Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. మనసుల్ని మెలిపెట్టించేసిన వంటలక్క, దీపని కార్తీక్ తిరిగి ఇంటికి తీసుకురాగలడా?-karthika deepam 2 serial today may 1st episode deepa gets angry with karthik for arguing with mallesh in the village ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. మనసుల్ని మెలిపెట్టించేసిన వంటలక్క, దీపని కార్తీక్ తిరిగి ఇంటికి తీసుకురాగలడా?

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. మనసుల్ని మెలిపెట్టించేసిన వంటలక్క, దీపని కార్తీక్ తిరిగి ఇంటికి తీసుకురాగలడా?

Gunti Soundarya HT Telugu
May 01, 2024 07:21 AM IST

Karthika deepam 2 serial may 1st episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. పారిజాతం మాటలకు బాధపడి దీప ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. రోడ్డు మీద వెళ్తున్న దీప కార్తీక్ కంట పడుతుంది. మల్లేష్ ని కొట్టిన విషయం కార్తీక్ దీపకు చెప్పేస్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ మే 1వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 1వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial may 1st episode: పారిజాతం దీప దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్తుంది. ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయలకు కూడా రావద్దని అంటూ హేళనగా మాట్లాడుతుంది. సుమిత్ర లోపల కూతురు దగ్గర కూర్చుని ఏడుస్తుందని చెప్తుంది.

దీప డబ్బులు పారిజాతం చేతిలో పెట్టి వెళ్లిపొమ్మని చెప్తుంది. శౌర్య రాగానే ఊరు వెళ్తున్నామని అంటుంది. సైకిల్ తెచ్చుకోవడానికి ఊరు వెళ్తున్నామని చెప్పేసరికి శౌర్య చాలా సంతోషిస్తుంది. కూతురు మెడలో శివనారాయణ వేసిన చైన్ కూడా తీసి అక్కడ పెట్టేస్తుంది.

ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దీప

ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోవాలని అనుకుంటున్నామని సుమిత్రకు మనసులోనే క్షమాపణ చెప్పుకుంటుంది. దీప, శౌర్య రోడ్డు మీద నడుస్తూ వెళ్ళడం కార్తీక్ చూస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారని శౌర్యని కార్తీక్ అడుగుతాడు. సైకిల్ తెచ్చుకోవడానికి వెళ్తున్నానని శౌర్య అంటే మరి చెప్పలేదే అంటాడు.

అమ్మమ్మకి చెప్పామని అనేసరికి కార్తీక్ దీప వైపు చూస్తాడు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్తున్నారని అర్థం అయ్యింది. టీవీలో వచ్చిన న్యూస్ గురించి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా అంటుంది. నేను ఊరు వచ్చిన పని అయిపోయింది వెళ్లిపోతున్నానని చెప్తుంది.

మా నాన్నని మీరే చంపేశారు

పాప దృష్టిలో నాన్న ఇంకా దొరకలేదు కదా. ఆ నాన్న ఎప్పటికీ దొరకడు, ఎందుకంటే అలాంటి నాన్న కూడా లేడు. అది కోరుకునే మంచి నాన్నని తీసుకురాలేను. అలాగని ఆ నీచుడిని నాన్న అని చెప్పలేను. ఏదో ఒక రోజు నాన్న ఎక్కడని అంటే ఏం చెప్తారని అడుగుతాడు. మీ నాన్న చచ్చిపోయాడని చెప్తానని అంటుంది.

నాన్న చేతులో పెరిగి నాన్న తప్ప ఎవరూ లేకుండా ఉన్న నేను నా కళ్ళ ముందే మీరు నాన్నని చంపేస్తే ఆయనతో పాటు నేను చనిపోలేదు కదా. నేనే తట్టుకున్నా అది తట్టుకోలేదా? దాని కళ్ళ ముందుకు వచ్చిన బూచోడు నాన్న అని చెప్తే అది నాన్న అనే పిలుపుని అసహ్యించుకుంటుంది.

నన్ను ఎవరో ఏదో అన్నారని కాదు నా గురించి నేను ఆలోచించుకుని దొంగలా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతున్నానని అంటుంది. అంత అవసరం ఏంటని అడుగుతాడు. కారణం మీరే బాబు. మీరు పాపకు ఎంత దూరంగా ఉండమని చెప్తే అంత దగ్గర అవుతున్నారు.

మిమ్మల్ని క్షమించలేను

అది నా దగ్గర ఉన్న మీ గురించి మాట్లాడేలా చేస్తున్నారు. నిజం దానికి తెలియదు కదా మీరు దాని మీద చూపించే ప్రేమ నటన అని. నా కూతురు ద్వారా నా దృష్టిలో మంచి వాడు అనే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఆ అవసరం లేదు. నా తండ్రి తిరిగి రాడు అనేది ఎంత నిజమో నా తండ్రిని చంపిన మిమ్మల్ని కూడ క్షమించలేను.

నేను ఇక్కడే ఉంటే మీరే దాని తండ్రిని చూపిస్తారు ఏమో లేదంటే అది నా గురించి ఏమైనా అనుకుంటుంది. కార్తీక్ నిజం చెప్పడానికి చూస్తుంటే దీప చెప్పకుండా ఆపేస్తుంది. కార్తీక్ వడ్డీ మల్లేష్ దగ్గర ఉన్న అప్పు గురించి మాట్లాడతాడు. వాడు మీ ఇంటి దగ్గర గొడవ చేస్తుంటే దారిలో ఆపి మీ ఇంటి అడ్రస్ అడిగాను.

మల్లేష్ ని కొట్టాను

నీ గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. లాగిపెట్టి కొట్టానని చెప్తాడు. ఆరోజే నాకు అర్థం అయ్యింది ఊర్లో మీ పరిస్థితి ఏంటోనని అంటాడు. దీప కన్నీళ్ళు పెట్టుకుంటూ నన్ను ఒక మాట అన్నాడని చెంప మీద కొట్టారు. కానీ వాడు నా గుండెల మీద కొట్టాడు నా ఆడతనాన్ని పంచాయతీ పెట్టాడు.

ఏ తోడు లేని నేను దిక్కు తోచని స్థితిలో కూతురిని తీసుకుని తెలియని ఊరికి మొగుడిని వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది. మీరు మల్లేష్ ని కొట్టిన చెంప దెబ్బ నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టింది. నేను అడగకుండానే ఎంతో సాయం చేశారు ఇది మంచిదే కొన్ని నిజాలు తెలిసాయి. ఇక్కడే ఉంటే మీరు నా కూతురిని కూడా దూరం చేస్తారు.

క్షమించమని అడిగే అర్హత లేదు

మేము మీకు కనిపించిన విషయం మీరు ఎవరితో చెప్పొద్దని దీప అనేసరికి కార్తీక్ మౌనంగా ఉంటాడు. శౌర్యని తీసుకుని దీప వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పింది విన్న తర్వాత నాకు క్షమించమని అడిగే అర్హత కూడా లేదని అర్థం అయ్యింది. ఇక ఈ బాధని జీవితాంతం మోయాల్సిందేనని అనుకుంటాడు.

పోలీసులు ఇంటికి వచ్చి సుమిత్ర మీద దాడి చేసిన వాళ్ళని పట్టుకున్నామని ఐడెంటిఫికేషన్ కోసం దీపణి రమ్మని చెప్తారు. దీపని పిలవమని జ్యోత్స్నకి చెప్తారు. ఇల్లు గడిపెట్టి ఉండటం, బట్టలు కూడా లేకపోవడం చూసి దీప వెళ్లిపోయిందని జ్యోత్స్న అర్థం చేసుకుంటుంది.

దీప వెళ్లిపోయిందని సుమిత్ర వాళ్ళకి చెప్తుంది. కబోర్డ్ లో చైన్ దొరికిందని చెప్పి ఇస్తుంది. దీప ఊరు వదిలి వెళ్లిపోయిందని తెలిసి పారిజాతం సంతోషిస్తుంది. ఎస్సై సుమిత్ర వాళ్ళని నిందిస్తాడు. తను వెళ్లిపోయిందా మీరే సైలెంట్ గా పంపించేశారా? అంటాడు.

దీపని తీసుకొస్తాడా?

సుమిత్ర గారి మీద ప్రమాదం కేసు, జ్యోత్స్న యాక్సిడెంట్ కేసులో ప్రధాన సాక్షి దీప. మొదటి కేసు మీకు అవసరం కాబట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. రెండో కేసు మీకు ప్రమాదం కాబట్టి సాక్ష్యాన్ని మాయం చేశారని ఎస్సై అంటాడు. దీప బాధ్యత మీరే తీసుకున్నారు కదా మీ కూతురు దాకా వచ్చేసరికి పంపించేశారా? అని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు.

కార్తీక్ వచ్చి తనని ఆపుతాడు. దీపని ఎవరూ పంపించలేదని తనే వెళ్లిపోయిందని కార్తీక్ చెప్తాడు. దీప ఎక్కడ ఉందో తెలుసా అని ఎస్సై అంటే తెలుసని అంటాడు. మీరు ఎవరి మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు దీపని తీసుకొస్తానని కార్తీక్ ఎస్సైతో చెప్తాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

 

Whats_app_banner