Karthika deepam 2 serial today: దీపను చూసి భయంతో పరుగులు పెట్టిన అనసూయ.. కార్తీక్, జ్యోత్స్న ఎంగేజ్మెంట్?-karthika deepam 2 serial today june 7th episode karthik is happy as deepa teaches a lesson to narsimha and his family ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial Today: దీపను చూసి భయంతో పరుగులు పెట్టిన అనసూయ.. కార్తీక్, జ్యోత్స్న ఎంగేజ్మెంట్?

Karthika deepam 2 serial today: దీపను చూసి భయంతో పరుగులు పెట్టిన అనసూయ.. కార్తీక్, జ్యోత్స్న ఎంగేజ్మెంట్?

Gunti Soundarya HT Telugu
Jun 07, 2024 07:10 AM IST

Karthika deepam 2 serial today june 7th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. రోడ్డు మీద వెళ్తున్న దీపను చూసి అనసూయ భయంతో పరుగులు పెట్టేస్తుంది. వెళ్ళి సరిగా కార్తీక్ ని ఢీ కొడుతుంది. ఏమైందని అంటే దీప చేసింది మొత్తం చెప్తుంది.

కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 7వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 7వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today june 7th episode: కార్తీక్ ఇంటికి వస్తే కాంచన సీరియస్ అవుతుంది. పిన్ని చెప్పింది నువ్వు చేస్తుంది చూస్తుంటే తను చెప్పిన మాటల్లో నిజం ఉందని అనిపిస్తుందని అంటుంది. నీకు నాలో తప్ప అందరిలో నిజం కనిపిస్తుందని కార్తీక్ బాధపడతాడు.

దీపను చూసి పరుగులు పెట్టిన  అనసూయ 

అత్తయ్య నన్ను అడగలేదు కానీ నువ్వు చెప్పుడు మాటలు విని నీ కొడుకుని నిందిస్తున్నావ్. అత్త నమ్మినప్పుడు అమ్మ నువ్వు నమ్మడం లేదని బాధగా ఉందని అంటాడు. ఇవన్నీ కాదు వీళ్లిద్దరికీ ఎంగేజ్ మెంట్ చేసేద్దామని అంటుంది.

రోడ్డు మీద అనసూయకు దీప కనిపిస్తుంది. తనని చూసి అనసూయ హడలిపోతుంది. దీని కంట్లో పడితే నా కొడుకు మీద మిగిలి ఉన్న కోపంతో నా తాట తీస్తుందని పరుగు పెడుతుంది. పరిగెడుతూ కార్తీక్ ని ఢీ కొడుతుంది. ఏమైంది ఎందుకు పరిగెడుతున్నారని అడుగుతాడు.

నా కోడలు దీపను చూసి పారిపోతున్నానని అంటుంది. మిమ్మల్ని చూసి దీప కదా పారిపోవాలి అంటే అది నిన్నటి వరకు రాత్రితో కథ మారిపోయింది. దానిలో ఉన్న భద్రకాళి అవతారం రాత్రి దర్శనం ఇచ్చింది. ఏదో మనసు మార్చుకుని కత్తిపీట కిందకు దింపింది లేదంటే మేమంతా హాస్పిటల్ లో ఉండేవాళ్లం, అది పోలీస్ స్టేషన్ లో ఉండేదని చెప్తుంది.

ఏడ్చే మనిషి కాదు ఏసేసే మనిషి 

కార్తీక్ ఆశ్చర్యంగా దీప గురించేనా అంటాడు. అవును అంటుంది. ఏదైనా అంటే ఏడుస్తూ కూర్చునే మనిషి గురించా మీరు మాట్లాడేది అంటాడు. అవును ఆ ఏడ్చే మనిషిలోనే ఏసేసే మనిషి కూడా ఉంది. రాత్రి నువ్వు అందుబాటులో ఉంటే ఎండాకాలంలో దసరా చూసేవాడివి.

రాత్రి దీప భద్రకాళిలా ఇంటికి వచ్చిందని జరిగింది మొత్తం చెప్తుంది. అంటే రాత్రి దీప వెళ్ళింది ఈ ఇంటికా? దీప కూతురు విషయంలో ఎంత వైలెంట్ గా ఉందోనని సంతోషిస్తాడు. పారిజాతం పుట్టినరోజు అని భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంట్లో అందరూ పారిజాతానికి శుభాకాంక్షలు చెప్తారు.

మీ పుట్టిన రోజని స్పెషల్ గా పాయసం చేయమని దీపని రమ్మని చెప్పానని సుమిత్ర చెప్తుంది. దీంతో పారిజాతం ఇంట్లో వంట మనిషిని తిడుతుంది. దీప మన ఇంట్లో వంట మనిషి కాదుగా పనులు చేయించుకోవడానికని అంటుంది. అప్పుడే దీప శౌర్యని తీసుకుని వస్తుంది.

స్కెచ్ వేసిన పారు 

నువ్వు కూడా బర్త్ డే చేసుకుంటావా అని శౌర్య అడిగేస్తుంది. భలే అడిగావు అని శివనారాయణ శౌర్యని ముద్దు చేస్తాడు. పుట్టినరోజులు ఎవరైనా చేసుకోవచ్చని పారిజాతం అంటుంది. దశరథ, శివనారాయణ శౌర్యతో చక్కగా కబుర్లు చెప్తూ ఉంటారు.

దీప ఇంట్లో అడుగుపెడితే ఊపిరి ఆడటం లేదని జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోతుంది. దీప బాగా వంట చేస్తుందని అంటున్నారు ఈరోజుతో తన వంట పేరు చెప్తేనే భయపడేలా చేయాలని పారిజాతం అనుకుంటుంది. శ్రీధర్ అద్దంలో చూసుకుంటూ వస్తున్నా బేబీ అనుకుంటూ ఉండగా వెనుక కాంచన ఉంటుంది.

ఈరోజు పారిజాతం పిన్ని పుట్టినరోజు అందరినీ రమ్మని చెప్పింది వెళ్దామని కాంచన చెప్తుంది. తాను రావడం కుదరదని కంపెనీలో ఆడిటింగ్ ఉందని శ్రీధర్ అబద్ధం చెప్తాడు. మీరు రాకపోతే వదిన బాధపడుతుంది. దీప పాయసం చేస్తుందట దానికోసమైన రావాల్సిందేనని అంటాడు.

కార్తీక్, జ్యోత్స్నకు ఎంగేజ్మెంట్?

వెళ్ళడం కుదరదని కార్తీక్ ని వెళ్ళమని చెప్తానని అంటాడు. అప్పుడే శ్రీధర్ కి కావేరీ ఫోన్ చేస్తుంది. వెంటనే ఫోన్ తీసుకుని హడావుడిగా వెళ్ళిపోతాడు. కార్తీక్ వచ్చి పారిజాతానికి విసెష్ చెప్తాడు. 

ఏంటి పార్టీ అని అడిగితే దీప పాయసం చేస్తుంది నీకు అంతకంటే స్పెషల్ ఏముంటుందని జ్యోత్స్న దెప్పి పొడుస్తుంది. బావ విషయంలో భయంగా ఉందని జ్యోత్స్న అంటే కాసేపటిలో అవన్నీ పోగొడతానని పారిజాతం హామీ ఇస్తుంది.

కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ దీపను చూసి నవ్వుకుంటాడు. అది దీప గమనిస్తుంది. ఇంత ప్రశాంతంగా ఉన్న దీపలో అంత ఆవేశం ఉందా? కూతురు జోలికి వచ్చినందుకు అందరినీ పరుగులు పెట్టించింది. నిన్ను మనస్పూర్తిగా మెచ్చుకోవాలని ఉందని అనుకుంటాడు. దీప వైపు దొంగతనంగా చూస్తూ ఉంటాడు. కాసేపటికి దీప ఎదురుగా ఉంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024