NNS 8th May Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (మే 8) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. సంప్రదాయం ప్రకారం కూతురు, అల్లుడిని తన ఇంటికి తీసుకెళ్తానంటాడు రామ్మూర్తి. కానీ అమర్ రానని చెప్పడంతో అందరూ బాధపడతారు. మీ మాటల్లో న్యాయం ఉన్నా, మీ కోపంలో ధర్మం ఉన్నా ఆ మాటలు మా నాన్నని ఎంత బాధపెడతాయో ఆలోచించారా అంటుంది మిస్సమ్మ. రామ్మూర్తిని క్షమించమని అడిగి తన గదిలోకి పరిగెడతాడు అమర్.
మీరు చేసిన పనికి అమర్ ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు, మీరింకా ఆ బాధని రెట్టింపు చేయకండి అంటుంది మనోహరి. భాగీ వెంటనే అమర్ గదికి పరిగెత్తుకుంటూ వెళ్లి జరిగినదాని గురించి నిలదీస్తుంది. తన అల్లుడిని ఇంటికి తీసుకెళ్లే మార్గం చెప్పమని రాథోడ్ని అడుగుతాడు రామ్మూర్తి. ఇద్దరూ కలిసి గుండెపోటు నాటకం ఆడతారు.
రామ్మూర్తి గుండెపోటు వచ్చినట్లు నటించడంతో అందరూ కంగారు పడతారు. మనోహరి మాత్రం ఆయనకు ఊపిరితిత్తుల సమస్య ఉంటే గుండెపోటు అంటున్నారేంటని అనుమానపడుతుంది.
యమలోకంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు చిత్రగుప్తుడు. నాలుగైదు మార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది. అరుంధతి నవ్వడం చూసి కోప్పడతాడు చిత్రగుప్తుడు. అప్పుడు యముడు ప్రత్యక్షమై యమలోకానికి చిత్రగుప్తుడికి ప్రవేశం లేదని అంటాడు.
కారణమేంటని అడగిన చిత్రగుప్తుడితో.. నువ్వు దశదిన కర్మ జరిగిన పిమ్మట తీసుకురావల్సిన ఆత్మని ఇన్ని రోజులుగా భూలోకాన ఉంచినందుకు శిక్షగా యమలోకం నుంచి నిన్ను బహిష్కరించామని చెప్పి మాయమవుతాడు యముడు. ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడతాడు చిత్రగుప్తుడు.
యమలోకం నుంచి తనని బహిష్కరించినందుకు బాధపడుతూ ఉంటాడు గుప్త. జరిగిన దాంట్లో తన తప్పేం లేదని, కావాలంటే యమధర్మరాజుతో తాను మాట్లాడుతానంటుంది అరుంధతి. ఇంతలో చిత్రగుప్తుడి సామాన్లను విసిరేస్తారు యమభటులు.
మాయదర్పణంతో సహా తన వస్తువులను తీసుకుంటాడు గుప్త. చిత్రగుప్తుడి తరపున యముడితో తాను మాట్లాడుతానని వెంటనే సమావేశం ఏర్పాటు చేయమని అంటుంది అరుంధతి. ఈ బాలిక తనను మరింత ఇరకాటంలో పడేస్తుందని కంగారు పడతాడు చిత్రగుప్తుడు.
అమర్, భాగీ పరిగెత్తుకుంటూ వచ్చి రామ్మూర్తిని సోఫాలో కూర్చోబెట్టి ఏం జరిగిందోనని ఆందోళన చెందుతారు. ప్లాన్ ప్రకారం రాథోడ్ డాక్టర్లా వేషం వేసుకుని వచ్చి రామ్మూర్తి గుండె బలహీనంగా ఉంది, ఆయనకు నచ్చిన పనులు చేసి సంతోషంగా ఉంచండి అని చెబుతాడు. చేసేదేం లేక రామ్మూర్తి ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకుంటాడు అమర్.
భాగీ, అమర్ రామ్మూర్తి వెంట వెళ్లకుండా మనోహరి చాలా ప్రయత్నిస్తుంది. అంతా తన భర్త ఆడిన నాటకమే అంటుంది మంగళ. ఆలోచనలో పడుతుంది మనోహరి. కోమాలో ఉన్న సరస్వతి మేడమ్ స్పృహలోకి వస్తుందా? మాయా దర్పణం సహాయంతో తన చావు వెనక ఉన్నది ఎవరో అరుంధతి తెలుసుకుంటుందా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మే 08న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్