Karthika Deepam TRP: కార్తీక దీపం వచ్చీ రాగానే టాప్ టీఆర్పీల్లోకి.. స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే-karthika deepam and other star maa serials trp ratings are here brahma mudi on top tv serials trp ratings ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Trp: కార్తీక దీపం వచ్చీ రాగానే టాప్ టీఆర్పీల్లోకి.. స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

Karthika Deepam TRP: కార్తీక దీపం వచ్చీ రాగానే టాప్ టీఆర్పీల్లోకి.. స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

Hari Prasad S HT Telugu
Apr 30, 2024 12:21 PM IST

Karthika Deepam serial TRP: స్టార్ మాలో కార్తీక దీపం సీరియల్ వచ్చీ రాగానే టాప్ టీఆర్పీలను సొంతం చేసుకుంటోంది. ఈ ఛానెల్లో వస్తున్న సీరియల్స్ లో టాప్ 10 టీఆర్పీలు ఉన్న సీరియల్స్ ఏంటో ఇక్కడ చూడండి.

కార్తీక దీపం వచ్చీ రాగానే టాప్ టీఆర్పీల్లోకి.. స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే
కార్తీక దీపం వచ్చీ రాగానే టాప్ టీఆర్పీల్లోకి.. స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

Karthika Deepam serial TRP: స్టార్ మా ఛానెల్లో ఇప్పటి వరకూ వచ్చిన టాప్ సీరియల్స్ లో ఒకటి కార్తీక దీపం. ఈ సీరియల్ తొలి సీజన్ కు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో ఈ మధ్యే కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ కొత్త సీజన్ కూడా వచ్చీ రాగానే టీఆర్పీల్లో దుమ్ము రేపుతోంది. స్టార్ మా సీరియల్స్ లో ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లడం విశేషం.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

స్టార్ మా సీరియల్స్ లో టాప్ 10 టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకున్న సీరియల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. ఎప్పటిలాగే బ్రహ్మముడి తన తిరుగులేని నంబర్ 1 స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 19తో ముగిసిన వారానికిగాను ఈ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ చేశారు. బార్క్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారమే ఈ సీరియల్స్ కు వచ్చిన రేటింగ్స్ ఇక్కడ ఉన్నాయి.

బ్రహ్మముడి సీరియల్ అర్బన్, రూరల్ కలిపి 11.26 టీఆర్పీతో తొలి స్థానంలో కొనసాగుతోంది. ఇక కార్తీక దీపం సీరియల్ కు 10.63 టీఆర్పీ నమోదైంది. ఈ రెండు సీరియల్స్ మాత్రం రెండంకెల రేటింగ్స్ అందుకున్నాయి. తర్వాత టాప్ 10లో ఉన్న సీరియల్స్ అన్నీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి.

మూడో స్థానంలో కృష్ణా ముకుందా మురారి సీరియల్ ఉంది. ఆ వారంలో ఈ సీరియల్ కు అర్బన్, రూరల్ కలిపి 8.75 టీఆర్పీ వచ్చింది. ఇక నాలుగో స్థానంలో 8.55 టీఆర్పీతో నువ్వు నేను ప్రేమ, ఐదో స్థానంలో 8.19 టీఆర్పీతో గుండె నిండా గుడి గంటలు, ఆరో స్థానంలో 5.69 టీఆర్పీతో గుప్పెడంత మనసు, ఏడో స్థానంలో 5.38 టీఆర్పీతో వంటలక్క, ఎనిమిదో స్థానంలో 5.34 టీఆర్పీతో సత్యభామ, తొమ్మిదో స్థానంలో 5.15 టీఆర్పీతో మగువా ఓ మగువా, పదో స్థానంలో 4.86 టీఆర్పీతో మామగారు సీరియల్స్ ఉన్నాయి.

కార్తీక దీపం సీరియల్

కార్తీక దీపం సీరియల్ రెండో సీజన్ మార్చి 25 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. కార్తీక దీపంలో డాక్ట‌ర్ బాబుగా నిరుప‌మ్‌, వంట‌ల‌క్క‌గా ప్రేమీ విశ్వ‌నాథ్ పాత్ర‌లు అభిమానుల‌ను అల‌రించాయి. కార్తీక దీపం సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క, డాక్ట‌ర్ బాబు పాత్ర‌లు చాలా పాపుల‌ర్ అయ్యాయి. ముఖ్యంగా వంట‌ల‌క్క పాత్ర‌లో ప్రేమీ విశ్వ‌నాథ్ న‌ట‌న‌కు బుల్లితెర ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. . తెలుగులో హ‌య్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ద‌క్కించుకున్న సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా కార్తీక దీపం నిలిచింది.

కార్తీక దీపం సీజ‌న్ వ‌న్ 2017 అక్టోబ‌ర్ 16 నుంచి ప్రారంభ‌మైంది. మొత్తం 1569 ఎపిసోడ్స్‌తో దాదాపు ఆరేళ్ల పాటు టెలికాస్ట్ అయ్యింది. లాక్‌డౌన్ కార‌ణంగా కొద్ది రోజుల పాటు షూటింగ్ నిలిచిపోవ‌డం, వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు పాత్ర‌ల‌ను చ‌నిపోయిన‌ట్లుగా చూపించ‌డంతో టీఆర్‌పీ రేటింగ్స్ దారుణంగా ప‌డిపోయాయి.

శౌర్య‌, హిమ క్యారెక్ట‌ర్స్‌ను పెద్ద‌వాళ్లు అయిన‌ట్లుగా చూపించి కొత్త క్యారెక్ట‌ర్‌తో కొన్నాళ్లు సీరియ‌ల్‌ను న‌డిపించారు. కానీ అనుకున్న స్థాయిలో డ్రామా పండ‌క‌పోవ‌డంతో స‌రైన ముగింపు లేకుండా అర్థాంత‌రంగా కార్తీక దీపం సీరియ‌ల్‌ను ముగించి ఫ్యాన్స్‌ను డిస‌పాయింట్ చేశారు.