Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. కార్తీక్ స్మార్ట్ ప్లాన్, నరసింహని హోటల్ నుంచి వెళ్లగొట్టిన కడియం-karthika deepam 2 serial today may 30th episode karthik shares plan with kadiyam to save deepa from narasimha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: కార్తీకదీపం 2 సీరియల్.. కార్తీక్ స్మార్ట్ ప్లాన్, నరసింహని హోటల్ నుంచి వెళ్లగొట్టిన కడియం

Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. కార్తీక్ స్మార్ట్ ప్లాన్, నరసింహని హోటల్ నుంచి వెళ్లగొట్టిన కడియం

Gunti Soundarya HT Telugu
May 30, 2024 07:37 AM IST

Karthika deepam 2 serial today may 30th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప పని చేస్తున్న హోటల్ కి వచ్చి నరసింహ మళ్ళీ గొడవ చేసేందుకు చూస్తాడు. అది గమనించిన కార్తీక్ కడియానికి ఫోన్ చేసి తను చెప్పినట్టుగా చేయమని చెప్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ మే 30వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 30వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today may 30th episode: సుమిత్రను పొరపాటున శ్రీధర్ కావేరీ అని పిలుస్తాడు. కావేరీ ఎవరని అనేసరికి హడావుడిగా పని ఉందని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతాడు. నరసింహ బారి నుంచి ఎలా తప్పించుకోవాలని దీప ఆలోచిస్తూ ఉండగా హోటల్ కి వస్తాడు.

హోటల్ కి వచ్చిన నరసింహ

కడియం నరసింహ దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చావ్ అంటాడు. హోటల్ కి ఎందుకు వస్తారని దురుసుగా మాట్లాడతాడు. దీప నిన్ను వెంటాడటమే పనిగా పెట్టుకున్నా నిన్ను ఎవడు కాపాడతాడో చూస్తానని నరసింహ అనుకుంటాడు.

కార్తీక్ కి అప్పుడే స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది. స్కూల్ లో సింగింగ్, స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉందని ఆ విషయం దీపకు చెప్పడానికి హోటల్ దగ్గరకు వెళ్లాలని అనుకుంటాడు.

నరసింహ హోటల్ లో ఉండగా కార్తీక్ వచ్చి తనని చూస్తాడు. ఎందుకు వచ్చావని దీప అడుగుతుంది. నీ కూతురు స్కూల్ లో చదవడం, నువ్వు ఈ హోటల్ లో పని చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు దాన్ని తీసుకుని నా కంటికి కనిపించనంత దూరం పోయేవరకు ఇలా తిరుగుతూనే ఉంటాను.

కార్తీక్ స్మార్ట్ ప్లాన్

నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని వార్నింగ్ ఇస్తాడు. వీడిని ఇలాగే వదిలేస్తే గొడవ చేసేలాగా ఉన్నాడని కార్తీక్ అనుకుంటాడు. కస్టమర్లు ఉన్నారు వెళ్లిపొమ్మని దీప చెప్పిన కూడా వినిపించుకోకుండా అలాగే కూర్చుని ఉంటాడు. కార్తీక్ కడియానికి ఫోన్ చేసి ఏదో మాట్లాడతాడు.

నేను నిన్ను ఇక్కడ ప్రశాంతంగా బతకనివ్వను. స్టేషన్ లో నేను పడిన దెబ్బకు నేను ఎంత బాధపడ్డానో అంత కంటే నిన్ను పది రెట్లు బాధపెడతానని చెప్తాడు. కడియం నరసింహని వెళ్ళమని చెప్తాడు. దెబ్బ పడకపోతే వినేలా లేడని నరసింహ కొట్టబోతుంటే కొట్టినట్టుగా కడియం కిందపడిపోతాడు.

వీడు ఎవడో మా దీపమ్మని ఏడిపిస్తున్నాడని కడియం డ్రామా వేస్తాడు. దీంతో హోటల్ లో ఉన్న కస్టమర్లు నరసింహ మీద గొడవకు దిగుతారు. మళ్ళీ దీపమ్మ జోలికి వస్తే మర్యాదగా ఉండదని కడియం వార్నింగ్ ఇస్తాడు. దీంతో నరసింహ తోక ముడిచి వెళ్ళిపోతాడు.

కనిపెట్టేసిన దీప

నా వల్ల మీ వ్యాపారం దెబ్బతింటుంది ఏమో వేరే చోట పని చూసుకుంటానని చెప్పి దీప కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అప్పుడే కార్తీక్ హోటల్ లోకి వస్తాడు. ఎందుకు వచ్చారని అడుగుతుంది. మీ కోసమే అంటే నా కోసం ఇక్కడికి రావద్దు. నాకు ఏమైనా చెప్పాలనుకుంటే సుమిత్రకు చెప్పమని చెప్తుంది.

స్కూల్ లో ఆటల పోటీలు, పాటల పోటీలు పెడుతున్నారంట, రౌడీ పేరు ఇచ్చిందో లేదో తెలియదు. అది చెప్పడానికి వచ్చానని చెప్పేసి వెళ్ళిపోతాడు. మీకు గొడవ అంటే భయం కదా నరసింహ కొట్టకుండానే కొట్టినట్టు నాటకం ఆడి ఎలా బయటకు పంపించేశారని దీప కడియాన్ని అడుగుతుంది.

బూచోడు వస్తాడేమో

నీకు ఏమైనా జరిగితే ఊరుకుంటానా అంటాడు. కానీ దీప మాత్రం నమ్మదు కార్తీక్ చెప్పడం వల్లే చేశాడని అర్థం చేసుకుంటుంది. దీప నరసింహ మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది. వాడు నన్ను ఏం చేయలేక నా మీద కోపంతో నేనే నీ తండ్రిని అని పాపకు చెప్తే పరిస్థితి ఏంటని దీప అనుకుంటుంది.

శౌర్య వచ్చి రేపు స్కూల్ కి వెళ్లనని అంటుంది. ఈరోజు బూచోడు స్కూల్ కి వచ్చినట్టు రేపు వస్తే ఎలా? ఈరోజు వచ్చినట్టు రోజూ నువ్వు రాలేవు కదా. నువ్వు లేనప్పుడు నన్ను ఎత్తుకుపోతాడని శౌర్య భయపడుతుంది. సారి అమ్మా ఆరోజు నేను పూలు కోయడం వల్లే కదా గొడవ పడింది.

నేను ఉండగా నీ దగ్గరకు ఏ బూచోడిని రానివ్వనని అంటుంది. బూచోడు మన జోలికి రాకూడదు అంటే మనం నాన్నని వెతికి తీసుకోద్దాము అప్పుడు వాడు మన జోలికి రాడని అమాయకంగా చెప్తుంది. జోకి నాన్న ఉన్నాడు అందుకే ఎవరిని రానివ్వడు.

కొడుక్కి దొరికిపోయిన శ్రీధర్

నాకు నాన్న ఉంటే ఎవరిని రానివ్వడు కదా. చెప్పు మనం నాన్నని వెతికి తీసుకోద్దామని అడుగుతుంది. నాన్న ఎక్కడికో వెళ్ళాడు అని చెప్పాను కదాని దీప సర్ది చెప్పడానికి చూస్తుంది. అయితే బూచోడి గురించి కార్తీక్ కి చెప్తాను తనకు నేనంటే చాలా ఇష్టం కదా బూచోడిని ఊరుకోడని వెళ్లబోతుంటే దీప కూతురిని అపి తిడుతుంది.

దీప తన పరిస్థితి తలుచుకుని బాధపడుతుంది. శ్రీధర్ కావేరీతో ఫోన్ మాట్లాడుతుండగా కార్తీక్ వస్తాడు. కొడుకుని చూసి కంగారుగా ఫోన్ కట్ చేస్తాడు. ఏమైంది మాస్టారు నన్ను చూసి కంగారుగా కాల్ కట్ చేశావు. ఫోన్లో ఎవరని అడుగుతాడు. ఏదో జనరల్ కాల్ అంటాడు.

ఎవరో నేను చూస్తానని చెప్పి కార్తీక్ తండ్రి ఫోన్ తీసుకుంటాడు. నాకు తెలియని సీక్రెట్స్ ఏం ఉన్నాయి నీ దగ్గర అయితే నువ్వు మాట్లాడిన నెంబర్ కి నేను కాల్ చేసి మాట్లాడతానని కార్తీక్ అనేసరికి శ్రీధర్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024