కార్తీకదీపం 2 సీరియల్.. దీప, కార్తీక్ ని అపార్థం చేసుకున్న జ్యోత్స్న.. కొత్తగా జీవితం ప్రారంభించిన వంటలక్క
Karthika deepam 2 serial today may 7th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ టీ తాగేందుకు దీప ఉన్న టీ కొట్టు దగ్గరకే వెళతాడు. దీప, కార్తీక్ ని చూసి జ్యోత్స్న తప్పుగా అర్థం చేసుకుంటుంది.
Karthika deepam 2 serial today may 7th episode: దీప అనసూయ మాటలు తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, కూతురిని తీసుకుని ఊరు వెళ్లలేను. ఆ ఇంటి వాళ్ళ మీద ఆధారపడలేను. నాలాంటి బతుకు నా కూతురికి ఉండకూడదు. అలా జరగాలంటే ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటుంది.
కొత్త క్యారెక్టర్ ఎంట్రీ
దీప ఏడుస్తుంటే అక్కడ ఒక వ్యక్తి వచ్చి పలకరిస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావని అంటాడు. నువ్వు ఇక్కడ బతకడానికి వచ్చావా అంటాడు. రావడానికి వేరొక కారణం ఉంది కానీ ఇక ఇక్కడే బతకాలని అనుకుంటునట్టు చెప్తుంది. దీప కూడా అతని వివరాలు అడుగుతుంది.
బతకడం కోసం పట్నం వచ్చాను కానీ బతకలేనని తెలిసి వెళ్లిపోవాలని అనుకున్నట్టు చెప్తాడు. నా పేరు కడియం. ఇక్కడికి దగ్గరలోనే ఒక స్థలం అద్దెకు తీసుకుని హోటల్ పెట్టాను. కరోనా తర్వాత జనం రావడం మానేశారు. ఈ మధ్యలో చుట్టుపక్కల హోటల్స్ ఎక్కువ కావడంతో గిరాకీ తగ్గిపోయింది. అద్దె కట్టలేని పరిస్థితి వచ్చింది.
సాయం చేస్తానన్న దీప
నాలుగు నెలల నుంచి ఇంటి అద్దె కూడా కట్టుకోలేకపోతున్న. అందుకే ఇక్కడ ఉండలేక ధైర్యంగా పారిపోతున్నానని తన కష్టం చెప్పుకుంటాడు. కష్టాలు చూసి భయపడి పారిపోవద్దు నీకు సాయంగా నేను ఉంటానని అంటుంది. నాకు ఉపాధి కావాలి మీకు మీ హోటల్ బాగుండటం కావాలి.
నాకు హోటల్ కి సంబంధించి అన్ని పనులు వచ్చు. నా కోసం దేవుడే మిమ్మల్ని పంపించినట్టు ఉన్నాడు. నాకొక అవకాశం ఇవ్వమని అడుగుతుంది. కార్తీక్, శౌర్య ఆదుకోవడం చూసి జ్యోత్స్న, పారిజాతం రగిలిపోతారు. అమ్మ ఇంకా రాలేదు భయంగా ఉందని శౌర్య అంటుంది.
అమ్మ రాకపోతే తన గురించే భయం. షాపింగ్ మాల్ లో కనిపించిన బూచోడు మళ్ళీ అమ్మకి ఎదురుపడితే అని భయపడుతుంది. కార్తీక్ ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళమని పారిజాతం జ్యోత్స్నకి చెప్తుంది. తనని అర్జెంట్ గా బయటకు తీసుకుని వెళ్ళమని జ్యోత్స్న అడుగుతుంది.
వంటలక్కగా మారిన దీప
ఆ మాట ఈ మాట చెప్పి కార్తీక్ ని జ్యోత్స్న బయటకు తీసుకుని వెళ్తుంది. పారు జాగ్రత్త అంటే నేనేమీ శౌర్యని అననులే అంటుంది. నువ్వు కాదు అది నిన్ను అంటుంది. జో వెళ్లిపోతూ తమ ప్లాన్ వర్కౌట్ అయిందని కన్ను కొట్టుకుని సైగ చేసుకుంటారు.
అప్పుడే కడియం హోటల్ లో టీ పెడుతుంది. దారిలో ఏదైనా టీ సెంటర్ ఉంటే ఆపుతాను అక్కడ టీ తాగుదామని చెప్తాడు. సరిగ్గా కార్తీక్ వాళ్ళు టీ తాగడం కోసం కారు అక్కడే ఆపుతారు. టీ తాగడానికి రమ్మంటే జ్యోత్స్న రానని చెప్తుంది. కార్తీక్ కారు దిగి అక్కడ దీప ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు.
దీప, కార్తీక్ ని అపార్థం చేసుకున్న జ్యోత్స్న
దీప కార్తీక్ కి టీ ఇస్తుంది. దీప వైపు కార్తీక్ కోపంగా చూస్తాడు. టీ ఎలా ఉందని కడియం అంటే బాగుంది చాలా బాగుంది కొత్తగా ఉందని అంటాడు. టీ మా దీపమ్మ పెట్టింది. ఇవాళే ఓపెన్ చేశాం రేపటి నుంచి అన్నీ ఉంటాయి. రమ్మని అంటాడు. మీరు ఇక్కడ పని చేస్తున్నట్టు ఇంట్లో తెలుసా అని దీపని అడుగుతాడు.
తెలుసు మా తాతగారి ఇంట్లో ఉంటుందని చెప్తాడు. ఇంత గొప్ప వాళ్ళ ఇంట్లో ఉంటూ పనికి వచ్చావ్ ఏంటని కడియం అడుగుతాడు. నా కాళ్ళ మీద నేను నిలబడటానికని అంటుంది. టీ తాగి రావడానికి ఇంత టైమా అని జ్యోత్స్న కార్తీక్ ని పిలుద్దామని వెనక్కి తిరిగి చూస్తుంది.
దీపకు ఉన్న విలువ నాకు లేదా?
దీప కార్తీక్ ని చూసి ఆశ్చర్యపోతుంది. నీకు టీ తాగాలని అనిపించడానికి కారణం ఇదా. కారులో నన్ను కూర్చోబెట్టి దీపతో టీ తాగుతూ కబుర్లు చెప్తున్నావా? నేనంటే ఇంత నిర్లక్ష్యమా దీపకు ఉన్న విలువ కూడా నాకు నీ దగ్గర లేదా అని జ్యోత్స్న మండిపోతుంది.
ఇంటి దగ్గర శౌర్య ఎదురుచూస్తుందని రమ్మని కార్తీక్ అడుగుతాడు. తర్వాత వస్తానని అంటే రౌడీ భయపడుతుందని చెప్తాడు. నేను వెళ్లిపోతున్నానని రాను అనుకోవద్దు తప్పకుండా వస్తానని ఈరోజు నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నానని దీప కడియం బాబాయ్ కి హామీ ఇస్తుంది. కార్తీక్ కారు దగ్గరకు వచ్చి చూసేసరికి కారులో జ్యోత్స్న ఉండదు. కార్తీక్ జో కోసం వెతుకుతాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్