Tecno Spark 20 : బడ్జెట్ ఫ్రెండ్లీ టెక్నో స్పార్క్ 20 సేల్స్ షురూ- ఫీచర్స్, ధర ఇవే..
Tecno Spark 20 price : బడ్జెట్ ఫ్రెండ్లీ టెక్నో స్పార్క్ 20 సేల్స్ మొదలయ్యాయి. ఈ మోడల్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Tecno Spark 20 sale : టెక్నో సంస్థ.. ఇండియాలో గత వారం ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీని పేరు టెక్నో స్పార్క్ 20. ఇక ఇప్పుడు.. ఈ గ్యాడ్జెట్ సేల్స్ అధికారికంగా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఈ టెక్నో స్పార్క్ 20 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టెక్నో స్పార్క్ 20 ఫీచర్స్ ఇవే..
టెక్నో స్పార్క్ 20 స్మార్ట్‌ఫోన్‌లో పంచ్ హోల్ కటౌట్ ఉంటుంది. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.56 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే దీని సొంతం. ఇందులో హీలియో జీ85 ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్- 128జీబీ/ 256జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ లభిస్తున్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్.. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌కి లభిస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత హెచ్ఐఓఎస్ సాఫ్ట్‌వేర్‌పై ఈ టెక్నో స్పార్క్ 20 పనిచేస్తుంది. సైడ్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డీటీఎస్- ఎనేబుల్డ్ డ్యూయెల్ స్పీకర్స్, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
Tecno Spark 20 price in India : ఈ టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్ బరువు 194 గ్రాములు, థిక్నెస్ 4.45 ఎంఎం.
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ రేర్‌లో.. 50ఎంపీ కెమెరా ఉంటుంది. ఏఐ లెన్స్, డ్యూయెల్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా రేర్‌లో కనిపిస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32ఎంపీ ఫ్రెంట్ కెమెరా వస్తోంది. వీటిని చూస్తే చాలు.. ఇది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అని అర్థమైపోతుంది.
ఇదీ చూడండి:- Realme 12 Pro : రియల్మీ 12 ప్రో సిరీస్ ఫీచర్స్, ధర చెక్ చేశారా?
టెక్నో స్పార్క్ 20 ధర ఎంతంటే..
Best budget friendly smartphone in India : టెక్నో స్పార్క్ 20లో రెండు వేరియంట్స్ ఉంటాయి. 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499. ఇక 8జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,499. గ్రావిటీ బ్లాక్, సైబర్ వైట్, నియాన్ షైన్, బ్లూ మేజిక్ స్కిన్ వంటి కలర్స్‌లో ఈ గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి.
ఓ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్న వారు.. అమెజాన్‌లో ఈ టెక్నో స్పార్క్ 20ని బుక్ చేసుకోవచ్చు. లేదా.. సంస్థకు చెందిన రీటైల్ ఔట్‌లెట్స్‌కి వెళ్లి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ఈ రెండు స్మార్ట్ఫోన్స్పైనా రూ. 1000 వరకు లిమిటెడ్ బ్యాంక్ డిస్కౌంట్స్ సైతం లభిస్తున్నాయి.
సంబంధిత కథనం