Karthika deepam 2 serial today: దీప మీద పారిజాతం చేసిన కుట్రను తిప్పికొట్టిన కార్తీక్.. దెప్పిపొడిచిన జ్యోత్స్న-karthika deepam 2 serial today june 8th episode karthik learns parijatham plan to defame deepa to send out of house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial Today: దీప మీద పారిజాతం చేసిన కుట్రను తిప్పికొట్టిన కార్తీక్.. దెప్పిపొడిచిన జ్యోత్స్న

Karthika deepam 2 serial today: దీప మీద పారిజాతం చేసిన కుట్రను తిప్పికొట్టిన కార్తీక్.. దెప్పిపొడిచిన జ్యోత్స్న

Gunti Soundarya HT Telugu
Jun 08, 2024 07:19 AM IST

Karthika deepam 2 serial today june 8th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీపను ఇంట్లో నుంచి పంపించడం కోసం పారిజాతం చేసిన కుట్రను కార్తీక్ తిప్పికొడతాడు. తాను అంతా చూశానని చెప్పడంతో పారిజాతం టెన్షన్ పడుతుంది.

కార్తీకదీపం 2  సీరియల్ జూన్ 8వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 8వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today june 8th episode: కార్తీక్ దీప వైపు దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. అది దీప గమనించి వెళ్ళి ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారని మొహం మీద అడిగేస్తుంది. రాత్రి మీరు శౌర్యని నాకు అప్పగించి ఎక్కడికి వెళ్లారో నాకు తెలిసింది.

దీపను మెచ్చుకున్న కార్తీక్

మీ అత్తయ్య వాళ్ళకి దేవీ నవరాత్రులు చూపించారట కదా. మిమ్మల్ని చూసి ఆవిడ భయపడి పారిపోతూ నన్ను గుద్దుకున్నారు. ఏంటి అని అడిగితే జరిగింది చెప్పారు. బిడ్డ జోలికి వస్తే ఏ ప్రాణి ఊరుకోదు. మీలో వచ్చిన ఈ మార్పు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఈ విషయం గురించి మిమ్మల్ని మెచ్చుకోలేక మీ దగ్గరకు రాలేక ఇక్కడే నిలబడి చూస్తున్నానని చెప్తాడు. అది నేను ఆవేశంతో చేసిన పని కాదు నా కూతురు మీద నాకున్న ప్రేమ. నా బిడ్డ బాధకు కారణమవుతాను అంటే క్షమించలేనని చెప్తుంది.

వాడు రౌడీని మీ నుంచి దూరం చేయలేడని కార్తీక్ అంటాడు. ఏదో చేయాల్సిన అవసరం లేదు నేను నీ తండ్రిని అని చెప్తే చాలు ఇక తర్వాత నా కూతురు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉండదు. దాని వయసుకు తండ్రి గురించి కొన్ని కలలు ఉంటాయి.

ఫోన్ కొనిచ్చిన కార్తీక్

ఇవన్నీ తెలిస్తే అది తట్టుకోలేదని చెప్తుంది. ఇలా ఎన్నాళ్ళు దాస్తారు. మీ జోలికి వచ్చాడని పోలీస్ కేసు పెట్టాను కానీ దగ్గరుండి విడిపించారు. ఇప్పుడు వాడు ఎక్కడ నిజం చెప్తారోనని భయపడుతున్నారని అంటాడు. నా గురించి వదిలేయండి వాడికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాను అంటుంది.

ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? మీ వల్లే అందుకే నేనే దీనికి ఒక పరిష్కారం చూశాను. మీ కోసం నేను ఒక మొబైల్ తీసుకొచ్చాను. ఇంకోసారి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తాడు. వద్దు నేను కొనుక్కుంటాను అని చెప్తుంది. ఇది లేకే కదా నిన్న రోడ్లు మొత్తం తిప్పించారు.

ఇది ఉంటే మీకు కత్తిపీటతో పని ఉండదు. మీరైన కొనుక్కోవాలి కదా అది నా దగ్గరే కొనుక్కోమని చెప్తాడు. ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవని చెప్తుంది. సరే అయితే నాకు ఇవ్వాల్సిన డబ్బులు డబ్బాలో వేయమని చెప్తాడు. మీరు నా దగ్గర ఫోన్ కొనుక్కున్నట్టు అని దీప చేతిలో పెట్టడం శౌర్య చూస్తుంది.

దీపను బయటకు వెళ్లిపొమ్మన్న సుమిత్ర

కార్తీక్ మా అమ్మకి ఫోన్ ఇచ్చాడని అనుకుంటుంది. దీప మళ్ళీ కార్తీక్ కి థాంక్స్ చెప్తుంది. కార్తీక్ వెంటనే దీప నెంబర్ కి ఫోన్ చేసి అది తన నెంబర్ సేవ్ చేసుకోమని చెప్తాడు. ఆ అవసరం లేదని అంటుంది. కేక్ కటింగ్ కి జ్యోత్స్న ఏర్పాటు చేస్తుంది. పారిజాతం కావాలని దీపను పిలిచి పాయసం తీసుకురమ్మని చెప్తుంది.

పాయసం చెడగొట్టి అందరితో మాటలు అనిపించి బయటకు పంపించాలని పారు ప్లాన్ వేస్తుంది. సుమిత్ర పాయసం తిని ఏదోలా ఉంది తేడాగా ఉందని వాంతి చేసుకుంటుంది. పాయసంలో ఏం కలిపావ్ దీప అని సుమిత్ర కోపంగా అడుగుతుంది. ముందు ఎవరు దీన్ని ఎవరూ తినొద్దు అని దీపను తిడుతుంది.

సుమిత్ర దీపను బయటకు వెళ్ళమని చెప్తుంది. అది చూసి పారిజాతం అయ్యింది భలే అయ్యిందని సంబరంగా అరుస్తుంది. శివనారాయణ తనని కదిలిస్తాడు. ఏమైందని అడుగుతాడు. ఇదంతా కల అని అనుకుని వెంటనే దీప పాయసం చేసింది కదా అది తిన్న తర్వాత కేక్ కట్ చేస్తానని చెప్తుంది.

ఏమైనా కలిపారని భయపడుతున్నావా?

దీప తీసుకొస్తానని అంటే పారిజాతం వెళ్తానని అంటుంది. వద్దని ఆపి కార్తీక్ వెళతాడు. దీప పాయసం చేయడం బావ పంచి పెట్టడం అదిరిపోయిందని జ్యోత్స్న తిట్టుకుంటుంది. కార్తీక్ ఇంట్లో అందరికీ పాయసం ఇస్తాడు. తనకు వద్దని తర్వాత తింటానని చెప్తుంది.

అందరూ పాయసం తిని అద్భుతంగా ఉందని తెగ మెచ్చుకుంటారు. పాయసానికి రెస్టారెంట్ స్టైల్ వచ్చిందని దశరథ అంటాడు. కాసేపటికి అందరికీ వాంతులు అవుతాయని పారిజాతం ఎదురుచూస్తుంది. కార్తీక్ పారిజాతాన్ని అడిగేస్తాడు. ఏంటి పారు భయపడుతున్నావా?ఇందులో ఎవరైనా ఏమైనా కలిపి ఉండవచ్చు కదా అంటాడు.

పారిజాతం తాను చేసిన పని గుర్తు తెచ్చుకుంటుంది. దీప చేసిన పాయసంలో ఏదో పొడి కలపడం కార్తీక్ చూస్తాడు. నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు పారు దీపకు చెడ్డపేరు రావడానికి పాయసాన్ని పాడు చేస్తున్నావ్ అంటే దీపను ఇంట్లో నుంచి పంపించడానికి బంటు గాడితో నెక్లెస్ పెట్టించింది కూడా నువ్వే అయి ఉంటావు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ పారు అనుకుంటాడు.

పారు ప్లాన్ తిప్పికొట్టిన కార్తీక్

నేను అంతా చూశాను పారు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదని అనేసరికి పారు షాక్ అవుతుంది. టెన్షన్ పడకు ఇది నువ్వు అనుకున్న పాయసం కాదు రెస్టారెంట్ స్టైల్ అన్నారు కదా అర్థం అయి ఉంటుందని చెప్తాడు. దీప కూడా ఇది నేను చేసిన పాయసంలాగా ఉందని అనుకుంటుంది.

దీపను ఏదో చేస్తానని ఇదా నువ్వు చేసేదని జ్యోత్స్న పారిజాతాన్ని దెప్పి పొడుస్తుంది. దీప గారు పాయసం చేశారు బావగారు పంచి పెట్టారు మరదలు గారు తింటున్నారని తిడుతుంది. మనవడా ఏం దెబ్బ కొట్టావు ఇప్పుడు నేను కొట్టే దెబ్బకు బుర్ర గింగరాలు తిరుగుతుందని అంటుంది.

కేక్ కట్ చేయడానికి రమ్మని సుమిత్ర పిలిస్తే తనకు ఇచ్చిన మాట ప్రకారం కోరిక తీర్చమని అడుగుతుంది. కార్తీక్ ని జ్యోత్స్న పక్కన నిలబెడుతుంది. జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే విషయం పారు అందరికీ చెప్పేస్తుందని కార్తీక్ అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024