NNS April 27th Episode: భార్యాభర్తలుగా ఇంట్లోకి అమర్ భాగీ.. మిస్సమ్మను భార్యగా ఒప్పుకోని అమర్.. పిల్లలకు మనోహరి మాయమాటలు-nindu noorella saavasam serial april 27th episode amar not accepting bhaagi as wife nindu noorella saavasam today episod ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns April 27th Episode: భార్యాభర్తలుగా ఇంట్లోకి అమర్ భాగీ.. మిస్సమ్మను భార్యగా ఒప్పుకోని అమర్.. పిల్లలకు మనోహరి మాయమాటలు

NNS April 27th Episode: భార్యాభర్తలుగా ఇంట్లోకి అమర్ భాగీ.. మిస్సమ్మను భార్యగా ఒప్పుకోని అమర్.. పిల్లలకు మనోహరి మాయమాటలు

Sanjiv Kumar HT Telugu
Apr 27, 2024 10:15 AM IST

Nindu Noorella Saavasam April 27th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 27వ తేది ఎపిసోడ్‌‌లో భార్యాభర్తలు సాయంత్రంలోపు ఇంటికి రావాలని పంతులు చెబుతాడు. దాంతో వాళ్లను ఒప్పించేందుకు నిర్మల, శివరాం ప్రయత్నిస్తారు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 27వ తేది ఎపిసోడ్‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏప్రిల్ 27వ తేది ఎపిసోడ్‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 27th April Episode) అమర్​, భాగీల పెళ్లి దైవ నిర్ణయం అని, నూతన దంపతులు రాత్రిలోపు ఇంట్లో కలిసి అడుగుపెట్టాలని చెబుతాడు పంతులు. అసలు మిస్సమ్మని ఇంటిదాకా రాణిస్తాడో లేదో ఇంట్లో దీపం ఎలా పెడతారు అండి అని నిర్మల అంటుంది. ఇంకా అమర్ ఇంటికి కూడా రాలేదు అంటాడు శివరామ్.

భాగమతి దగ్గరికి వెళ్తాను

జరిగిందేదో జరిగిపోయింది వాళ్లిద్దరికీ నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటూ పంతులుగారు వెళ్లిపోతారు. ఇదేంటండి పంతులుగారు ఏదో ఒక పరిష్కారం చెప్తారు అనుకుంటే కీడు అని భయపెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది నిర్మల. ఏముంది సాయంత్రంలోగా వాళ్లిద్దరిని ఒప్పించి ఇక్కడికి తీసుకురావడమే మంచి పని. నేను భాగమతి దగ్గరికి వెళ్తాను నువ్వు అమర్ దగ్గరికి వెళ్లి నచ్చజెప్పి తీసుకురా అని శివరామ్ వెళ్లిపోతాడు.

అమరేంద్ర ఎక్కడున్నాడో రాథోడ్‌కి ఫోన్ చేసి కనుక్కోవాలి అనుకుంటుంది నిర్మల. చూసావా నువ్వు చేసిన పనికి ఆ పెద్ద వాళ్లిద్దరూ ఎంత తిప్పలు పడుతున్నారో అని అరుంధతితో అంటాడు గుప్త. డాక్టర్ గారు అమ్మాయి స్పృహలోకి వచ్చిందా అని అడుగుతారు. వచ్చింది వెళ్లి చూడండి అని డాక్టర్ గారు చెప్పడంతో ముగ్గురు లోపలికి వెళ్తారు. భాగమతి కళ్లు మూసుకొని ఒక చెయ్యి తెరచి తాళిబొట్టును చూసుకుంటుంది. ఏ భాగీ ఈ సారి స్పృహ లేకుండా పడిపోతే మాత్రం బాగోదు ఎన్నిసార్లు పడిపోతావే అని మంగళ అంటుంది.

పెళ్లి ఆపుతానని

చూసుకున్నావా తాళిబొట్టు. అది నీ మెడలోకి ఎలా వచ్చింది అంటుంది కరుణ. ఇంటి దగ్గర ఉన్న నన్ను హాస్పిటల్‌లో పడేసి తాళిబొట్టుతో చూపించి ఎలా వచ్చిందని అడుగుతున్నారా అని అడుగుతుంది భాగమతి. నీకు మత్తుమందు ఇచ్చి నీ పెళ్లి చేసి బెడ్ మీద పడుకోబెట్టమనుకుంటున్నావా నువ్వే కావాలని పెళ్లి ఆపుతానని వెళ్లి తాళికట్టించుకున్నావు అంటుంది మంగళ. నిజంగా దీనికి పిచ్చి పట్టింది అంకుల్ అంటుంది కరుణ.

నాకు కాదే పిచ్చి పట్టింది మీకే పిచ్చి పట్టింది అంటుంది భాగమతి. అసలేం జరిగిందో చెప్తాను విను అని కరుణ జరిగిన విషయంఅంతా చెబుతుంది. నాకు తెలియకుండా ఇదంతా జరిగిందా అనుకుంటుంది భాగీ. మనోహరి పెళ్లి చూడ్డానికి వెళ్లి మనోహరిని సైడ్ చేసి అమర్‌తో పెళ్లి చేసుకుని ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా భలే నటిస్తున్నావే అని అనుకుంటుంది మంగళ. భాగీ నీకెందుకు గుర్తులేదు ఏమో నాకు తెలియదు కానీ నిజంగానే అమరేంద్రతో నీకు పెళ్లి జరిగింది అంటాడు రామ్మూర్తి.

పెళ్లి చేసుకోవడం గుర్తు లేదు

ముగ్గురు ఆలోచిస్తూ ఉండగా భాగమతి బెడ్ మీద నుంచి మాయమైపోతుంది. పెళ్లిలో జరిగిదంతా భాగీకి చెబుతుంది కరుణ. ఏం జరుగుతుందోనన్న భయంతో మంచం వెనుక దాక్కుటుంది భాగీ. మనోహరి ఇంట్లో కూర్చోవడం, పెళ్లి చేసుకోవడం తనకు గుర్తు లేదని భాగీ అందరికీ చెబుతుంది. అమర్ తండ్రి ఆసుపత్రికి వెళ్లి భాగీని కలుస్తాడు. అమర్ తన తల్లికి, రాథోడ్‌కు ఈ పెళ్లికి ఒప్పుకోనని చెబుతాడు. భాగీ తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని, ఆమెను తన భార్యగా అంగీకరించడానికి నిరాకరిస్తాడు.

అమర్ తండ్రి భాగీని ఇంటికి వచ్చి వివాహ అనంతర పనులు పూర్తి చేయమని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. మంగళ మనోహరికి ఫోన్ చేసి అమర్ తండ్రి హాస్పిటల్ లో ఉన్నాడని చెబుతుంది. మనోహరి భాగిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె పిల్లల గదికి వెళ్తుంది. అంతా తమ ప్లాన్ ప్రకారమే జరిగితే ఎందుకు కలత చెందుతున్నారని ఆమె వారిని అడుగుతుంది. ఆమె కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేసిందా అని అడుగుతుంది.

పిల్లలు నమ్ముతారా?

వారు సహనం కోల్పోతారు. మిస్సమ్మ అమర్​ని వివాహం చేసుకోవడం తప్పు అని మనోహరి చెబుతుంది. భాగీ వారిని అమర్ నుండి దూరం చేస్తుందని వారందరూ ఆరుని మరచిపోయేలా చేస్తుందని వారిని భయపెడుతుంది. ఈ కారణంగానే మనోహరికి వ్యతిరేకంగా భాగీ వారిని నడిపించిందని అంటుంది. మనోహరి మాటలను పిల్లలు నమ్ముతారా? అమర్​ భాగీని తన భార్యగా అంగీకరిస్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 29న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner