NNS May 3rd Episode: అమరేంద్ర, అరుంధతి కథ సమాప్తం- ఉలిక్కిపడిన రామ్మూర్తి- మిస్సమ్మ జీవితంలో కొత్త అధ్యాయం- మనుకు ఏడుపు-nindu noorella saavasam serial may 3rd episode bhagamathi new life with amar nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns May 3rd Episode: అమరేంద్ర, అరుంధతి కథ సమాప్తం- ఉలిక్కిపడిన రామ్మూర్తి- మిస్సమ్మ జీవితంలో కొత్త అధ్యాయం- మనుకు ఏడుపు

NNS May 3rd Episode: అమరేంద్ర, అరుంధతి కథ సమాప్తం- ఉలిక్కిపడిన రామ్మూర్తి- మిస్సమ్మ జీవితంలో కొత్త అధ్యాయం- మనుకు ఏడుపు

Sanjiv Kumar HT Telugu
May 03, 2024 06:17 AM IST

Nindu Noorella Saavasam May 3rd Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 3వ తేది ఎపిసోడ్‌‌లో అరుంధతి అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్లిపోతుంది. దాంతో అమర్, అరుంధతి కథ సమాప్తం అవుతుంది. మరోవైపు మనోహరిని కావాలనే ఏడిపిస్తూ ఉంటుంది భాగమతి. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 3వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మే 3వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS May 3rd April Episode) మనోహరిని ఏడిపించడానికి భాగమతి జుట్టు చెరుపుకుని, బట్టలు నలుపుకుని డోర్​ తీస్తుంది. భాగీని చూసి మనోహరి షాకవుతుంది. సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ వస్తున్న భాగీని ఏయ్​.. ఏమైందే.. అంటూ కంగారు పడుతుంది మనోహరి.

పరిగెత్తుకెళ్లిన మనోహరి

అదేంటి మను.. ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావ్​. నాకు సిగ్గు.. నిజానికి ఆయన బయటకు కోపంగా ఉంటారేగానీ.. నైటంతా కబుర్లు, ముద్దులు.. అంటూ మనోహరిని ఉడికిస్తుంది. కిటికీలో నుంచి చూస్తున్న అరుంధతి మనోహరికి మిస్సమ్మ తగిన బుద్ధి చెబుతూ తన కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది అనుకుంటుంది. మిస్సమ్మ మాట్లాడుతున్నది పట్టించుకోకుండా రూమ్​లోకి పరిగెడుతుంది మనోహరి.

గదిలో చూసి మిస్సమ్మ అబద్ధం చెప్పిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంటుంది మనోహరి. అకస్మాత్తుగా రూమ్​లోకి వచ్చిన మనోహరిని చూసి ఏమైందని అడుగుతాడు అమర్​. ఏం లేదు అమర్​.. నువ్వు కాఫీ తాగుతావేమో అడుగుదామని వచ్చాను అంటుంది మనోహరి. అడిగేదేముంది.. తాగుతాను అంటాడు అమర్​. సరే నీలతో పంపిస్తాను అంటూ బయటకు వస్తుంది మనోహరి.

అరుంధతి దగ్గరికి భాగీ

ఏంటి మను.. భయపడ్డావా? అని ఆటపట్టిస్తుంది మిస్సమ్మ. మనోహరి కోపంగా అక్కడనుంచి వెళ్లిపోతుంది. బేస్​ క్యాంప్​కి వెళ్లడానికి రెడీ అవుతున్న అమర్​ కిటికీ దగ్గర నిల్చుని బాధపడుతూ ఉంటాడు. అరుంధతి అమర్​ దగ్గరకి వచ్చి క్షమాపణ చెప్పి బాయ్​ చెబుతుంది. ప్రతి జన్మకీ మీరే నా భర్తగా రావాలి అని బాధపడుతుంది. పరిగెత్తుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న అరుంధతిని చూసి అక్కా.. అంటూ పరిగెత్తుకుని వస్తుంది మిస్సమ్మ.

ఏమైందక్కా.. అలా పరిగెడుతున్నారు. నిన్న మీరు ఎక్కడికి వెళ్లారు.. అసలేం జరిగిందంటే.. అని చెప్పబోతుంటే నాకు అంతా తెలుసు మిస్సమ్మ అంటుంది అరుంధతి. ఓహ్.. అక్కడే ఉండి చూశారా.. అసలు ఇంతకి నేను ఆయనతో ఎందుకు ఈ తాళి కట్టించుకున్నానో.. ఏంటో.. అంటుంది మిస్సమ్మ. అది దైవ నిర్ణయం మిస్సమ్మ. పిల్లలు కుటుంబం జాగ్రత్త నేను వెళ్లిపోతున్నా అంటుంది అరుంధతి.

ఉలిక్కిపడిన రామ్మూర్తి

చిత్రగుప్తుడు పిలవడంతో వెళ్లి తనని తీసుకెళ్లమని చెబుతుంది. అరుంధతితో కలిసి మాయమవుతాడు చిత్రగుప్తుడు. అరుంధతి గతంలో జరిగిన సన్నివేశాలన్నీ కళ్ల ముందు మెదులుతూ బాయ్​ అని చెప్పడంతో రామ్మూర్తి నిద్రలో ఉలిక్కిపడతాడు. నా కూతురు నన్ను వదిలి వెళ్లిపోతుంది అంటూ కంగారు పడతాడు. నీ కూతురు నిన్ను వదిలి ఎక్కడికి పోయింది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లింది అంటుంది మంగళ.

నేను మాట్లాడుతుంది భాగీ గురించి కాదు నా పెద్దకూతురు గురించి అంటాడు రామ్మూర్తి. అదేంటీ అని కంగారు పడుతుంది మంగళ. ఇన్నాళ్లు నా కూతురు నా దగ్గరే ఉన్నట్లు నా బాధలోనూ సంతోషంలోనూ భాగం పంచుకున్నట్లు అనిపించేది. కానీ ఇప్పుడు నా కూతురు నన్ను వదిలి శాశ్వతంగా వెళ్లిపోతున్నట్లు అనిపిస్తుంది అంటాడు రామ్మూర్తి.

ఇంటికి వస్తారా

నీ కూతురికి అనుకోకుండా పెళ్లవడంతో నీకు పిచ్చెక్కినట్లుంది అంటుంది మంగళ. త్వరగా రెడీ అవ్వు.. మనం అమ్మాయిని, అబ్బాయిని ఇంటికి తీసుకురావాలి అంటాడు రామ్మూర్తి. ఆ ఇంటికి, ఈ ఇంటికి ఏమైనా పొంతన ఉందా? అసలు ఆయన ఇష్టం లేకుండా తాళి కట్టించుకుంది నీ కూతురు. ఆయన మనింటికి వస్తారా అంటుంది మంగళ.

మిస్సమ్మను పిలిచి అమర్​కి కాఫీ ఇచ్చావా అని అడుగుతుంది నిర్మల. లేదు, నీలతో పంపించా అంటుంది మిస్సమ్మ. రేపట్నుంచి నువ్వే ఇవ్వు అంటుంది నిర్మల. సరే ఆంటీ అంటుంది మిస్సమ్మ. ఆంటీ ఏంటమ్మా.. అత్తయ్యా అని పిలువు అంటుంది నిర్మల. అంతా మనోహరి చూస్తుందని తెలిసి ఏడిపించాలని అత్తయ్యా.. అని పిలుస్తుంది మిస్సమ్మ. అప్పుడే అమర్​ అక్కడికి రావడంతో భయంతో వణికిపోతుంది.

ఎదురు రమ్మని

అమర్​ ఆఫీస్​కి వెళ్తున్నానని బయలుదేరడంతో మిస్సమ్మను తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తుంది నిర్మల. అమర్​ జీపుకి ఎదురు రమ్మని మిస్సమ్మకి చెబుతుంది. అమర్​, పిల్లలకు మిస్సమ్మ ఎలా దగ్గరవుతుంది? మనోహరి ఆటకట్టించేందుకు భాగీ ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే మే 04న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!