Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప సాక్ష్యంతో జ్యోత్స్న అరెస్ట్.. టెన్షన్ లో సుమిత్ర కుటుంబం, పారిజాతం ఫైర్-karthika deepam 2 serial april 26th episode the police arrest jyotsna for injuring few strangers with her car ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప సాక్ష్యంతో జ్యోత్స్న అరెస్ట్.. టెన్షన్ లో సుమిత్ర కుటుంబం, పారిజాతం ఫైర్

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప సాక్ష్యంతో జ్యోత్స్న అరెస్ట్.. టెన్షన్ లో సుమిత్ర కుటుంబం, పారిజాతం ఫైర్

Gunti Soundarya HT Telugu
Apr 26, 2024 07:38 AM IST

Karthika deepam 2 serial april 26th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తప్పతాగి యాక్సిడెంట్ చేసినందుకు కారణంగా జ్యోత్స్నని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీప తనకి తెలియకుండానే జ్యోత్స్నని పోలీసులకు అప్పగించేలా చేస్తుంది.

కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 26వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 26వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial april 26th episode: జ్యోత్స్న పార్టీలో గౌతమ్ చేసిన అవమానం తలుచుకుని రగిలిపోతుంది. ఫుల్ గా తాగేసి కారు డ్రైవ్ చేస్తూ వాటి గురించి ఆలోచిస్తుంది. జ్యోత్స్న తూలుతూ ఇంటికి రావడం దీప చూస్తుంది. తూలి కిందపడిపోతుంటే దీప వచ్చి పట్టుకుంటుంది.

బావకి నేనంటే ఇష్టం లేదు

బావ వచ్చాడా అని అడుగుతుంది. బావకి నేనంటే ప్రేమ లేదని చెప్తుంది. మందు తాగావా అని దీప అడుగుతుంది. అవును బావ కోసం తాగానని చెప్తుంది. తనని పట్టుకుని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకొస్తుంది. పారిజాతం జ్యోత్స్నని చూసి ఎప్పుడు లేనిది ఇంతగా తాగింది ఏంటని అనుకుంటుంది.

బావ నన్ను వదిలేసి వెళ్లిపోయావా? అని కలవరిస్తుంది. ఈ అమ్మాయికి తాగుడు అలవాటు కూడా ఉందా? ఇదంతా సుమిత్ర అమ్మగారికి చెప్పాలని దీప అనుకుంటుంది. అటు హైదరాబాద్ చేరుకున్న అనసూయ రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. టీ కొట్టు దగ్గరకి వెళ్ళి నరసింహ గురించి ఆరా తీస్తుంది.

సుమిత్ర ఇంటికి పోలీసులు

బంటు, పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు. దీప నన్ను గుర్తు పట్టి సుమిత్ర అమ్మగారికి చెప్పిందట పోలీసులు వచ్చారని బంటు అంటుండగా పోలీసులు రావడం చూసి టెన్షన్ తో వణికిపోతారు. దశరథ వచ్చి ఏమైందని ఎందుకు వచ్చారని అడుగుతాడు. తన పేరు బయట పెట్టొద్దని పారిజాతం బతిమలాడుతుంది.

పోలీసులు జ్యోత్స్నని పిలవమని చెప్తారు. జ్యోత్స్న రాగానే తన కారు చూపించి నైట్ ఎక్కడికి వెళ్లారు. యాక్సిడెంట్ చేయడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఒకరికి సీరియస్ గా ఉంది. ఆ యాక్సిడెంట్ చేసింది ఈ కారు. కారు మీ అమ్మాయిది అంటే యాక్సిడెంట్ చేసింది కూడా మీ అమ్మాయే అని ఎస్సై చెప్తాడు.

బంటుని ఇరికించిన పారిజాతం

జ్యోత్స్న టెన్షన్ గా రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటుంది. పారిజాతం కళ్ళతోనే మనవరాలిని నిజమేనా అంటే అవునని సైగ చేస్తుంది. వెంటనే బంటు చెంప పగలగొట్టి రాత్రి కారు వేసుకుని వెళ్ళి నువ్వు చేసిన నిర్వాకం ఇదా అని వాడి మీదకు నేరం తోసేస్తుంది.

ఎస్సై గారు కారు నడిపింది వీడే అంటుంది. దీప వస్తుంది. పుట్టినరోజు అని మా మనవరాలు మాతోనే ఉంది కారు నడిపింది వీడే తీసుకెళ్లండి అని అప్పగిస్తుంది. దీప జ్యోత్స్నని ఇంట్లోకి తీసుకొచ్చింది గుర్తు చేసుకుంటుంది. దీప నోరు విప్పితే తన మనవరాలిని అరెస్ట్ చేస్తారని పారు టెన్షన్ పడుతుంది.

బంటు కారు నడపడం ఏంటి? రాత్రి కారు తీసుకొచ్చింది జ్యోత్స్న కదాని దీప అంటుంది. పారిజాతం దీప మీద అరుస్తుంది. దీప రాత్రి జ్యోత్స్న ఈ కారు తీసుకురావడం నువ్వు చూశావా అని సుమిత్ర అడుగుతుంది. చూశానని చెప్తుంది. వచ్చినప్పుడు జ్యోత్స్న ఎలా ఉందో చూశారా? అని ఎస్సై దీపను అడుగుతాడు.

జ్యోత్స్న అరెస్ట్

సరిగా నడవలేకపోతుంటే తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టానని చెప్తుంది. ఏం జరిగిందని దీప అడుగుతుంది. ఈ అమ్మాయి బాగా తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసింది, గాయాలు అయిన వాళ్ళు హాస్పిటల్ లో ఉన్నారు. నిజం చెప్పినందుకు థాంక్స్ అంటాడు.

యాక్సిడెంట్ జరిగినప్పుడు కారుకు అంటిన రక్తపు మరకలు కూడా అలాగే ఉన్నాయి. మీ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నామని ఎస్సై చెప్తాడు. తన మనవరాలిని అరెస్ట్ చేయడానికి వీల్లేదని పారిజాతం అరుస్తుంది. జ్యోత్స్నని పోలీసు కారు ఎక్కమని ఎస్సై చెప్తాడు. అందరూ సైలెంట్ గా ఉంటారు. జ్యోత్స్నని వెళ్ళమని దశరథ చెప్తాడు.

టెన్షన్ లో కాంచన

తన మనవరాలిని తీసుకెళ్ళి పోతున్నారని ఆపమని పారిజాతం బతిమలాడుతుంది. పారిజాతం దీప వైపు కోపంగా చూస్తుంది. సుమిత్ర వెంటనే కాంచనకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. జ్యోత్స్న యాక్సిడెంట్ చేసిందని కోడలిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని కార్తీక్ కి చెప్తుంది.

జ్యోత్స్న పోలీస్ స్టేషన్ లో కూర్చుని ఏడుస్తుంది. ప్రమాదం జరిగిన వారికి సహాయం చేస్తామని, హాస్పిటల్ ఖర్చులు కూడా భరిస్తామని దశరథ సిఐ ని అడుగుతాడు. మా అమ్మాయి కోర్టులో నిలబడటం తన కెరీర్ కి నష్టమని చెప్తాడు. మీడియా వాళ్ళు మిస్ హైదరాబాద్ జ్యోత్స్న తాగి కారు నడిపి యాక్సిడెంట్ చేశారని అంటుంటారు.

పారిజాతం దీప మీద అరుస్తుంది. సుమిత్ర అడ్డుపడుతుంటే పారిజాతం మాత్రం ఆగదు. నీ ప్రాణం కాపాడింది అన్నావ్ కానీ ఈరోజు నీ పరువు తీసింది. దీనికి కారణం ఇది చెప్పిన సాక్ష్యమని అరుస్తుంది.

Whats_app_banner