Karthika deepam2: కార్తీక దీపం 2 సీరియల్.. దీప కూతురు కాకపోయినా ముఖ్యమేనన్న సుమిత్ర.. వంటలక్కని ఇమిటేట్ చేసిన కార్తీక్
Karthika deepam 2 serial today may 15th episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తనకు దీప కూడా ముఖ్యమేనని సుమిత్ర కూతురితో చెప్తుంది. అటు తొందరగా కార్తీక్ ని పెళ్లి చేసుకోమని పారిజాతం జ్యోత్స్నని విపరీతంగా రెచ్చగొట్టే పనిలో ఉంటుంది.
Karthika deepam 2 serial today may 15th episode: కార్తీక్ దీప పని చేస్తున్న హోటల్ కి వచ్చి టిఫిన్ చేస్తాడు. సాయం ఏదైనా కావాలంటే అడగమని చెప్తాడు. కానీ దీప మాత్రం కోపంగా వద్దని అంటుంది. నువ్వు వద్దనుకున్నా నేను మాత్రం నీ శ్రేయోభిలాషిని. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు సాయం చేస్తానని అనుకుంటాడు.
దీపని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్
జ్యోత్స్న దగ్గరకు సుమిత్ర వస్తుంది. తనని ఎందుకు అర్థం చేసుకోవడం లేదని తల్లిని అడుగుతుంది. గొడవ గురించి మర్చిపొమ్మని చెప్తుంది. దీప తప్పు చేసే మనిషి కాదని అంటుంది. అంటే బావ తప్పు చేసే మనిషా? నాకు ఇంకా అదే మైండ్ లో తిరుగుతుంది.
నువ్వు దీపకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావ్ ఎందుకో అర్థం కావడం లేదని అంటుంది. నాకు తెలియదు దీపకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. కానీ నాకు దీప ఎందుకో బాగా కావాల్సిన మనిషిలా అనిపిస్తుంది. దీప పరిస్థితి చూసి జాలి పడుతున్నానా లేదంటే నిజంగానే తన మీద అంత అభిమానం కలిగిందో అర్థం కావడం లేదు.
దీప జీవితం చక్కదిద్దటానికి ఏదైనా చేయాలని ఉందని చెప్తుంది. నువ్వు చేసింది సాయం అనిపిస్తుంది. కానీ బావ చేస్తుంది సాయంలా అనిపించడం లేదని అంటుంది. దీప మీద నాకు ఏ కోపం లేదు. ఇంతజరిగిన తర్వాత తను అంటే ఏంటో నాకు అర్థం అయ్యిందని జ్యోత్స్న చెప్తుంది.
దీప కూడా ముఖ్యమే
నీకంటే ఎక్కువగా దీపని సపోర్ట్ ని చేస్తున్నా అని ఫీల్ అవుతున్నావ్. నువ్వు నా కన్న కూతురివి నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు. కానీ దీప కూడా నాకు ముఖ్యమే. అలా అని దీప కన్న కూతురు కాలేదు కదా. ఈ వ్యత్యాసం అర్థం అయితే బాధపడాల్సిన అవసరం లేదని సుమిత్ర చెప్తుంది.
దీపని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశానా అని జ్యోత్స్న అనుకుంటుంది. దశరథ క్యూబ్ సెట్ చేయడానికి తిప్పలు పడుతుంటే శౌర్య వచ్చి తాను ట్రై చేస్తానని అంటుంది. చిటికెలో క్యూబిక్స్ సెట్ చేస్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. శౌర్యని మంచి స్కూల్ లో వేయాలని అంటాడు.
దీపకు తెలియకుండా స్కూల్ లో చేర్పించేద్దామని అంటాడు. కార్తీక్ వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్తే నా స్థాయికి తగినట్టు స్కూల్ లో చేర్పించుకుంటానని దీపలా ఇమిటేట్ చేసి చూపిస్తాడు.
అమ్మకి అబద్ధం చెప్పాలా అంటుంది. ఎవరితో తిట్లు తినకుండా అత్త పేరు చెప్దామని అంటారు. నువ్వు మాతో ఏ సాయం తీసుకోవడం లేదు కనీసం నీ కూతురిని చదివిస్తానని దశరథ అనుకుంటాడు. కార్తీక్ శౌర్యని తీసుకుని స్కూల్ దగ్గరకు వెళ్లబోతుంటే దీప ఎదురుగా నిలబడుతుంది.
దొరికిపోయిన కార్తీక్
ఎక్కడికి వెళ్తున్నావ్ అని దీప శౌర్యని అడుగుతుంది. పాపని స్కూల్ లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నామని చెప్తాడు. మిమ్మల్ని తీసుకెళ్లమని చెప్పలేదు కదా అంటే మా అత్త తీసుకెళ్లమని చెప్పిందని అంటాడు.
శౌర్యని స్కూల్ లో చేర్పించమని సుమిత్రమ్మకి నేను చెప్పలేదని అంటుంది. పాప చాలా తెలివైనది మంచి స్కూల్ చేర్పించమని అత్త చెప్పిందని అంటాడు. కానీ దీప మాత్రం వద్దని అంటుంది. తన మీద తన బిడ్డ మీద జాలి చూపించాల్సిన అవసరం లేదని దీప అంటుంది.
అదంతా పారిజాతం కిటికీలో నుంచి చూస్తుంది. నాకు అలా అనిపించడం లేదు. వాళ్ళిద్దరినీ చూస్తుంటే వాళ్ళిద్దరికి పెళ్లి అయి ఆరేళ్లు అయినట్టు, శౌర్య వాళ్లిద్దరికీ కూతురు అయినట్టు ఉందని పారిజాతం జ్యోత్స్నని రెచ్చగొడుతుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే ఇద్దరు మెడలో దండలు మార్చుకుని ఏదో ఒకరోజు కనిపిస్తారని అంటుంది.
రెచ్చగొట్టిన పారిజాతం
బావని తక్కువ చేసి ఎవడో మాట్లాడితే తట్టుకోలేకపోయాను. తనని నువ్వు కూడా వాడిలా మాట్లాడితే ఊరుకొనని జ్యోత్స్న చెప్తుంది. వాళ్ళని చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. పారిజాతం దీప, కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఈరోజు కూతురిని చదివిస్తాను అంటాడు రేపు తల్లిని ఉద్ధరిస్తాను అంటాడని చెప్తుంది.
దీప మాత్రం ఎంత కష్టమైన శౌర్యని తానే చదివించుకుంటానని చెప్తుంది. నువ్వు అన్నది నిజమైతే బావ తీసుకుని వెళ్ళాలి కదా మరి దీప తీసుకెళ్తుంది కదా అంటుంది. పాపని తీసుకెళ్ళి నువ్వు స్కూల్ చేర్పించు ఫీజ్ సంగతి నేను చూసుకుంటానని చెప్పాడని పారిజాతం రెచ్చగొడుతుంది. కార్తీక్ అలా చెప్పడం వల్లే దీప ధైర్యంగా ఉందని అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్