Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్..జ్యోత్స్నకి ఘోరమైన అవమానం.. దీపని గెంటేసిన పారిజాతం, అడ్డుపడిన సుమిత్ర-karthika deepam 2 serial april 30th episode parijatham suggests deepa to take the money and leave the house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీకదీపం 2 సీరియల్..జ్యోత్స్నకి ఘోరమైన అవమానం.. దీపని గెంటేసిన పారిజాతం, అడ్డుపడిన సుమిత్ర

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్..జ్యోత్స్నకి ఘోరమైన అవమానం.. దీపని గెంటేసిన పారిజాతం, అడ్డుపడిన సుమిత్ర

Gunti Soundarya HT Telugu
Apr 30, 2024 07:51 AM IST

Karthika deepam 2 serial april 30th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. జ్యోత్స్నకి ఘోరమైన అవమానం జరుగుతుంది. తనకి ఇచ్చిన మిస్ హైదరాబాద్ కిరీటాన్ని వెనక్కి తీసుకుంటునట్టు ప్రకటిస్తారు.

కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 30వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 30వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial april 30th episode: పారిజాతం మాటలు గుర్తు చేసుకుని దీప కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నేను అసలు అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సిందని అనుకుంటుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని శౌర్య అడుగుతుంది. నేనొక నిజం చెప్పాను అందుకే బాధపడుతున్నానని అంటుంది.

జ్యోత్స్న కిరీటం పోయే

కొన్ని సార్లు నిజాల కంటే అబద్ధాలే మంచి చేస్తాయని దీప అనుకుంటుంది. బంటు హడావుడిగా ఇంట్లోకి వచ్చి టీవీ పెట్టి చూడమని చెప్తాడు. టీవీలో జ్యోత్స్న గురించి వస్తుంది. మిస్ హైదరాబాద్ టైటిల్ ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా టీవీలో వార్తల్లో వస్తుంది.

తాగి కారు డ్రైవ్ చేయడంతో నలుగురికి గాయాలు అయ్యాయి. విజేతలను ఎంపిక చేసిన సమయంలో మాట్లాడిన మాటలకు, సొసైటీ మీద బాధ్యత లేని వ్యక్తిగత విషయాలపై పొంతన లేనందున టైటిల్ జ్యోత్స్నకి ఇవ్వడం తమ పొరపాటుగా భావిస్తున్నట్టు చెప్తారు.

పారిజాతం బాధగా ఇది తన మనవరాలు చూడకూడదని, ఎవరూ చెప్పొద్దని అంటుంది. జ్యోత్స్న నో అని గట్టిగా అరిచి ఏడుస్తుంది. కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. వెంటనే పారిజాతం ఆవేశంగా దీప దగ్గరకు వెళ్తుంది. జ్యోత్స్న టీవీలో వచ్చిన వార్త తలుచుకుని ఏడుస్తుంది.

దీప వల్లే ఇదంతా

నన్ను పోలీస్ స్టేషన్ కి వెళ్ళకుండా ఆపలేకపోయారని జ్యోత్స్న అంటుంది. కారు జాగ్రత్తగా డ్రైవ్ చేసి ఉండాల్సిందని సుమిత్ర అంటుంది. దీప చెప్పకుండా ఉండి ఉంటే అసలు ప్రాబ్లం వచ్చేది కాదుగా అని అరుస్తుంది. నిజం చెప్పడం తప్పు ఎలా అవుతుందని సుమిత్ర దీపకు సపోర్ట్ చేస్తుంది.

మీరు దీపకు సపోర్ట్ చేశారు ఇప్పుడు నా కిరీటం కూడా పోయింది. నా గ్లామర్ తో నేను సంపాదించుకున్నది. సోషల్ మీడియాలో అందరూ నన్ను నెగటివ్ గా మాట్లాడుతున్నారని బాధగా మాట్లాడుతుంది. పారిజాతం దీప గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని దీనికి కారణం దీప ఒక్క సాక్ష్యంతో నా జీవితాన్ని మార్చేసిందని తనని ద్వేషిస్తుంది.

పారిజాతం దీప దగ్గరకు వచ్చి తనని తిడుతుంది. నా మనవరాలు మిస్ హైదరాబాద్, అందాల పోటీలో గెలిచి ఫస్ట్ వచ్చింది. అది పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందని కిరీటం పెట్టుకోవడానికి అర్హత లేదని వెనక్కి తీసుకుంటున్నట్టు టీవీలో చూపించారు. నా మనవరాలు పరువు తీసిన మనిషి నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు పో అని దీపని తోసేస్తుంది.

దీపని గెంటేసిన పారిజాతం

తన బ్యాగ్ తెచ్చి ఇంటి బయట విసిరేస్తుంది. ఇంకొక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదని దీపని తోసేస్తే సుమిత్ర వచ్చి తనని పట్టుకుంటుంది. సుమిత్ర నువ్వు అడ్డురాకు, ఈ దరిద్రాన్ని బయటకు గెంటేస్తేనే నా మనవరాలు సంతోషంగా ఉంటుందని పారిజాతం అరుస్తుంది.

ఇది ఇక్కడే ఉంటే నా మనవరాలు ప్రాణాలు కూడా పోతాయని అంటుంది. దీప ఎక్కడికీ వెళ్లదని చెప్తుంది. ఇంత చేసినా దీన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఇదేమైనా నీ కూతురా అని పారిజాతం అంటే అవును నా కూతురే అంటుంది. తప్పు చేసింది జ్యోత్స్న దీప కాదు.

మన అదృష్టం బాగుంది యాక్సిడెంట్ అయిన వాళ్ళకు ఏం జరగలేదు లేదంటే జ్యోత్స్న జైలుకి వెళ్లాల్సి వచ్చేదని సుమిత్ర అంటుంది. కూతురు అని నెత్తిన పెట్టుకుంటున్నావ్ కదా ఏదో ఒక రోజు నీ నెత్తి మీద పిడుగు వేస్తుందని దీపని ఛీ కొట్టి వెళ్ళిపోతుంది.

బంటు ఐడియా

దీపని సుమిత్ర ఓదార్చి ఎక్కడికి వెళ్లొద్దని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతజరిగిన తర్వాత జ్యోత్స్న నా మొహం కూడ చూడదు, నేను ఇప్పుడు ఉండాలా? వెళ్లిపోవాలా అనుకుంటుంది. పారిజాతం ఆవేశంగా ఇంట్లోకి వస్తుంటే బంటు మాట్లాడతాడు.

దీపని బయటకు పంపించడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. మాటకు లొంగని మనుషులు ఉంటారు కానీ డబ్బుకు లొంగని మనుషులు ఉండరు. డబ్బులు తనకు ఇవ్వమని సలహా ఇస్తాడు. సుమిత్ర ఇచ్చిందని చెప్పమని అంటాడు. దీప వెళ్లకపోతే నాకు ప్రమాదం, నాకు ప్రమాదం అంటే మీకు ప్రమాదమని గుర్తు చేస్తాడు.

డబ్బులు తీసుకుని పో

ఎలాగైనా దీప పోయేలా చేయమని చెప్తాడు. దీప బ్యాగ్ సర్దుతుంటే పారిజాతం మళ్ళీ వస్తుంది. ఈసారి ఏం విసిరేయడానికి వచ్చారని అంటే నిన్ను అంటుంది. సుమిత్ర ప్రాణాలు కాపాడిన దానికి చిన్న బహుమతి అని డబ్బులు ఇస్తుంది. తనకు అవసరం లేదని తీసుకెళ్లిపొమ్మని చెప్తుంది.

జ్యోత్స్న ఇప్పుడు నిన్ను ద్వేషిస్తుంది. నిన్ను ఇష్టంగా ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు నిన్ను ద్వేషిస్తుంటే ఉండటానికి సిగ్గు లేదా. నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదని జ్యోత్స్న ఇంట్లో అందరికీ చెప్పింది. వాళ్ళు కూతురు మాట కాదనలేరు నీకు వచ్చి చెప్పలేరు అందుకే ఈ డబ్బులు ఇచ్చి నన్ను పంపించారు అని అబద్ధం చెప్తుంది.

నీ మీద ఉన్న అభిమానంతో సుమిత్ర నిన్ను పొమ్మనలేదు. నీ కారణంగా సుమిత్ర కూడా బాధపడుతుంది. నీకు తల్లి లేదు కదా ఆమె బాధ నీకు అర్థం కాదు. ఒకరిని బాధపెడుతూ బతికేది ఒక బతుకేనా. నీకు మా సుమిత్ర మీద ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా డబ్బులు తీసుకుని వెళ్లిపో ఇంటి ఛాయలకు కూడా రావద్దని అంటుంది.

Whats_app_banner