Karthika deepam 2 serial: కాంచనకు నిజం చెప్పమన్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జ్యోత్స్న ప్రయత్నాలు-karthika deepam 2 serial today june 1st episode sridhar frustated as kaveri urges hin to tell kanchana about their love ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: కాంచనకు నిజం చెప్పమన్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జ్యోత్స్న ప్రయత్నాలు

Karthika deepam 2 serial: కాంచనకు నిజం చెప్పమన్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జ్యోత్స్న ప్రయత్నాలు

Gunti Soundarya HT Telugu

Karthika deepam 2 serial today june 1st episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శ్రీధర్ తన రెండో భార్య కావేరీని కలుసుకుంటాడు. కాంచన అక్కకు మన గురించి చెప్పేయమని కావేరీ శ్రీధర్ ని అడుగుతుంది. కానీ చెప్పలేనని అంటాడు.

కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 1వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today june 1st episode: మీ నాన్న వచ్చారు హడావుడిగా వెళ్లిపోయారని దశరథ కార్తీక్ ని అడుగుతాడు. ఆయన రహస్యం ఎక్కడ బయటపడిపోతుందోనని వెళ్లిపోయారని కార్తీక్ చెప్పేసరికి దీప షాకింగ్ గా చూస్తుంది. ఏంటి ఆ రహస్యం అని సుమిత్ర అంటే ప్రతి మగవాడి జీవితంలో రహస్యాలు ఉంటాయని అంటాడు.

తన భర్త దేవుడన్న కాంచన

దీప కార్తీక్ వైపు చూస్తుండటంతో ఏమైనా చెప్పాలని అనుకుంటుందా ఏంటని అనుకుంటాడు. మా అల్లుడు శ్రీరామచంద్రుడు అనవసరంగా లేనిపోని అనుమానాలు రేకెత్తించకు కాంచన కంగారుపడుతుందని పారిజాతం అంటుంది. మా ఆయన దేవుడని కాంచన చెప్తుంది.

దేవుడు కాదు మీ మొగుడు కూడా నా మొగుడిలాగా నీచుడని దీప అనుకుంటుంది. సస్పెన్స్ కాదు చెప్పమని అంటే ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనేసరికి అందరూ రిలీఫ్ గా ఫీలవుతారు. సిగరెట్ తాగితే మీ నాన్న ఆరోగ్యం చెడిపోతుందని కాంచన బాధగా చెప్తుంది. దీప వెళ్లిపోతుంటే కార్తీక్ వెనుకే వెళ్ళి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు.

తండ్రి గురించి గొప్పగా చెప్పిన కార్తీక్

మీ నాన్న మీ అమ్మకి చేసిన ద్రోహం గురించి చెప్పాలని అనుకున్నాను కానీ ఆవిడ తన భర్త మీద పెట్టుకున్న నమ్మకం చూస్తే జాలిగా అనిపించిందని దీప మనసులో అనుకుంటుంది. మీరు ఇప్పుడు కూడా మనసులో ఏదో మాట్లాడుకుంటున్నారు ఏమైనా ఉంటే చెప్పమని మళ్ళీ అడుగుతాడు.

ఇంట్లో కార్తీక్ లేకపోవడంతో జ్యోత్స్న వెతుకుతూ బయటకు వస్తుంది. బయట కార్తీక్, దీప మాట్లాడుకుంటూ కనిపిస్తారు. భర్తలందరూ మా నాన్నలాగా ఉంటే భార్యాలకు ఎంత అదృష్టమో. మా నాన్న చాలా మంచివాడు, అందుకే ఆయన అంటే నాకు అంత గౌరవం అని తండ్రి గురించి గొప్పగా చెప్తాడు.

మా అమ్మకి ఒకటే లోటు నాకు చెల్లెలు లేదని, అందుకే జ్యోత్స్నని గారాబంగా చూసుకుంటుందని చెప్తాడు. నేను హాయ్ చెప్తే హాయ్ చెప్పావు కానీ దీపతో ఇంతసేపు మాట్లాడుతున్నావ్ ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఐహేట్ యు బావ అనుకుంటూ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది.

పాట బాగుంది

దీపని సంతోషంగా బతకమని దేని గురించి ఆలోచించొద్దని సలహా ఇస్తాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండమని చెప్తాడు. మీ పాట చాలా బాగుందని మెచ్చుకుంటాడు. మీ వంటలాగే మీ పాట కూడా చాలా బాగుందని చెప్తాడు. శౌర్య కోసం పాడానని చెప్పేసి వెళ్ళిపోతుంది.

కావేరీ, శ్రీధర్ కలుసుకుంటారు. మన అమ్మాయికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోమని కావేరికి చెప్తాడు. డబ్బులు ఇస్తే సరిపోదు పట్టించుకోమని అడుగుతుంది. డాడీ కోసం అడుగుతుంది. బయటకు వెళ్దామని అడుగుతుందని చెప్తుంది. సరే మనం ముగ్గురం బయటకు వెళ్దామని అంటాడు.

కాంచన అక్కకి చెప్పొచ్చు కదా

ఇంట్లో ఏం చెప్తావ్ అంటే ఫ్రెండ్ పెళ్లి ఉందని ఏదో ఒకటి చెప్తాను కాంచన నమ్మేస్తుందని శ్రీధర్ అనేసరికి కావేరీ మొహం మాడ్చుకుంటుంది. నాకు పెళ్లి అయ్యిందని కొడుకు ఉన్నాడని నీ మెడలో తాళి కట్టక ముందే చెప్పాను మళ్ళీ కొత్తగా విషయం తెలిసినట్టు ఫీల్ అవుతావ్ ఏంటని అంటాడు.

మన పిల్లకు ఏదో ఒకరోజు ఈ విషయం తెలియాల్సిందే దోషులుగా నిలబడాల్సిందేనని అంటాడు. కాంచన అక్కతో మన విషయం చెప్పొచ్చు కదాని అడుగుతుంది. చెప్పలేనని అనేసరికి కావేరీ కోపంగా శ్రీధర్ ఇచ్చిన డబ్బులు తన చేతిలో పెట్టేసి కోపంగా వెళ్ళిపోతుంది.

కార్తీక్ బాబు నా మంచికేగా చెప్పింది

దీప డల్ గా ఉండటం చూసి ఏమైంది వాడేమైన ఇంటికి వచ్చాడా? వస్తే కార్తీక్ బాబు చూసుకుంటాడని కడియం నోరు జారతాడు. ఆయన దాకా ఎందుకు నువ్వే వదిలిపెట్టవు కదా అని మాట మారుస్తాడు. మన గురించి ఎవరైనా ఒక మంచి మాట చెప్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా దాన్ని తీసుకుంటే మంచిదని అంటాడు.

కార్తీక్ మాటల గురించి ఆలోచిస్తుంది. ఆయన చెప్పింది నా మంచి కోసమే కదా నాకు ఉన్న కోపం వల్ల మంచి చెప్పినా పట్టించుకోవడం లేదని అనుకుంటుంది. జ్యోత్స్న కూడా కార్తీక్, దీప మాట్లాడుకోవడం తలుచుకుని రగిలిపోతుంది. పారిజాతం వచ్చి ఏమైందని అడుగుతుంది.

బావను నీవైపుకు లాగేసుకో

దీపతో మాట్లాడటానికి స్పేస్ ఉంటుంది బాగా మాట్లాడతాడు. అదే నేను మాట్లాడితే అడిగిన దానికి కూడా సమాధానం చెప్పడు. వాడు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు నీకెందుకు అంత ఇగో. నువ్వు మాట్లాడకపోతే దూరం జరిగి అవుట్ హౌస్ వైపు వెళ్లిపోతాడని అనేసరికి జ్యోత్స్న కోపంగా అరుస్తుంది.

నీ బావ నీ మెడలో మూడు ముళ్ళు వేసేవరకు ఏదో ఒకటి చేసి నీవైపుకు లాక్కోవాలి. కార్తీక్ కి దగ్గరగా ఉండమని సలహా ఇస్తుంది. వెంటనే జ్యోత్స్న కార్తీక్ దగ్గరకు వెళ్ళిపోతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.