Karthika deepam 2:కార్తీకదీపం 2 సీరియల్, కార్తీక్ ని శౌర్యకి దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్నని బాధపెట్టొద్దని కోరిన కాంచన
Karthika deepam 2 serial april 19th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యకు కార్తీక్ దగ్గర అవుతుండంతో ఎలాగైనా దూరం చేయాలని దీప అనుకుంటుంది. తన పాపకు దూరంగా ఉండమని చెప్తుంది. కానీ కార్తీక్ మాత్రం ఆ పని చేయలేనని అంటాడు.
Karthika deepam 2 serial april 19th episode: శౌర్య కోసం కార్తీక్ కొన్న డ్రెస్ పట్టుకుని కార్తీక్ కారు దగ్గర దీప నిలబడుతుంది. నువ్వు ఏం అడుగుతావో నాకు తెలుసు దీప అంటాడు. ఎందుకు మీరు శౌర్యకు దగ్గర అవుతున్నారు. తన విషయంలో చొరవ తీసుకుంటున్నారు.
శౌర్యకి దూరంగా ఉండు
శౌర్యతో స్నేహం చేయాల్సిన అవసరం ఏంటి? జాలి చూపిస్తున్నారా అంటుంది. అభిమానం అనుకోవచ్చు కదా అంటాడు. దానికి ఏమైనా కావాలంటే కొనివ్వడానికి తల్లిగా నేను ఉన్నాను. అలాగే ఒక ఫ్రెండ్ గా నేను ఉన్నానని అనుకోవచ్చు కదా అంటాడు.
ఎందుకు అనుకోవాలి. మీ నీడని కూడా నేను భరించలేను. మీరు కొన్న ఈ డ్రెస్ మీ మొహాన కొట్టాలని అనుకున్నానని అంటుంది. అలా కొడితే మీ కోపం తీరుతుందని అనుకుంటే భరించడానికి నేను సిద్ధమని చెప్తాడు. శౌర్య చిన్నపిల్ల దానికి కొన్ని ఆశలు ఉంటాయని అంటాడు.
అవి తీర్చడానికి మీరు ఎవరని నిలదీస్తుంది. మా అత్త ప్రాణాలు కాపాడటానికి మీరు ఎవరని అంటాడు. దేవుడి దయ వల్ల ఏమి కాలేదు కాబట్టి సరిపోయింది. కొన్ని సహాయాలకు మనసు ఉంటే చాలని చెప్తాడు. మీరు మా పాపకు దగ్గర అవడం నాకు ఇష్టం లేదు.
దీప మాట కాదన్న కార్తీక్
మేము ఇక్కడ నుంచి వెళ్లిపోయే వరకు మమ్మల్ని ఇలా ఉండనివ్వమని కార్తీక్ ని అడుగుతుంది. షాపింగ్ మాల్ లో అతన్ని చూశాను, శౌర్య కూడా చూసిందని నరసింహ గురించి కార్తీక్ చెప్తాడు. దీప కంగారుగా శౌర్యకి ఏమైనా చెప్పారా అంటుంది. కన్నతల్లి మీరే చెప్పనప్పుడు నేను ఎందుకు చెప్తానని అంటాడు. భర్తకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని అంటాడు.
అతను మాట్లాడలేదు నేను ఏం మాట్లాడలేదు. కనీసం మీరైన ఏం జరిగిందో చెప్పండని అడుగుతాడు. తెలుసుకుని ఏం చేస్తారని అంటే నాకు తోచిన సాయం చేస్తానని చెప్తాడు. నిజంగా చేస్తారా అంటే మీరు అడిగితే అది నాకు సాధ్యం కాకపోయినా సరే చేస్తానని అంటాడు.
మీరు నా కూతురికి దూరంగా ఉండాలి. ఇదే నేను మీ నుంచి ఆశించే సహాయం, ఇదొక్కటి చేయండి చాలు. ఇప్పటికే జీవితాంతం మరచిపోలేని సహాయం చేశారు ఇది కూడా చేయమని చెప్తుంది. నువ్వు అడిగిన సాయం చేయలేను దీప ఇప్పటికే పశ్చాత్తాపంతో బతుకుతున్నాను. ఆ చిన్నదాన్ని కళ్ళలో నవ్వు చూసి తృప్తి పడుతున్నాను. ఈ సాయం మాత్రం నేను చేయలేనని మనసులో అనుకుంటాడు.
అసలు ఎవడు వాడు ఆరోజు గుడిలో నన్ను కొట్టాడు, పాపని షాపింగ్ కి తీసుకెళ్తాడు. నువ్వు ఎక్కడఉన్నా వెతుక్కుంటూ వస్తాను. నువ్వు నా చేతుల్లో చచ్చావు, నిన్నే కాదు వాడిని కూడా వదిలిపెట్టనని అనుకుంటాడు. కోడలు కొన్న చీర చాలా బాగుందని కాంచన కొడుకుతో అంటుంది.
జ్యోత్స్నని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని తల్లితో చెప్పాలని అనుకుంటాడు. కానీ కాంచన ముందుగానే జ్యోత్స్న గురించి కార్తీక్ తో మాట్లాడుతుంది. నువ్వు జ్యోత్స్నని నిర్లక్ష్యం చేయొద్దు. మా అన్నయ్యకి నేనంటే ప్రాణం. ఆ ప్రేమ జీవితాంతం నాకు కావాలని స్వార్థం నాకు ఉండేది.
జ్యోత్స్నని బాధపెట్టొద్దు
మా అన్నయ్యకి కూతురు పుడితే కోడలి రూపంలో ఇంటికి తెచ్చుకోవాలని అనుకున్నాను. పసుపు కుంకుమల కింద ఏం కావాలని అడిగితే కూతురు పుడితే కోడలిగా ఇవ్వమని అడిగాను. ఇచ్చేశాడు జ్యోత్స్న అన్నయ్య కూతురు కాదు నా కోడలు. తల్లిగా నేను నిన్ను అడిగేది ఒకటే నీ విషయంలో నా కోడలి ఇష్టాన్ని ఎప్పుడు కాదనకు అని అంటుంది.
తల్లి మాటలకు కార్తీక్ చాలా బాధపడతాడు. తనతో పెళ్లి ఇష్టం లేదని చెప్తే నువ్వు ఏమైపోతావోనని అనుకుంటాడు. తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న నమ్మకం చూసి కార్తీక్ చాలా ఫీల్ అవుతాడు. కోడలి పుట్టినరోజు గురించి మాట్లాడుకుంటారు. నేను నిజం చెప్తే మీరు ఎంత బాధపడతారో అర్థం అయ్యింది నేను చెప్పకూడదు పారుతోనే చెప్పించాలని అనుకుంటాడు.
దీపకు గిఫ్ట్ ఇచ్చిన శౌర్య
శౌర్య మంచం కింద దాక్కుని మరీ బొమ్మ గీస్తుంది. దీప రావడం చూసి దాచి పెట్టేస్తుంది. ఇక నుంచి ఏం కావాలన్నా కార్తీక్ దగ్గర తీసుకోవద్దని చెప్తుంది. దీప ఇంటి ముందు చక్కగా ముగ్గు వేస్తుంది. శౌర్య వచ్చి ముద్దు పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంది.
తల్లికి బొమ్మ గీసి గిఫ్ట్ గా ఇస్తుంది. దీపకు తీసుకునే లోపు గాలికి ఎగిరిపోయి కార్తీక్ కాళ్ళ ముందు పడుతుంది. ఏంటి ఇదని అంటాడు. ఈరోజు మా అమ్మ పుట్టిన రోజు మా అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్తాడు. ఈ డ్రాయింగ్ నేనే వేశానని అంటుంది. అందులో నాన్న పేరు రాసి గాలిపటం వేస్తుంది.
ఈ పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పడానికి నాన్న వస్తాడా అని అడుగుతుంది. దీప దాని గురించి మాట్లాడకుండా ముగ్గులో వేసేందుకు పూలు తీసుకురమ్మని చెప్తుంది. పూలు పుట్టుకుంటే గొడవలు అవుతాయని శౌర్య భయపడుతుంది. ఏం కాదని దీప చెప్పి పంపిస్తుంది. శౌర్య పూలు కోయబోతుంటే బంటు వచ్చి ఆపుతాడు. పూలు కోయొద్దని అంటాడు. పూలు కోయనివ్వడం లేదని శౌర్య చెప్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.