Bank Account : చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం ఎలా?
Money Withdraw From Dead Person Account : చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య.. చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి డబ్బులు తీయడం ఎలా అని. ఇష్టం వచ్చినట్టుగా తీయడం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.
కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. వారి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునేందుకు కొన్ని నియమాలు ఉంటాయి. కనీసం వారి ఏటీఎమ్ వాడిన కూడా తప్పే అనే విషయం అందరూ తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత, అతని కుటుంబ సభ్యులు అతని బ్యాంకు ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయడం చట్టవిరుద్ధమని మనందరం తెలుసుకోవాలి.
ఒక వ్యక్తి అనుకోకుండా లేదా వృద్ధాప్యం కారణంగా మరణించినప్పుడు, అతని బంధువులు అతని చనిపోయిన తర్వాత అతని బ్యాంకు ఖాతా నుండి ATM ద్వారా డబ్బును తీసుకుంటారు. కానీ చనిపోయిన వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ గా జమ చేసిన డబ్బును వారు తీసుకోలేరు. ఇది నేరుగా వెళ్లి అడిగితే ఏ బ్యాంకు అధికారి అయినా.. సంబంధిత పత్రాలు తీసుకుని రమ్మని చెబుతారు. ఇష్టం వచ్చినట్టుగా తీసుకునేందుకు వీలు లేదని చెబుతారు.
ఆ కుటుంబం అతని మరణ ధృవీకరణ పత్రంతో సహా సంబంధిత పత్రాలను బ్యాంకులో ఇచ్చి.. ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బును పొందడానికి ప్రయత్నిస్తారు. ఫలానా వ్యక్తి మరణించిన తరువాత అతని నుండి డబ్బు విత్‌డ్రా అయ్యిందని తెలిస్తే అది పెద్ద సమస్య కూడా కొన్ని సందర్భాల్లో అుతుంది. ATM ద్వారా లేదా చెక్ ద్వారా తీసుకునే ప్రయత్నం చేసినా కూడా సమస్యే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఎందుకంటే భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఖాతా నుండి చెక్కు లేదా ATM కార్డు ద్వారా డబ్బు తీసుకోవడం తప్పు. సంబంధిత బ్యాంక్ అధికారులకు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చి.. వారు చెప్పిన విధానాలను పాటించాలి. ఇది అనవసరమైన సమస్యలను నివారించడానికి ప్రవేశపెట్టిన పద్ధతి. అయితే చనిపోయిన వ్యక్తి డిపాజిట్, బ్యాంక్ ఖాతాలోని డబ్బును విత్‌డ్రా చేయడం ఎలా అని చాలా మందికి ప్రశ్నలు ఉంటాయి.
ప్రతి ఒక్కరూ తమ కోసం బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు, వారి కుటుంబంలోని ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులను నామినీలుగా చేర్చుకోవడం అనేది ఉంటుంది. వ్యక్తి మరణానంతరం మరణ ధృవీకరణ పత్రంతో పాటుగా, మరికొన్ని పత్రాలను బ్యాంకుకు తీసుకెళ్లాలి. నామినీలు వారికి ఇచ్చిన కొన్ని సూచనలను పాటించాలి.
నామినీలు వారి స్వంత KYC విధానాలను పూర్తి చేయాలి. ప్రభుత్వ అధికారుల నుండి సంబంధిత పత్రాలపై ధృవీకరణ పొందాలి. బ్యాంక్ నుండి డబ్బును స్వీకరించడానికి అన్ని పత్రాలతో పాటు మరణించిన వారి మరణ ధృవీకరణ పత్రాన్ని బ్యాంకుకు సమర్పించాలి.
నామినీ కేవలం డబ్బుకు సంరక్షకుడు మాత్రమే, డబ్బును మరణించిన వారి వారసులకు సమానంగా పంపిణీ చేయాలి. గందరగోళం ఏర్పడితే దానిని చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి. అయితే కొందరు నామినీలు తమకే మెుత్తం అని తీసుకుని.. తర్వాత చట్టపరమైన చిక్కుల్లో పడతారు.
అదేవిధంగా ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు నామినీని పెట్టకపోయినా.. వారి మరణం తర్వాత చట్టబద్ధమైన వారసుల ధృవీకరణ పత్రాన్ని, మరణ ధృవీకరణ పత్రానికి జతచేయాలి. అంతేకాదు సంబంధిత ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించాలి. వారసులందరూ ఒప్పుకొన్న తర్వాతే మరణించిన వారి బ్యాంకు ఖాతాలోని డబ్బును ఉపయోగించవచ్చు.
నామినీ ఐడీ, అడ్రస్ ప్రూఫ్ అన్ని సమర్పించాలి. తర్వాత వారసుల అందరికీ డబ్బుపై హక్కు ఉంటుంది. ఒకవేళ నామినీ మాత్రమే డబ్బు తీసుకోవాలని తప్పుడు ఆలోచన చేస్తే సమస్యల్లో పడే అవకాశం ఉంది. విల్లులో ప్రస్తావిస్తే.. దానిప్రకారం తీసుకోవాలి. నామినీ కూడా చట్టబద్ధమైన వారసుడైతే క్లేయిమ్ చేసుకోవచ్చు. మెుత్తానికి ఆ డబ్బును చట్టబద్ధమైన హక్కుదారులకు అందజేయాలి.