Connected car technology : కారులో ఈ ఫీచర్​ వాడుతున్నారా? ‘స్పై’ చేసి మరీ ప్రీమియం పెంచుతున్నారు!-your connected car may be a hi tech spying tool for insurers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Connected Car Technology : కారులో ఈ ఫీచర్​ వాడుతున్నారా? ‘స్పై’ చేసి మరీ ప్రీమియం పెంచుతున్నారు!

Connected car technology : కారులో ఈ ఫీచర్​ వాడుతున్నారా? ‘స్పై’ చేసి మరీ ప్రీమియం పెంచుతున్నారు!

Sharath Chitturi HT Telugu
Mar 17, 2024 11:27 AM IST

Connected car technology disadvantages : ‘కనెక్టెడ్​ కార్​’ టెక్నాలజీతో.. ఇన్ష్యూరెన్స్​ కంపెనీలు, మీకు తెలియకుండానే మిమ్మల్ని ట్రాక్​ చేస్తున్నాయట! ఈ వార్త చాలా షాకింగ్​గా ఉంది!

'కనెక్టెడ్​ కార్​'తో వాళ్లు మిమ్మల్ని స్పై చేస్తున్నారు..!
'కనెక్టెడ్​ కార్​'తో వాళ్లు మిమ్మల్ని స్పై చేస్తున్నారు..!

Connected car technology data breach : ఈ మధ్య కాలంలో కార్లు కూడా 'స్మార్ట్​' అవుతున్నాయి. పోటీపడి మరీ.. వెహికిల్స్​లో కొత్త కొత్త ఫీచర్స్​ని తీసుకొస్తున్నాయి ఆటోమొబైల్​ సంస్థలు. వీటిల్లో.. 'కనెక్టెడ్​ కార్​' టెక్నాలజీ ఒకటి. ఈ టెక్నాలజీతో కేబిన్​లో కంఫర్ట్​ పెరుగుతోంది. ఈ ఫీచర్​ ఉందా? లేదా? అని చూసి మరీ కొనేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే.. ఈ కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీతో మన డేటాను దొంగిలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా.. న్యూయార్క్​ టైమ్స్​ సంస్థ ఓ నివేదికను బయటపెట్టింది. ఈ కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీ ద్వారా.. బీమా కంపెనీలు డ్రైవర్లను స్పై చేస్తున్నాయని పేర్కొంది!

మీ మీద ఇన్ష్యూరెన్స్​ సంస్థలు స్పై చేస్తున్నాయి..!

ఇన్ష్యూరెన్స్​ కంపెనీలు.. కెనెక్టెడ్​ కార్​ ఫీచర్​ ద్వారా మన డ్రైవింగ్​ స్కిల్స్​ని తెలుసుకుంటున్నాయని, ఫలితంగా మనం కట్టే ప్రీమియమ్స్​పై దీని ప్రభావితం పడుతోందని న్యూయార్క్​ టైమ్స్​ వెల్లడించింది. 'లెక్సస్​నెక్సస్​' అనే డేటా బ్రోకర్​ సంస్థ.. ఇన్షూరెన్స్​ కంపెనీలకు డ్రైవింగ్​ బిహేవియర్​ డేటాను చెబుతోందని పేర్కొంది.

ప్రపంచంలో టెక్నాలజీ రోజురోజుకు మెరుగుపడుతుండటంతో.. వెహికిల్స్​లో కనెక్టివిటీ పెరుగుతోంది. ఈ తరుణంలో.. ఇన్ష్యూరెన్స్ కంపెనీలు డ్రైవర్లను స్పై చేస్తున్నాయని వస్తున్న వార్తలు.. మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Insurance companies Connected car technology : నేటి తరం కార్లల్లో ఇంటర్నెట్​ సర్వీసులు కచ్చితంగా ఉంటున్నాయి. ఇన్​-కార్​ యాప్స్​తో పాటు రిమోట్​ ఫంక్షన్స్​, వైఫ్​- హాట్​స్పాట్​ వరకు.. అనేక క్రేజీ ఫీచర్స్​ వస్తున్నాయి. కానీ.. వీటితో కంఫర్ట్​తో పాటు మనకి తెలియకుండానే మన డ్రైవింగ్​ డేటా కార్​ తయారీ కంపెనీలు, ఇన్ష్యూరెన్స్​ కంపెనీలకు తెలిసిపోతుండటం కాస్త ఆలోచించాల్సిన విషయమే.

న్యూయార్క్​ టైమ్స్​ నివేదిక ప్రకారం.. జనరల్​ మోటర్స్​ వంటి దిగ్గజ సంస్థలే.. తమ కస్టమర్ల డ్రైవింగ్​ బిహేవియర్​కి సంబంధించిన డేటాను.. లెక్సస్​నెక్సస్​ వంటి కంపెనీలతో పంచుకుంటున్నాయి. ఈ లెక్సస్​నెక్సస్​ వంటి కంపెనీలు.. ఆ డేటాను ఇన్ష్యూరెన్స్​ సంస్థలకు అమ్ముకుంటున్నాయి. ఓ సందర్భంలో.. ఓ వ్యక్తి డ్రైవింగ్​ డేటా ఇన్ష్యూరెన్స్​ కంపెనీకి లీక్​ అవడంతో.. తన చెవర్​లెట్​ బోల్ట్​ ఈవీపై సదరు వ్యక్తి కట్టాల్సిన ప్రీమియం 21శాతం పెరిగింది! ఆటోమొబైల్​ సంస్థలు.. కస్టమర్ల డేటాను, వారికి చెప్పకుండా, తెలియకుండానే కలెక్ట్​ చేస్తున్నాయి. ఇది.. ప్రత్యక్షంగానే డేటా బ్రీచ్​!

Connected car technology : స్మార్ట్​ఫోన్స్​, ఇతర వ్యక్తిగత డివైజ్​లలో కనిపించే ప్రైవసీ సమస్యలే.. ఈ కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీతోనూ ఉత్పన్నమవుతోంది. టర్మ్స్​ అండ్​ కండీషన్లను చదవకుండా.. ప్రజలు చాలా యాప్స్​ని డౌన్​లోడ్​ చేసుకుంటారు. ఆయా కంపెనీలు.. ఆ డేటాను అమ్మేసుకుంటున్నాయి. ఈ టెక్​ యుగంలో.. 'డేటా ఈజ్​ పవర్​.' డేటా ఎవరి దగ్గర ఉంటుందో.. వారే కింగ్​! కానీ ఇది కస్టమర్ల భద్రతకు చాలా సవాళ్లు విసురుతోంది. ప్రైవసీ మాటకు అర్థమే లేకుండా పోతోందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం