడు.
దీప కాదని చెప్తుంది. అటాక్ జరిగి ఇన్ని రోజులు అవుతుంది కేసుకు సంబంధించి ఒక్క ఎవిడెన్స్ పట్టుకోలేకపోతున్నారని కార్తీక్ సీఐ మీద సీరియస్ అవుతాడు. వారం రోజుల్లో సుమిత్ర మీద అటాక్ చేసిన వాడిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను.
అంతవరకు దీప బాధ్యత మీదేనని సీఐ కార్తీక్ కి అప్పగిస్తాడు. తను ఇక్కడ ఉన్నా వెళ్లిపోయినా అన్నింటికీ సమాధానం చెప్పాలసిన బాధ్యత మీదేనని అంటాడు. ఇంతటితో కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్