Karthika deepam 2 serial: శౌర్యను కలిసిన నరసింహ.. పేరు చెప్తేనే వణికిపోయేలా చేస్తానని దీపకు వార్నింగ్-karthika deepam 2 serial today may 29th episode deepa interrupts narasimha from meeting sourya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: శౌర్యను కలిసిన నరసింహ.. పేరు చెప్తేనే వణికిపోయేలా చేస్తానని దీపకు వార్నింగ్

Karthika deepam 2 serial: శౌర్యను కలిసిన నరసింహ.. పేరు చెప్తేనే వణికిపోయేలా చేస్తానని దీపకు వార్నింగ్

Gunti Soundarya HT Telugu
May 29, 2024 07:08 AM IST

Karthika deepam 2 serial today may 29th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యకు తానే తండ్రి అనే విషయం చెప్పాలని నరసింహ స్కూల్ లో పాపను కలుస్తాడు. బూచోడు వచ్చాడని శౌర్య భయపడిపోతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ మే 29వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 29వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today may 29th episode: స్కూల్ కి టైమ్ అవుతుందని శౌర్య రావడంతో దీప బయటకు వచ్చేస్తుంది. శ్రీధర్ గార్డెన్ లో ఉంటే దీప వచ్చి మాట్లాడుతుంది. మీరు ఏదైతే జరుగుతుందని భయపడుతున్నారో అది అడగటానికి తొందర్లోనే పిలుస్తారు.

నిజం తెలిస్తే కాంచన బతకదు

నా భర్త నాకు అన్యాయం చేసినట్టు మీరు కాంచన గారికి అన్యాయం చేయవద్దు. నిజం తెలిస్తే అదే ఆవిడ బతికే ఆఖరి రోజు అవుతుందని దీప అనేసరికి శ్రీధర్ షాక్ అయిపోతాడు. ఆవిడ చాలా సున్నితమైన మనిషి. ఆ పూజించే దేవుడి కంటే కూడా మీరే గొప్ప అనుకుంటుంది. అందుకే ఆవిడ నిజం తెలిస్తే బతకదు.

ఇప్పుడు ఈ కుటుంబం చాలా అందంగా ఉంది. కానీ నిజం తెలిసిన రోజు ఇలా ఉండదు. లోపల నా భర్తని తిట్టిన మాటలు మీకు వర్తిస్తాయని మన ఇద్దరికీ మాత్రమే తెలుసని అంటుంది. నా గురించి ఈవిడకు ఎందుకని శ్రీధర్ అనుకుంటాడు. ఇది నాకు అన్నం పెట్టిన ఇల్లు.

శౌర్య స్కూల్ కి వెళ్ళిన నరసింహ

ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. నేను అయితే నిజం బయట పెట్టను కానీ మీరు ఏం చేస్తారో చేయమని చెప్తుంది. కడియం దీపకు థాంక్స్ చెప్తాడు. తనకున్న అప్పులన్నీ తీర్చగలిగానని చెప్పి దీపకు జీతం ఇస్తాడు.

శౌర్యకు సైకిల్ కొనివ్వాలని సంతోషంగా చెప్తుంది. స్కూల్ లో శౌర్య లంచ్ బాక్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే నరసింహ వస్తాడు. నా కూతురికి నేనే తండ్రిని అని పరిచయం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. శౌర్య స్కూల్ లోకి వెళ్లబోతుంటే నరసింహ పిలుస్తాడు.

వామ్మో బూచోడు వచ్చాడు ఆరోజు నేను పారిపోయాను కదా అందుకే పట్టుకోవడానికి వచ్చి ఉంటాడని లోపలికి పరుగు పెడుతుంది. నరసింహ శౌర్య వెనుకే పరిగెడతాడు. స్కూల్ కి వచ్చిన దీప నరసింహ కారుని చూసి కంగారుగా వెళ్తుంది.

ఎందుకు వచ్చావ్?

శౌర్య నరసింహ నుంచి తప్పించుకుని పరిగెడుతుంటే దీప చూస్తుంది. భయంతో శౌర్య అమ్మా అని పిలుస్తుంది. బూచోడు మళ్ళీ వచ్చాడని శౌర్య భయం భయంగా చెప్తుంది. ఇంకెప్పుడు పువ్వులు కోయను మమ్మల్ని కొట్టొద్దని శౌర్య నరసింహను బతిమలాడుతుంది.

కూతురికి లంచ్ బాక్స్ ఇచ్చి లోపలికి పంపించేస్తుంది. ఎందుకు వచ్చావని కోపంగా అడుగుతుంది. అది నన్ను చూసి ఎందుకు పారిపోతుంది, పైగా బూచోడు అంటుంది ఏంటని అడుగుతాడు. నా కూతురు నా దగ్గరకు రాకుండా నన్ను విలన్ లా చేశావని అడుగుతాడు.

కార్తీక్ తండ్రి అని చెప్పు

నాకు నా కూతురితో సంబంధం లేదని అన్నావ్ ఇప్పుడు ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. మరి ఏ సంబంధం ఉందని కేసు పెట్టావు. ఎస్సై కార్తీక్ ఫ్రెండ్. వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఎస్సై కొట్టే దెబ్బల్లో కనిపించింది. నన్ను కొట్టినప్పుడు నేను కూడా నిన్ను కొట్టాలి కదా.

ఈరోజు నువ్వు ఆపిన రేపు అయినా నేనే నీ తండ్రిని అని పాపకు చెప్తాను. ఎలా ఆపుతావో ఆపుకో అని సవాలు విసురుతాడు. నీలాంటి వాడు తండ్రని నా కూతురికి తెలియనివ్వనని చెప్తుంది. అయితే కార్తీక్ నీ కూతురికి తండ్రి అని చెప్పు అనేసరికి సరిగా మాట్లాడకపోతే పళ్ళు రాలతాయని వార్నింగ్ ఇస్తుంది.

నా పేరు వింటేనే భయపడేలా చేస్తా

నా జోలికి వచ్చినా పరవాలేదు. నా బిడ్డ జోలికి వస్తే నిజంగానే కొడతానని అంటుంది. ఇన్ని రోజులు నిన్ను ఏం చేయాలో అని అనుకున్నాను ఇప్పుడు నీ బలహీనత నీ కూతురని అర్థం అయ్యింది. నిన్ను ప్రశాంతంగా బతకనివ్వను. ఇక నుంచి నన్ను చూస్తేనే భయపడేలా చేస్తాను, నా పేరు వింటేనే భయం వచ్చేలా చేస్తాను.

వద్దనుకున్న వాడివి వద్దనుకున్నట్టు ఉండు. ఇక్కడితో ఆపేయమని దీప చెప్పేసి వెళ్ళిపోతుంది. దీప పని చేసే చోటకు వెళ్ళి గొడవ చేయాలని డిసైడ్ అవుతాడు. శ్రీధర్ దీప మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా సుమిత్ర కాఫీ తీసుకొచ్చి ఇస్తే వద్దు కావేరీ అంటాడు.

కావేరీ ఎవరని సుమిత్ర, కాంచన, దశరథ అడుగుతారు. ఏదేదో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024