Nindu Noorella Saavasam December 28th Episode: అమర్‌కు దొరికిపోయిన మనోహరి.. ఆరుంధతికి చిత్రగుప్తుడు వార్నింగ్-nindu noorella saavasam december 28th episode chitragupta warning to arundhati about ghora and manohari ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nindu Noorella Saavasam December 28th Episode: అమర్‌కు దొరికిపోయిన మనోహరి.. ఆరుంధతికి చిత్రగుప్తుడు వార్నింగ్

Nindu Noorella Saavasam December 28th Episode: అమర్‌కు దొరికిపోయిన మనోహరి.. ఆరుంధతికి చిత్రగుప్తుడు వార్నింగ్

Sanjiv Kumar HT Telugu
Dec 28, 2023 12:34 PM IST

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 28వ తేది ఎపిసోడ్‌లో లారీ డ్రైవర్ గురించి నోరు జారి అమర్ దగ్గర దొరికిపోతుంది మనోహరి. డ్రైవర్ గురించి నీకు ఎలా తెలుసు అని అమర్ నిలదీస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 28వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ డిసెంబర్ 28వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam 28th December Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో అమృత కూడా స్కూల్ లీడర్​ ఎలక్షన్లలో పోటీచేస్తుందని నిర్ణయిస్తుంది అంజలి. దానికి మీకు ఆపోజిట్‌గా ఎలక్షన్స్‌లో నిలబడ్డ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుతున్నాడు. అతనికి అందరి సపోర్టు ఉంది అంటుంది ప్రిన్సిపల్​. మీ సపోర్ట్ కూడా అతనికేనంట కదా. అతను మీ ఫ్రెండ్ కొడుకు అంట కదా అని వెటకారంగా మాట్లాడుతుంది అంజు.

ప్రిన్సిపాల్‌కు కౌంటర్

అన్ని తెలుసుకునే పోటీ చేస్తున్నారన్నమాట. రేపు ఎలక్షన్స్ లో ఓడిపోయి వాళ్లు మిమ్మల్ని ఏమైనా అంటే నాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వద్దు. నేను తీసుకోను అంటుంది ప్రిన్సిపల్​. అలాగే మేడం రేపొద్దున్న వాళ్లు ఓడిపోయి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకోకండి అని కౌంటర్ వేసి మేడమ్‌ని పక్కకు తప్పుకోమని తన వాళ్లని తీసుకొని అక్కడినుంచి వెళ్లిపోతుంది అంజు. దారిలో వాళ్లకి ఎలక్షన్స్‌లో ఆపోజిట్ గా పోటీ చేసే అబ్బాయి ఎదురుపడతాడు.

రెండు రోజుల్లో ఎలా మీరు అందరిని ఓట్లు వేయమని అడుగుతారు గెలుస్తామనేనా అని అడుగుతాడు. ఎందుకు గెలవం? ఇప్పటివరకు గెలుస్తాననే కాన్ఫిడెన్స్‌తో ఉన్న నువ్వు ఓడిపోతావనే భయంతోనే మా దగ్గరికి వచ్చావు కదా. అలాగే చూస్తూ ఉండు మేము గెలిచి తీరతాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంజు. మరోవైపు మనోహరి, ఘోరా మాట్లాడుకోవడం చూసి బాధగా ఇంటికి తిరిగి వస్తాడు చిత్రగుప్తుడు. కంగారుగా అతని దగ్గరికి వెళ్లి మిస్సమ్మ నన్ను నీలకి పరిచయం చేసింది. కానీ, నీలకు నేను కనిపించలేదు అనే విషయం మిస్సమ్మకి చెప్పలేదు. ఎందుకో అర్థం కావడం లేదు అని అడుగుతుంది అరుంధతి.

ప్రమాదం పొంచి ఉంది

నీకు ప్రమాదం పొంచి ఉంది. కూటములన్నీ ఒకటవుతున్నాయి. చేతులు జోడించే ప్రార్థిస్తున్నాను. ఈ లోకం నుంచి విడిచి వెళ్లిపోదాం పద అని అరుంధతిని గట్టిగా కోప్పడతాడు చిత్రగుప్తుడు. ఎందుకు ఈరోజు గుప్తా గారు ఇంత కోపంగా ఉన్నారు అని మనసులో అనుకొని నాకు ప్రమాదాన్ని తీసుకువచ్చేది ఎవరు. ఏం జరుగుతుంది అని అడుగుతుంది. అవి ఇవి నేను చెప్పలేను. కానీ, నీకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్తూ ఉండగానే మనోహరి ఇంట్లోకి రావడం గమనించిన చిత్రగుప్తుడు కామ్‌గా తన పని తాను చేసుకోవడం ప్రారంభిస్తాడు.

ఎందుకు గుప్తా గారు మనోహరి ని చూసి ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకుంటుంది అరుంధతి. ఇంతలో అమర్ వాళ్లు ఇంటికి వస్తారు. డ్రైవర్ ని పట్టుకోడానికి వెళ్లారు ఏం జరిగిందో చూసి వస్తాను అని అమర్ వాళ్లతో వెళ్తుంది అరుంధతి. డల్ గా సోఫాలో కూర్చున్న అమర్ కి మంచినీళ్లు ఇచ్చి ఎందుకో డల్ గా ఉన్నారు ఏమైంది అని అడుగుతుంది మిస్సమ్మ. ఆయనకి చాలా పనులు ఉంటాయి అన్ని నీకు చెప్పాలా.. పిల్లలు వచ్చే టైం అయింది వెళ్లి స్నాక్స్ ప్రిపేర్ చెయ్యు అని చెప్పి అక్కడినుంచి మిస్సమ్మని పంపించేస్తుంది మనోహరి.

నేనే చెప్పాను

తర్వాత డ్రైవర్ దొరికాడా అని అమర్ ని అడుగుతుంది. ఒక్కసారిగా షాకైన అమర్.. నేను డ్రైవర్ దగ్గరికి వెళ్తున్నట్టు నాకు రాథోడ్ కి తప్ప ఎవరికీ తెలియదు. నీకు ఎలా తెలుసు అని మనోహరిని నిలదీస్తాడు. అప్పుడు తను నోరు జారిన సంగతి గుర్తొచ్చి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటుంది మనోహరి. నేనే చెప్పాను అయ్యగారు. మీరు మాట్లాడుకోవడం విన్నాను మీరు కంగారుగా బయటకు వెళ్తుంటే ఏం జరుగుతుంది అని మనోహరి అమ్మగారు అడిగారు. అప్పుడు జరిగింది చెప్పాను అంటుంది నీల.

రాథోడ్ ఆమెని మందలించి పంపించేస్తాడు. తర్వాత మనోహరితో ఆ డ్రైవర్ తప్పించుకున్నాడు అని చెప్తాడు. తప్పించుకోలేదు తప్పించేశారు. మనం వెళ్తున్న విషయం వాడికి ఎవరో ఇన్ఫామ్ చేశారు. అందుకే నేను ఎవరో తెలియకుండానే నన్ను చూసి పరిగెట్టాడు అని చెప్తాడు అమర్​. ఎవరై ఉంటారో అంటాడు రాథోడ్. అరుంధతిని చంపమని చెప్పిన వాళ్లు అంటాడు. అమర్​ మాటలకి మనోహరీ ఉలిక్కిపడుతుంది. నిజంగానే హంతకుడికి డబ్బు ఇచ్చినప్పుడు అతనిని పారిపోమని హెచ్చరించడం గుర్తు చేసుకుంటుంది.

అమర్‌కు తెలిసిపోతుందా?

అంత కక్షకట్టి నన్ను చంపవలసిన అవసరం ఎవరికి ఉంది అనుకుంటుంది అరుంధతి. అరుంధతి హత్యకు కుట్ర చేసింది మనోహరి అని అమర్​కి తెలిసిపోతుందా? మిస్సమ్మను ఇంట్లో నుంచి పంపించేయడానికి మనోహరి ఏం చేయబోతుంది? అనే విషయాలు తెలియాలంటే డిసెంబర్​ 29న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

టీ20 వరల్డ్ కప్ 2024