NNS 7th May Episode: భూమ్మీదకు తిరిగి రానున్న అరుంధతి ఆత్మ.. అమర్ ఇంటికి వెళ్లిన రామ్మూర్తికి గుండెపోటు!
NNS 7th May Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (మే 7) ఎపిసోడ్ లో చిత్రగుప్తుడికి యమలోకంలోకి ఎంట్రీ ఉండదు. దీంతో భూమ్మీదకు అరుంధతి ఆత్మ తిరిగి వస్తుందేమో అనిపిస్తుంది. మరోవైపు అమర్ ఇంటికి వెళ్లిన రామ్మూర్తికి గుండెపోటు వస్తుంది.
NNS 7th May Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (మే 7) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రాథోడ్ స్పీకర్ ఆన్ చేయడంతో మిస్సమ్మ మాట్లాడిందంతా వింటాడు అమర్. తన బ్యాడ్ టైమ్‌కి తనని తానే కోప్పుడుకుంటుంది మిస్సమ్మ.
అరుంధతి ఆత్మను తీసుకుని యమలోకానికి వెళ్తాడు చిత్రగుప్తుడు. యమలోకపు సౌందర్యాన్ని చూసి సంబరపడిపోతుంది అరుంధతి. భూలోకంలో తనని అష్టకష్టాలపాలు చేసి హాస్య నటుడిగా చూశావనీ, ఇకపై తనేంటో చూస్తావంటూ గంభీరంగా పలుకుతాడు చిత్రగుప్తుడు.
చిత్రగుప్తుడికి నో ఎంట్రీ
భలే కామెడీ చేస్తున్నారంటూ నవ్వుతుంది అరుంధతి. యమలోకంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమవుతాడు చిత్రగుప్తుడు. నాలుగైదు మార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది. అరుంధతి నవ్వడం చూసి కోప్పడతాడు చిత్రగుప్తుడు. అప్పుడు యముడు ప్రత్యక్షమై యమలోకానికి చిత్రగుప్తుడికి ప్రవేశం లేదని అంటాడు.
కారణమేంటని అడగిన చిత్రగుప్తుడితో.. నువ్వు దశదిన కర్మ జరిగిన పిమ్మట తీసుకురావల్సిన ఆత్మని ఇన్ని రోజులుగా భూలోకాన ఉంచినందుకు శిక్షగా యమలోకం నుంచి నిన్ను బహిష్కరించామని చెప్పి మాయమవుతాడు యముడు. ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడతాడు చిత్రగుప్తుడు.
అమర్ ఇంటికి రామ్మూర్తి దంపతులు
పెళ్లి తర్వాత కూతురు, అల్లుడిని మూడు రోజులు ఇంటికి తీసుకురావడం ఆచారమని తన భార్య మంగళను తీసుకుని అమర్ ఇంటికి వెళ్తాడు రామ్మూర్తి. అమర్ ఇంట్లో అడుగు పెట్టగానే అక్కడ అంతకుముందు అరుంధతి ఆత్మ తనను పలకరించినట్లు అనిపించినదంతా గుర్తుకువచ్చి ఏదో వెలితిగా ఉందని అంటాడు. రామ్మూర్తి మాటలు విని కోప్పడుతుంది మంగళ.
ఇంట్లోకి వస్తున్న రామ్మూర్తి దంపతులను చూసి గేటు దగ్గరే ఆపుతుంది మనోహరి. ఎలా ఉన్నావమ్మా.. అని పలకరిస్తున్న రామ్మూర్తిని తన తాళిని, జీవితాన్ని లాగేసుకుని వెటకారంగా అడుగుతున్నారా అంటుంది. అప్పుడే అటుగా వచ్చిన శివరామ్.. రామ్మూర్తి దంపతులను చూసి బావగారూ.. లోపలకు రండి అని పిలుస్తాడు. ఇంట్లోకి వచ్చి కూర్చున్న తల్లిదండ్రులను చూసి సంతోషపడుతుంది భాగీ.
వచ్చిన విషయం చెప్పడంతో అమర్‌కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మంటాడు శివరామ్. అంత అర్జంట్ పని ఏంటని అడగడంతో రామ్మూర్తి చెప్పిన విషయం చెబుతాడు. అసలు ఆ ఇంటికి నేను అల్లుడినే కాదు, నాకు జరిగింది పెళ్లే కాదు ఇంక సంప్రదాయాలు ఏంటి? అని కోప్పడతాడు అమర్. అదంతా కాదుగాని త్వరగా ఇంటికి రమ్మని శివరామ్ అనడంతో ఇంటికి వస్తాడు.
రామ్మూర్తికి గుండెపోటు
అమర్‌ని ఎలా ఉన్నారని రామ్మూర్తి పలకరిస్తున్నా పట్టించుకోకుండా వెళ్తాడు. అది చూసి శివరామ్, నిర్మల అమర్‌ని కోప్పడతారు. ఏది ఏమైనా వాళ్ల కూతురు ఈ ఇంటి కోడలు.. నువ్వు ఆయనను అలా అవమానించడం కరెక్ట్ కాదని మందలిస్తారు. కానీ మిస్సమ్మ మోసం చేసి తనని పెళ్లి చేసుకుందని, నగల విషయంలోనూ తనని మోసం చేసిందని అంటాడు అమర్.
దాంట్లో ఆయన ప్రమేయం ఎంతనేది తెలియకుండా మర్యాద ఎలా ఇమ్మంటారు అంటాడు. దానికి కోపంతో మీరు మా నాన్నని అవమానించడం బాలేదంటుంది మిస్సమ్మ. బాధపడుతున్న రామ్మూర్తికి సడెన్‌గా గుండెపోటు రావడంతో అందరూ కంగారు పడతారు. వెంటనే రామ్మూర్తిని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్తారు. రామ్మూర్తికి ఏం జరుగుతుంది? అమర్ భాగీని భార్యగా అంగీకరిస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మే 07న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్