కార్తీకదీపం 2 సీరియల్.. క్షమించమన్న దీప, అసహ్యించుకున్న జ్యోత్స్న.. పారిజాతాన్ని జైలుకి పంపిస్తానన్న బంటు-karthika deepam 2 serial today april 27th episode deepa apologises to jyotsna for revealing her identitiy to the police ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కార్తీకదీపం 2 సీరియల్.. క్షమించమన్న దీప, అసహ్యించుకున్న జ్యోత్స్న.. పారిజాతాన్ని జైలుకి పంపిస్తానన్న బంటు

కార్తీకదీపం 2 సీరియల్.. క్షమించమన్న దీప, అసహ్యించుకున్న జ్యోత్స్న.. పారిజాతాన్ని జైలుకి పంపిస్తానన్న బంటు

Gunti Soundarya HT Telugu
Apr 27, 2024 07:23 AM IST

Karthika deepam 2 serial april 27th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. పోలీసులకు నిజం చెప్పినందుకు దీప జ్యోత్స్నని క్షమించమని అడుగుతుంది. కానీ జ్యోత్స్న మాత్రం దీపని అసహ్యించుకుని వెళ్ళిపోతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 27వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 27వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial april 27th episode: దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జ్యోత్స్నని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళతారు. స్టేషన్ ముందు మీడియా వాళ్ళు జ్యోత్స్న గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు విని జ్యోత్స్న మరింత ఏడుస్తుంది.

yearly horoscope entry point

తప్పు చేసింది నా కూతురు 

ఇంటి దగ్గర పారిజాతం దీప మీద అరుస్తుంది. నీ ప్రాణం కాపాడింది అన్నావ్ ఇప్పుడు నీ పరువే తీసేసింది. దీనంతటికీ కారణం దీప అని పారు ఫైర్ అవుతుంది. నిన్న ఈ టైమ్ కి కేక్ కట్ చేస్తూ సంతోషంగా ఉన్న నా మనవరాలు సంతోషంగా ఉంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉందని పారిజాతం అంటుంది.

ఆపండి అత్తయ్య నా కూతురు ఇలాంటి పని చేసిందని బాధపడుతుంటే మీరు దీపని తిడతారు ఏంటని సుమిత్ర అడ్డం పడుతుంది. దీప నిజం మాత్రమే చెప్పింది తప్పు చేసింది నా కూతురని ఏడుస్తుంది. దీపని ఇంట్లో నుంచి గెంటేస్తే కానీ సరిపోదని పారిజాతం అరుస్తుంది.

బెయిల్ పై బయటకొచ్చిన జ్యోత్స్న 

దీపని అనాల్సిన అవసరం లేదని సుమిత్ర చెప్తుంది. లాయర్ జ్యోత్స్నకి బెయిల్ తీసుకుని వస్తాడు. కార్తీక్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు. తనని చూడగానే జ్యోత్స్న వెళ్ళి కౌగలించుకుని ఏడుస్తుంది. నేను విన్నది నిజమేనా అని కార్తీక్ అంటే అవునని తలాడిస్తుంది.

తన ప్రమేయం లేకుండానే జరిగిందని చెప్పి బాధపడుతుంది. మరీ అంతగా ఎందుకు తాగడమని అంటాడు. బెయిల్ రావడంతో జ్యోత్స్నని రిలీజ్ చేస్తారు. బయట మీడియా ఉందని ఫేస్ కవర్ చేసుకోమని చెప్పి కార్తీక్ తనని తీసుకుని వెళతాడు.

దీప కోసం వెతుకులాట 

పోలీస్ స్టేషన్ బయట ఉన్న మీడియా వాళ్ళు జ్యోత్స్నని ప్రశ్నలతో వేధిస్తారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా కార్తీక్ వాళ్ళు వెళ్లిపోతారు. అనసూయ దీప వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమో, బుడ్డదాన్ని వేసుకుని ఎక్కడ తిరుగుతుందో ఏంటోనని బాధగా ఆలోచిస్తుంది.

దీప వంటలు చేస్తుంది కదా హోటల్స్ లో వంట చేస్తూ బతుకుతుందేమో అనుకుంటుంది. ఎలాగైనా తన కొడుకు, కోడలిని పట్టుకోవాలని అనుకుంటుంది. జ్యోత్స్నని ఇంటికి తీసుకుని వస్తారు. ఎవరికి ఏం కాలేదు కదా ఎందుకు ఏడుస్తావని పారిజాతం అంటే సుమిత్ర కోపంగా తప్పు చేయలేదు పరువు తీసిందని అంటుంది.

జ్యోత్స్నని గారాబం చేసి చెడగొట్టారని సుమిత్ర పారిజాతాన్ని తిడుతుంది. ఇంటి పరువుని మీడియాలో పెట్టింది. ఇది మొత్తం పేపర్లలో వస్తుంది. తాగి తెలియకుండా కారు నడుపుతుందంటే ఏమనాలని సుమిత్ర తిడుతుంది. అనాల్సింది దీన్ని కాదు దీపని అని పారిజాతం అరుస్తుంది.

జ్యోత్స్న దీప వైపు కోపంగా చూస్తుంది. ఏం జరిగిందో తెలియదని దీప ఏడుస్తుంది. తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండాలని పారు అంటే ఆ పని చేయాల్సింది నువ్వు అని శివనారాయణ ఫైర్ అవుతాడు. నీ నీడ కూడా నా మనవరాలి మీద పడకూడదని చెప్పాను ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఏదో ఒకరోజు వస్తుందని ముందే తెలుసని అంటాడు.

దీపని వెనకేసుకొచ్చిన సుమిత్ర 

అది ఆడపిల్ల తెలియక యాక్సిడెంట్ చేసింది దాని పరువు కాపాడటం కోసం బంటుని ఇరికించాలని చూశాను కానీ దీప వచ్చి నిజం చెప్పింది. పోలీసులు తీసుకెళ్లారు దీనికి కారణం దీప కానీ అందరూ నన్ను అంటున్నారని పారిజాతం అరుస్తుంది.

పోలీసులు కంప్లీట్ ఎవిడెన్స్ తోనే వచ్చారని సుమిత్ర దీపని వెనకేసుకొస్తుంది. దీని గురించి ఇక మాట్లాడొద్దని దశరథ చెప్తాడు. దీప జ్యోత్స్న దగ్గర కూర్చుని తన చేతులు పట్టుకుని ఏడుస్తూ నేను నిజం చెప్పి తప్పు చేశానని అర్థం అయ్యింది నన్ను క్షమించు జ్యోత్స్న అంటుంది.

దీపని అసహ్యించుకున్న జ్యోత్స్న 

జ్యోత్స్న మాత్రం చేతులు చీదరించుకుని కోపంగా వెళ్ళిపోతుంది. పారిజాతం దీపని నానా మాటలు అంటూనే ఉంటుంది. దీప కోసం వెతికి వెతికి అనసూయ అలిసిపోతుంది. తనకి ఫోన్ చేద్దామని అంటే ఫోన్ కూడా పని చేయడం లేదు, రేపు ఒక్కరోజు తన కోసం వెతికి ఊరు వెళ్లిపోవాలని అనుకుంటుంది.

రోడ్డు పక్కనే నిద్రపోతుంది. ఇక తన మనవరాలు దీపని దగ్గరకు కూడా రానివ్వదని పారిజాతం సంతోషపడుతుంది. బంటు వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నానని చెప్తాడు. ఎందుకని పారిజాతం కంగారుపడుతుంది. సుమిత్రమ్మని చంపాలని చూసింది నేనే అని ఒప్పుకోవడానికని అంటాడు.

దేవతలా వచ్చింది 

నన్ను చంపమని చెప్పింది మీరే అని చెప్తాను. ఈ అమ్మగారిని వదిలేసి ఎక్కడికి పోతావని అంటుంది. వదిలేసి పోను నాతో పాటు మిమ్మల్ని జైలుకి తీసుకెళ్ళి పోతానని చెప్తాడు. మీ మనవరాలి కోసం నన్ను ఇరికిస్తారా? దేవతలా దీప వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది లేదంటే పోలీసులు నన్ను తీసుకెళ్ళేవాళ్ళని అంటాడు.

ఇన్నాళ్ళూ మీ పెదవుల మీద చిరునవ్వు కోసం ఎన్నో చేశాను కానీ మీరు ఇలా చేశారని తనని భయపెడతాడు. భక్తిని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వమని అడుగుతావు కదా దాని చెక్ చేయడానికి నీకోక చిన్న పరీక్ష పెట్టానని పారిజాతం కవర్ చేస్తుంది.

విశ్వాసంలో మీ నాన్న అంత గొప్పవాడివి కాదు నువ్వు అంటుంది. నాలుగు సెంటి మెంట్ డైలాగులు కొట్టి వాడి మనసు మార్చేస్తుంది. దీంతో బంటు పారు బుట్టలో పడిపోతాడు.

 

Whats_app_banner