Krishna Mukunda Murari December 2nd Episode: తండ్రి పనికి ముకుంద షాక్.. కృష్ణకు క్షమాపణలు, రెస్టారెంట్‌లో మురారి రచ్చ
Krishna Mukunda Murari Today Episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ డిసెంబర్ 2వ తేది ఎపిసోడ్‌లో ఇంట్లో వేణి ఉందన్న విషయం ఎందుకు చెప్పలేదని భవానీ ముకుంద తండ్రి శ్రీనివాస్‌ను అడుగుతుంది. దీంతో ముకుంద షాక్ అవుతుంది. ఇలా కృష్ణ ముకుంద మురారి నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
Krishna Mukunda Murari Day 330 Episode: ఏంటీ శ్రీనివాస్ అన్నయ్య వేణి ఉందన్న విషయం చెప్పనలేదు అని భవానీ అంటుంది. దాంతో శ్రీనివాస్ తటపటాయిస్తాడు. ముకుంద షాక్ అవుతుంది. తండ్రిని అలాగే చూస్తుండిపోతుంది. నన్ను కృష్ణను కిచెన్‌లో ఉంచి పెద్దమ్మకు అబద్ధం చెప్పాడు శ్రీనివాస్ అంకుల్. ముకుంద తండ్రి అయిండి కూడా వేణి గారిని సేవ్ చేసేందుకు ట్రై చేస్తున్నాడంటే ఇదేదో ఆలోచించాల్సిందే అని మురారి అనుకుంటాడు.
జైలుకు ఎందుకు వెళ్లాడు
ఇంతలో కృష్ణ వచ్చి కాఫీ ఇస్తుంది. ఛ.. ఛ.. వేణి గారు అలాంటి అమ్మాయి కాదు. పెద్దమ్మ ఎక్కడో పొరపాటు పడుతున్నారు అని మనసులో అనకుంటాడు మురారి. మరోవైపు శ్రీనివాస్ అన్నయ్య కృష్ణకు అన్యాయం చేయకూడదని భవానీ అక్కయ్యకు చెబితే బాగుండు అని ఆలోచిస్తుంది రేవతి. ఇంతలో శకుంతల వస్తే.. ఒకటి అడుగుతాను చెబుతావా అంటుంది. ప్రభాకర్ అన్నయ్య ఎందుకు జైలుకు వెళ్లాడని అడుగుతుంది రేవతి.
నేను ఇలా చేస్తేనే కిట్టమ్మ జీవితం బాగుంటుందని, అల్లుడితో ఉంటుందని చెప్పి వెళ్లారు. అంతకుమించి నాకు ఏం తెలియదని శకుంతల చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు భవానీ, మురారి, ముకుంద బయలుదేరుతారు. కృష్ణ కూడా మనతో వచ్చేందుకు ప్లాన్ చేస్తుందని భవానీతో ముకుంద చెబుతుంది. శుభలేఖలు రాగానే చెబుతానని భవానీ అంటుంది. వెళ్లొస్తాను అంకుల్ అని మురారి అంటే.. నీకు త్వరగా గతం గుర్తుకురావాలి అని శ్రీనివాస్ మనసులో అనుకుంటాడు.
నన్ను క్షమించమ్మా
అది విన్నట్లుగా అనిపించిన మురారి.. ఏంటీ అంకుల్ అలా చూస్తున్నారని అడుగుతాడు. ఏం లేదని శ్రీనివాస్ అంటాడు. వేణి గారు మీరు కూడా మాతో రండి అని మురారి అంటే.. డ్రైవర్ ఉన్నాడు కదా. మీ ఇద్దరి మధ్య తను ఎందుకు. వేణి ఎలా వచ్చిందో అలాగే వెళ్లిపోతుంది అని భవానీ అంటుంది. వాళ్లు వెళ్లిపోతారు. తర్వాత నన్ను క్షమించమ్మా. నేను నిమిత్రమాత్రుడిని అని చేతులు మొక్కి చెబుతాడు శ్రీనివాస్. అంత మాటొద్దు బాబాయ్.. నాకో సహాయం చేస్తారా అని అడుగుతుంది కృష్ణ.
ఏదో చెప్పి ఒక నెంబర్ పంపిస్తుంది కృష్ణ. తర్వాత వెళ్లిపోతుంది. కారులో వెళ్తుండగా ఒక్క క్షణం కూడా వేణి గారి గురించి నెగెటివ్‌గా ఆలోచించలేకపోతున్నా. పెద్దమ్మకు ఎవరో తప్పుగా చెప్పి ఉండాలి. లేదా ముకుంద జీవితం కాపాడేందుకు ఇలా చేసి ఉండాలి అని మురారి ఆలోచిస్తుంటాడు. వేణిని నేను అన్నదానికి డిస్టర్బ్ అయి ఉంటాడు అనుకున్న భవానీ ఆ వేణి కృతజ్ఞత లేని మనుషులు అని అంటుంది వదిలేయొచ్చు కదా పెద్దమ్మా అని మురారి అంటే సరేనని భవానీ అంటుంది.
కన్నీళ్లు పెట్టుకున్న రేవతి
ఏం చెప్పి ముకుంద పెళ్లి ఆపేయాలని కన్నీళ్లు పెట్టుకుంటుంది రేవతి. నందు వచ్చి ఏమైందని అడుగుతుంది. నా దగ్గర దాపరికాలు ఏంటని అంటుంది. ఆ దేవుడు కూడా వాళ్లను విడదీస్తున్నాడు. తల్లిని అయినా కూడా నేను ఏం చేయలేకపోతున్నాను. శుభలేఖలు కూడా ఆర్డర్ ఇచ్చారు అని రేవతి కన్నీళ్లు పెట్టుకుంటు చెబుతుంది. మనం ఊరుకోవచ్చు కానీ, కృష్ణ పిరికిది కాదు. తన మొగుడుని లాక్కుని వెళ్తుంటే చూస్తూ ఊరుకోదు. నువ్ ధైర్యంగా ఉండమని చెబుతుంది నందు.
ముకుంద, మురారి, భవానీ రెస్టారెంట్‌కు వెళ్తారు. వేణిపై నిందలు ఎందుకు వేశారని ఆలోచిస్తుంటాడు మురారి. పక్క టేబుల్‌లో ఓ జంట బిర్యానీ ఆర్డర్ చేసుకుంటుంది. తన భర్తకు భార్య తన చేతులతో వడ్డిస్తానని చెబుతుంది. అది విన్న మురారి ఏదో గుర్తుకు వచ్చినట్లు అనిపించి.. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు మీకు నాకు వడ్డించారా అని మురారి అడుగుతాడు. మీరెవరో నాకు తెలియదు. నేను మీకు వడ్డించడం ఏంటని ఆ అమ్మాయి అంటుంది.
ఇలాగే వడ్డించారు
ఇంతలో అక్కడికి బాగా ఆకలి వేస్తుందని అదే రెస్టారెంట్‌కు వస్తుంది కృష్ణ. నాకు ఇలాగే వడ్డిస్తుంటే నేను తిన్నాను. ఈమె అబద్ధం చెబుతుంది. నేను విజవల్స్‌గా కనిపిస్తోంది అని కంగారుగా అంటాడు మురారి. అక్కడికి వచ్చిన కృష్ణ సార్.. వాళ్లు వేరేవాళ్లు అయింటారు. ముందుగా వాళ్లకు సారీ చెప్పమని అంటుంది. దాంతో సారీ అని చెబుతాడు మురారి. వేణి గారు నాకు ఇలాగే వడ్డించారు. గుర్తుకు రావట్లేదు అని మురారి అంటే.. సారీ సార్.. నేనే అని చెప్పలేకపోతున్నాను అని కృష్ణ అనుకుంటుంది.
ఇంటికెళ్లి భోజనం చేద్దామని ముకుంద, మురారిని తీసుకెళ్తుంది భవానీ. మరోవైపు మధుపై రేవతి అరిస్తే.. కృష్ణ రాలేదనేగా నీ కోపం అని అంటాడు. అవును అని రేవతి చెబుతుంది. తర్వాత కృష్ణ కోసం ఏం చేయలేకపోతున్నామని నందు అంటుంది. ఇంతలో భవానీ వాళ్లు వస్తారు. తర్వాతి ఎపిసోడ్‌లో ఎవరో కుక్కను తెచ్చుకుని పెంచుకున్నట్లు ఉంది. అసలు నేను ఎవరు, నేను ఏం చేసేవాడిని భవానీని అడుగుతాడు మురారి.