Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. రచ్చ రచ్చ చేసిన నరసింహ.. దీపకు అండగా నిలిచిన సుమిత్ర కుటుంబం-karthika deepam 2 serial today may 11th episode karthik trashes narasimha for talking ill about his and deepa bond ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: కార్తీకదీపం 2 సీరియల్.. రచ్చ రచ్చ చేసిన నరసింహ.. దీపకు అండగా నిలిచిన సుమిత్ర కుటుంబం

Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. రచ్చ రచ్చ చేసిన నరసింహ.. దీపకు అండగా నిలిచిన సుమిత్ర కుటుంబం

Gunti Soundarya HT Telugu
May 11, 2024 07:23 AM IST

Karthika deepam 2 serial today may 11th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహ దీప సుమిత్ర ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తాడు. దీపని ఊరు వదిలి వెళ్లకపోతే ఊరుకునేది లేదని గొడవ చేస్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ మే 11వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 11వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today may 11th episode: పారిజాతం బంటుని సీక్రెట్ గా కలుస్తుంది. దీప ఇంట్లో ఉంటే నిన్ను గెంటేసినట్టే ఏదో ఒక రోజు నన్ను గెంటేస్తారని పారిజాతం అంటుంది. ఇదంతా జరగకూడదు అంటే దీప ఇంట్లో ఉండకూడదని బంటు అంటాడు.

దీప వివరాలు తెలుసుకో

దీప మొగుడి వివరాలు మనకు సగమే తెలిశాయి. పూర్తి వివరాల కోసం దీప సొంతూరు ముత్యాలమ్మ గూడెం వెళ్ళు. దీప పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుని రమ్మని చెప్తుంది. దాని కథ ఏంటో తెలిస్తే దాని బలహీనత తెలుస్తుంది దాని మీద దెబ్బ కొడితే ఇల్లు వదిలి పారిపోతుందని పారిజాతం చెప్తుంది.

దీప ఒక్కసారిగా సుమిత్ర వాళ్ళ ఇంట్లో పడిపోతుంది. ఏమైందని సుమిత్ర వాళ్ళు కంగారుగా అడుగుతారు. అప్పుడే నరసింహ వస్తాడు. నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావని సుమిత్ర అడుగుతుంది. నేను ఇక్కడికి వచ్చింది మీతో గొడవ పడటానికి కాదు వాడి సంగతి తేల్చడానికని అంటాడు.

గెంటేసిన కార్తీక్ 

రారా బయటకు అని అరుస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ నరసింహ చేసే గొడవ చూస్తూ ఉంటారు. బయటకు వెళ్ళమని దీప కోపంగా చెప్తుంది. వాడు ఇలా పిలిస్తే రాడు ఎలా రప్పించాలో నాకు తెలుసని దీప జుట్టు పట్టుకుంటాడు. అప్పుడే కార్తీక్ వచ్చి నరసింహ మెడ పట్టుకుంటాడు.

కార్తీక్ నరసింహని మెడ పట్టుకని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. కార్తీక్ వాడిని కొట్టబోతుంటే దీప ఆపుతుంది. దీప, కార్తీక్ కి అక్రమ సంబంధం అంటగడుతూ నరసింహ వాగుతాడు. అందరూ షాక్ అయిపోతారు. ఏ సంబంధం లేకుండా నా భార్యని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావా? అని అడుగుతాడు.

నరసింహ రచ్చ రచ్చ 

ఏ సంబంధం లేకుండా నువ్వు నన్ను గుడిలో కొట్టావా? ఏ సంబంధం లేకుండానే నా పెళ్ళాన్ని, కూతురిని తీసుకుని షాపింగ్ కి వెళ్ళావా? ఏ సంబంధం లేకుండానే నా కూతురిని నీకు పుట్టిన కూతురిగా ఎత్తుకుని ముద్దాడుతున్నావా అనేసరికి కార్తీక్ లాగిపెట్టి ఒకటి పీకుతాడు.

రోడ్డు పక్కన చెట్ల కింద మీరు మాట్లాడుకోవడం నేను చూడలేదనుకున్నావా? నేనే కాదు మా అమ్మ కూడా చూసింది. నిన్ను మొగుడు వదిలేస్తే ఏంటి నిన్ను చూసుకోవడానికి నేనున్నానని వీడు అన్నాడా లేదా నరసింహ నిలదీస్తాడు. కార్తీక్ కోపంగా నరసింహ కాలర్ పట్టుకుంటాడు.

నిజం చెప్పిన సుమిత్ర 

నువ్వు ఇక్కడ నుంచి పోయే వరకు నేను ఇలాగే అరిచి పెంట పెంట చేస్తానని అనేసరికి సుమిత్ర లాగిపెట్టి మరొకటి పీకుతుంది. దీపని పో అంటే ఎక్కడికి పోతుందని అడుగుతుంది. వాడి ఇంటికే పోతుందని పారిజాతం అంటుంది. వీడు దీపని వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాడని సుమిత్ర నిజం బయట పెడుతుంది.

భర్త కోసం వెతుకుతూ వస్తే కానీ వీడి సంగతి తెలియలేదు. వీడు మోసం చేశాడని తెలిసి కాపురం వద్దనుకుని దూరంగా వెళ్లిపోవాలని అనుకుంది. ఆ తర్వాత నా ప్రాణాలు కాపాడి మన ఇంటికి చేరుకుంది. వీడు దీపని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.

నరసింహ చెంప పగలగొట్టిన సుమిత్ర 

ఈ పెద్దావిడకు మన సినిమా చూపించావా? ఇక నేరుగా మాట్లాడతాను. నా పెళ్ళాం మీ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఉన్నపళంగా కూతురిని తీసుకుని ఊరు వెళ్లిపో లేదంటే నేనే జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి రెండు తగిలించి పంపిస్తానని అనేసరికి సుమిత్ర మళ్ళీ ఒకటి పీకుతుంది.

ఏంట్రా బెదిరిస్తున్నావ్ ఊరు వెళ్లకపోతే చంపేస్తావా దాన్ని అంటుంది. దీప నా కూతురు తన కోసం నేను ఉన్నాను. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయించమని శివనారాయణ దశరథతో అంటాడు. నరసింహ మాత్రం దీప, కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడతాడు.

చొక్కాలు పట్టుకుని కొట్లాట 

నరసింహ, కార్తీక్ చొక్కాలు పట్టుకుని తలపడతారు. నా గురించి ఎవరూ ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదని దీప అంటుంది. నువ్వు ఊరు వెళ్లిపోవాలి అదే పరిష్కారం అంటాడు. అక్కడ ఎవరు ఉన్నారని వెళ్లాలని అంటుంది. ఇక్కడ ఎవరు ఉన్నారని నరసింహ అడుగుతాడు.

ఏంటి మాకు ఈ దరిద్రం మీ మాటలు వింటుంటే కంపరంగా ఉందని పారిజాతం కోపంగా అరుస్తుంది. నీ మొగుడిని తీసుకుని ఇక్కడి నుంచి పో అంటుంది. దీప ఎక్కడకి వెళ్లదు. తనకు మనం తప్ప ఎవరూ లేరు. దీప నీతో రాదు వెళ్ళు సుమిత్ర అంటుంది. పోలీసులకు ఫోన్ చేసి చీటింగ్ కేసు పెడితే గాని బుద్ధి రాదని దశరథ కూడా అంటాడు.

శ్రీధర్ కి గతం ఉందా?

దీప వద్దని అంటుంది. సుమిత్ర కుటుంబం మొత్తం దీపకు అండగా మాట్లాడుతుంది. వాడు నీ వెనుక ఉన్నాడనే ధైర్యంతోనే కదా ఇలా మాట్లాడుతున్నావ్. ఊరు వెళ్లకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు, నిన్ను అయితే వదిలి పెట్టను అని దీపకు నరసింహ వార్నింగ్ ఇస్తాడు.

దీప ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కాంచన, శ్రీధర్ సరదాగా ఉంటారు. మనం కొడుకుతో పాటు కూతురిని కూడా కని ఉంటే బాగుండేదని కాంచన అనగానే శ్రీధర్ కోపంగా మొహం పెడతాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 ఎపిసోడ్ ముగిసింది. 

 

IPL_Entry_Point