(1 / 5)
ఎంతో మందికి ఉదయాన్నే కాఫీ సిప్ చేసే అలవాటు ఉంటుంది. ఈ పానీయం లేనిదే రోజును ప్రారంభించే వారి సంఖ్య చాలా తక్కువ. ఉదయాన తాగే ఈ కాఫీలో కెఫిన్ ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గాలనుకుంటే కాఫీలో నిమ్మరసం కలపడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా కొవ్వు కరిగిపోతుంది.
(2 / 5)
అడెనోసిన్ అని పిలిచే న్యూరోట్రాన్స్మిటర్‌ను నిరోధించే శక్తి కెఫిన్ కు ఉంటుంది, ఇది డోపామైన్ వంటి ఉత్తేజపరిచే న్యూరోట్రాన్స్మిటర్లను పెంచుతుంది, ఇది మీకు మరింత శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
(3 / 5)
నిమ్మ కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మ రసం శరీరంలోని కలుషిత పదార్థాలు లేదా టాక్సిన్స్ ను తొలగిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిమ్మకాయ శరీరానికి తేమను అందిస్తుంది. కాబట్టి ఈ వేసవిలో ఎనర్జీ లభిస్తుంది.
(Freepik)(4 / 5)
నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ డైటీషియన్ డాక్టర్ పర్మీత్ కౌర్ మాట్లాడుతూ వేడి పానీయాలకు నిమ్మరసం కలిపి తాగడం వల్ల కొవ్వు కరిగిపోతుందని చెబుతున్నారు. పాలు వాడని కాఫీలోనే నిమ్మరసం కలుపుకుంటే మంచిది. దీని వల్ల పాలు విరిగిపోయే అవకాశం ఉంది. కిడ్నీ పేషెంట్లు లెమన్ కాఫీ తాగకూడదు.
(5 / 5)
నిమ్మరసంతో కాఫీ ఎలా తయారు చేయాలి? ఒక కప్పులో 1 టీస్పూన్ కాఫీ పౌడర్ వేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. ఇప్పుడు మగ్ ను వేడి నీటితో నింపండి. ఈ డ్రింక్ లో షుగర్ కలపకూడదు. అంతే లెమన్ కాఫీ రెడీ అయినట్టే. వేడిగా ఉన్నప్పుడు నెమ్మదిగా త్రాగాలి.
ఇతర గ్యాలరీలు