Karthika deepam 2: కార్తీక దీపం 2 సీరియల్..అందరి ముందు పారిజాతానికి వార్నింగ్ ఇచ్చిన దీప.. అడ్డంగా దొరికిపోయిన బంటు-karthika deepam 2 serial today april 22nd episode parijatham gets annoyed with bantu attempts to keep her happy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్..అందరి ముందు పారిజాతానికి వార్నింగ్ ఇచ్చిన దీప.. అడ్డంగా దొరికిపోయిన బంటు

Karthika deepam 2: కార్తీక దీపం 2 సీరియల్..అందరి ముందు పారిజాతానికి వార్నింగ్ ఇచ్చిన దీప.. అడ్డంగా దొరికిపోయిన బంటు

Gunti Soundarya HT Telugu
Apr 22, 2024 07:19 AM IST

Karthika deepam 2 serial today april 22nd episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తన తండ్రి గురించి తక్కువ చేసి మాట్లాడిన పారిజాతానికి దీప అందరి ముందు వార్నింగ్ ఇస్తుంది. దీంతో పారు బిత్తరపోతుంది.

కార్తీకదీపం సీరియల్ ఏప్రిల్ 22వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం సీరియల్ ఏప్రిల్ 22వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today april 22nd episode: అనసూయ తన ఇంటిని వేలానికి వేయొద్దని ఊరి ప్రెసిడెంట్ ని బతిమలాడుతుంది. ఒక వారం రోజులు టైమ్ ఇవ్వమని అడుగుతుంది. ఒకవేళ రాకపోతే అప్పుల వాళ్ళం అందరం కలిసి ఇల్లు వేలం వేసుకుంటాం. దీనికి సరే అంటేనే వెళ్ళాలి లేదంటే ఇల్లు వేలం వేస్తామని మల్లేష్ అంటాడు.

కుబేరని అవమానించిన పారిజాతం

అనసూయ కన్నీళ్లతో అందుకు సరే అంటుంది. అలా అని చెప్పి కాగితాల మీద అనసూయతో వేలు ముద్ర వేయించుకుంటాడు. అనసూయకి డబ్బులు ఇచ్చి హైదరాబాద్ పంపించమని ప్రెసిడెంట్ చెప్తాడు. దీప, సుమిత్ర అందరూ కలిసి గుడికి వెళతారు.

దీప పేరు మీద కూడా అర్చన చేయమని సుమిత్ర చెప్తుంది. గోత్రం వివరాలు చెప్పమని పూజారి అడిగితే తనకు అవేవీ తెలియవని అంటుంది. తల్లిదండ్రుల పేర్లు చెప్పమంటే తన తండ్రి పేరు కుబేర అని చెప్తుంది. అబ్బో పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో ఏమి లేకపోయినా పేరు పెట్టుకున్నారా అంటూ పారిజాతం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.

దీప వార్నింగ్

దీప కోపంగా పారిజాతంగారు అని అరుస్తుంది. మా నాన్న ధనానికి పేదవాడు కావచ్చు కానీ ణా మీద ప్రేమ పంచడంలో ఎప్పుడు కుబేరుడే. నన్ను అనండి పడతాను కానీ మా నాన్న గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించనని అందరి ముందు దీప వార్నింగ్ ఇస్తుంది.

ఇది పైకి ప్రశాంతంగా కనిపించే అగ్నిపర్వతం అనిపిస్తుంది. ఇది పడుతున్న బాధలు తెలుసుకుని సాయం చేయాలని సుమిత్ర మనసులో అనుకుంటుంది. గుడిలో గంట కొట్టేందుకు శౌర్య ఎగురుతుంటే కార్తీక్ ఆట పట్టిస్తాడు. తను చిటికే వేస్తే అందుతుందని శౌర్య అంటుంది.

దీపకు దొరికిపోయిన బంటు

చిటికే వేస్తూ కార్తీక్ అని పిలుస్తుంది. వెంటనే కార్తీక్ వచ్చి తనని ఎత్తుకుని గంట కొట్టిస్తాడు. దీప గుడిలో ప్రదక్షిణలు చేస్తుంటే సుమిత్ర మీద దాడి చేసిన వాడు కనిపిస్తాడు. వాడితో బంటు మాట్లాడుతూ ఉండటం దీప చూస్తుంది. పరుగున సుమిత్ర వాళ్ళ దగ్గరకు వెళ్ళి గుడిలో మిమ్మల్ని చంపాలనుకున్న వాడిని చూశానని చెప్తుంది.

బంటు మాట్లాడుతుంటే చూశానని అంటే కార్తీక్ వెంటనే బయటకు వస్తాడు. కానీ అక్కడ బంటు మాత్రమే ఉంటాడు. కార్తీక ని చూసి ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తాడు. ఇప్పటి వరకు నీతో మాట్లాడిన వాడు ఎక్కడని బంటుని కార్తీక్ కోపంగా అడుగుతాడు.

బంటుని కొట్టిన పారు

గుడిలో అమ్మగారిని కొట్టబోయిన మనిషి వాడే, వాడితో నువ్వు మాట్లాడావ్ కదా దీప అంటుంది. వాడు వెళ్లిపోయాడని బంటు చెప్తాడు. అంటే నువ్వు మాట్లాడావనే అర్థం వాడికి నీకు ఏంటి సంబంధమని కార్తీక్ బంటు కాలర్ పట్టుకుని నిలదీస్తాడు. పారిజాతం కావాలని కార్తీక్ ని తప్పించి బంటు చెంపలు వాయిస్తుంది.

ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చాను హాస్పిటల్ ఎక్కడని అడిగాడని అబద్ధం చెప్తాడు. వీడు చెప్పేది నిజం అయితే వాడు మనల్ని ఫాలో చేస్తున్నాడు. మన శత్రువులు ఎక్కడో లేరత్త మన చుట్టూ ఉన్నారని కార్తీక్ వెంటనే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు.

దీపని చంపేస్తానన్న బంటు

దీప బంటుని అనుమానంగా చూస్తుంది. ఈ దీప ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమేనని కంగారుపడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత పారు బంటు మీద చిందులేస్తుంది. కాసేపు వాడిని తిడుతుంది. నేను ఏం చేసినా మీ పెదవుల మీద చిరునవ్వు కోసమని అంటాడు.

మీ కోసం సుమిత్రని వేసేయాలని అనుకున్నాను. ఎవరూ లేని ఆ దీపని వేసేయడం ఎంతసేపు అంటాడు. దీంతో పారు వణికిపోతుంది. ఇప్పటికీ చేసింది చాలు దీని నుంచి ముందు బయట పడాలని అంటుంది. దీప కష్టం ఎలాగైనా తెలుసుకోవాలని సుమిత్ర అనుకుంటుంది.

IPL_Entry_Point