కార్తీకదీపం 2 సీరియల్..బావ కోసం అల్లాడిపోయిన జ్యోత్స్న.. దీపకి ఎప్పటికీ తోడుగా ఉంటానని తేల్చేసిన కార్తీక్-karthika deepam 2 serial today may 13th episode karthik promises to protect deepa and sourya from narasimha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  కార్తీకదీపం 2 సీరియల్..బావ కోసం అల్లాడిపోయిన జ్యోత్స్న.. దీపకి ఎప్పటికీ తోడుగా ఉంటానని తేల్చేసిన కార్తీక్

కార్తీకదీపం 2 సీరియల్..బావ కోసం అల్లాడిపోయిన జ్యోత్స్న.. దీపకి ఎప్పటికీ తోడుగా ఉంటానని తేల్చేసిన కార్తీక్

Gunti Soundarya HT Telugu
May 13, 2024 06:48 AM IST

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహ కార్తీక్ ని అవమానించడం జ్యోత్స్న తట్టుకోలేకపోతుంది. అందరూ దీపని సపోర్ట్ చేసి తనకు అన్యాయం చేస్తున్నారని వాపోతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ మే 13వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 13వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial may 13th episode: నరసింహ నీకు ముందే తెలుసా అని సుమిత్ర కార్తీక్ ని అడుగుతుంది. తెలుసు అత్త కానీ వాడు ఇంకోక పెళ్లి చేసుకున్న విషయం రాత్రి తెలిసిందని చెప్తాడు. నేనే వెళ్ళి వాడితో మాట్లాడాలి అనుకున్నాను కానీ వాడు ఇలా ఇంటికి వచ్చి గొడవ చేస్తాడని అనుకోలేదని చెప్తుంది.

దీప వల్ల ఈ సమస్యలు

మన స్టేటస్ ఏంటి ఈరోజు ఇంట్లో జరిగిన గొడవ ఏంటి? దీనికి కారణం ఎవరు? ఆరోజు నీతో నేను వస్తానంటే వద్దని అన్నావ్. ప్రమాదం జరిగిందని దీప కాపాడిందని చెప్పి ఇంటికి తీసుకొచ్చావ్ అని పారిజాతం అంటుంది. కార్తీక్ అడ్డుపడితే ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటుంది.

ఈ ఇంటికి సమస్యలు దీప రాకతోనే మొదలయ్యాయి. అది వచ్చిన తర్వాత దాని మొగుడు వచ్చి గొడవ చేశాడు. నా మనవరాలు దాని కారణంగానే పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. చివరికి పరువు, కిరీటం పోయింది. బయటకు వెళ్తే ఎవరు ఏం అంటారోనని వెళ్లడమే మానేసింది.

అల్లాడిపోయిన జ్యోత్స్న

అత్త వచ్చింది పోయింది ఇప్పుడు కొడుకు వచ్చి నానా దరిద్రం చేసి పోయాడు. జ్యోత్స్న కూడా పారిజాతానికి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు జరిగిన దానికి నేను ఎంత బాధపడుతున్నానో ఎవరైనా ఆలోచించారా? అంటుంది. మన ముందు నిలబడటానికి అర్హత లేని వ్యక్తి బావని పట్టుకుని తిడుతుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? అని నిలదీస్తుంది.

వాడు తాగుబోతు వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావని సుమిత్ర అంటే జ్యోత్స్న ఫైర్ అవుతుంది. దీపని ఒక్కరూ కూడా మాట పడనివ్వడం లేదు జరిగింది సరిపోలేదా? దీప విషయంలో బావని నిలదీయాల్సిన అవసరం ఏంటి? నీకు నా భార్యకు సంబంధం ఏంటని వాడు నిలదీస్తే మీకు ఎలా ఉందో కానీ నాకు మనసుకి తీసుకోవడం చాలా కష్టంగా ఉందని ఏడుస్తుంది.

దీపని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు

బావని అత్త అంటేనే ఊరుకోను గొడవ పడతాను. అలాంటిది వాడు ఎవడు బావని అనడానికి. ఎవరో బావని తక్కువ చేసి మాట్లాడటం నేను ఎప్పుడు వినలేదు. అలా అనిపించుకునే పొజిషన్ లో బావ ఎందుకు ఉండాలి. ఇవి జరగడానికి కారణమైన దీపని మీరు ఎందుకు సపోర్ట్ చేయాలి?

దీప నా కూతురు అన్నావ్ మరి నేను ఎవరు మమ్మీ? దీప నీ కూతురు అయితే నేను నీ కూతురు కాదనే కదా. ఇద్దరం సమానమని నేను అనుకోలేనని అంటుంది. ఈ విషయాన్ని పర్సనల్ గా తీసుకోవద్దని సుమిత్ర నచ్చజెప్పడానికి చూస్తుంది.

దీప నీ ప్రాణాలు కాపాడింది సాయం చేశావ్ ఇక తనని వెనకేసుకుని రావద్దు. వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. వాడు చెప్పేవరకు మనకు ఈ విషయాలు తెలియవు. వాడు అన్న మాటల్లో నిజం ఉందని అనిపిస్తుందని జ్యోత్స్న అనుమానపడుతుంది.

అన్యాయం జరిగింది

దశరథ సర్ది చెప్పడానికి చూస్తాడు. కానీ జ్యోత్స్న మాత్రం వినదు. దీప వెళ్లిపోతాను అంటే మమ్మీ ఆపింది దాని కారణంగా చాలా పోగొట్టుకున్నాను. కానీ బావ నా ప్రాణం అది నేను పోగొట్టుకోలేనని ఏడుస్తుంది. లేనివాటిని ఊహించుకుని భయపడుతున్నావని శివనారాయణ చెప్తాడు.

ఇదేది నిజం కాదు భార్యని వదిలించుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నాడని అంటాడు. అది బావతో ఎందుకు ముడిపెడుతున్నాడని జ్యోత్స్న నిలదీస్తుంది. కన్నకూతురిని వదిలేసి ఎవరినో సపోర్ట్ చేస్తావ్ ఏంటి మమ్మీ అంటుంది.

ఇక్కడ అన్యాయం అయిపోయింది దీప అంటే కాదు నేను అంటుంది. నా బాధ ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు నిజంగా నాకు అన్యాయం జరిగిందని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. నీ వల్లే నా మనవరాలికి మనశ్శాంతి లేకుండా పోయిందని సుమిత్రని పారిజాతం తిడుతుంది.

జ్యోత్స్న నీ కూతురు కాదు

అది మీకు మనవరాలు అయితే నాకు కూతురని సుమిత్ర అంటుంది. అది నీ కూతురు కాదు అనేసరికి అందరూ షాక్ అవుతారు. అది నీ కూతురు అయితే ఇలా చేసేదానివి కాదని అరుస్తుంది. శివనారాయణ పారిజాతం నోరు మూయించడానికి చూస్తాడు.

ముందు దీప మొగుడు నరసింహ నోరు మూయించండి. వాడు నింద వేసింది నీ మనవరాలికి కాబోయే మొగుడి మీద.. ఇది నలుగురికి తెలిస్తే జనం ఎక్కడో కాదు మన రెస్టారెంట్ లో మన గురించి మాట్లాడుకుంటారు. దీప చేసిన పనికి మనవరాలి పరువు పోయింది, మనవడిదైనా కాపాడండి అంటుంది.

కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప

కార్తీక్ సుమిత్రను తన పరిస్థితి గురించి అర్థం చేసుకోమని బాధగా చెప్పి వెళ్ళిపోతాడు. కార్తీక్ వెళ్లిపోతూ దీప దగ్గర ఆగుతాడు. జరిగిన దానికి ఏడుస్తూ ఉంటుంది నాలుగు ఓదార్పు మాటలు చెప్పాలని వచ్చారా? వద్దు నా బతుకు నన్ను బతకనివ్వండి. నా తరపున ఎవరితో మాట్లాడొద్దు అంటుంది.

నా సమస్యలోకి తలదూర్చి మాటలు పడేలా చేయవద్దు. ఇంటికి వచ్చి గొడవ చేసిన నరసింహ మీద కంటే మీ మీద ఎక్కువ కోపంగా ఉంది. ఆరోజు గుడి దగ్గర నరసింహని కొట్టకపోయి ఉంటే మీరు ఎవరో తెలిసి ఉండేది కాదు ఇంటికి వచ్చి గొడవ చేసేవాడు కాదని అంటుంది.

ఊర్లో తెలియదా?

ఏం మాట్లాడుతున్నావ్ నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు ధైర్యంగా బతికి నిరూపించాలి. లేదంటే వాడికి భయపడి ఇక్కడ నుంచి పారిపోవాలి తప్పు వాడు చేస్తే నువ్వు ఎందుకు శిక్ష అనుభవించాలి. నువ్వు ఊరు వెళ్లిపోతే అక్కడ ఊర్లో తెలియకుండా ఉంటుందా?

మల్లేష్ మాటలకే ఇంత బాధపడితే ఇంకెంత మందిని కొడతావు. శౌర్యకి ఏం చెప్పలేవు. ఇవన్నీ వాడు ఆలోచించడు. కానీ నువ్వు ఆలోచించాలి రౌడీకి అమ్మానాన్న నువ్వే. ఊర్లో మల్లేష్ ని, గుడిలో నరసింహని కొట్టాను. వాటి వల్ల ఇలా జరిగిందని అంటున్నావ్.

జరిగిన ఈ రెండు చెంప దెబ్బలు తీసేస్తే నీ జీవితం ఇంతకంటే గొప్పగా ఉండేది కాదు. ఊర్లో ఉంటే వాడు బాధపెట్టేవాడు. ఇక్కడ ఉన్నావ్ కాబట్టి వీడు బాధపెడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాల్సింది నీ గురించి నీ బిడ్డ గురించని చెప్తాడు.

రౌడీకి దూరంగా ఉండను

తన గురించి పట్టించుకోవద్దని కార్తీక్ కి చెప్తుంది. తనకు, తన కూతురికి దూరంగా ఉండమని అంటుంది. చాన్నాళ్ళ తర్వాత నాకు నా గతం గుర్తుకు వచ్చింది. మీకు క్షమాపణ చెప్పి సాయం చేయాలని అనుకున్నాను.

ఇంత జరిగిన తర్వాత మీ మాటలు విన్న తర్వాత మీ బాధ్యత తీసుకోవాలని అనిపించింది. కానీ మీరు చెప్పినట్టు రౌడీకి దూరంగా ఉండను. మీ కుటుంబానికి శ్రేయోభిలాషిలాగా ఉంటాను. మీరు వద్దనుకున్నా సరే మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటాను.

మీ కోసం గేటు కాదు నన్ను దాటుకుని ఎవడు వస్తాడో చూస్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మీ శ్రేయోభిలాషినే. ఇక దేవుడిని వేడుకోవడం మానేయండి. నేను ఇక రోజు ఎదురుపడుతూనే ఉంటాను. నన్ను ద్వేషించుకోండి ఇక్కడే ఉంటాను ఇక్కడే తిరుగుతూ ఉంటానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 ఎపిసోడ్ ముగిసింది.

IPL_Entry_Point