Karthika deepam 2 serial: వావ్ సూపర్ సీన్.. వంటలక్క వన్ ఉమెన్ షో, నరసింహ మెడమీద కత్తిపీట పెట్టి వార్నింగ్-karthika deepam 2 serial today june 5th episode deepa confronts narsimha and warns him not to interfere in her life ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: వావ్ సూపర్ సీన్.. వంటలక్క వన్ ఉమెన్ షో, నరసింహ మెడమీద కత్తిపీట పెట్టి వార్నింగ్

Karthika deepam 2 serial: వావ్ సూపర్ సీన్.. వంటలక్క వన్ ఉమెన్ షో, నరసింహ మెడమీద కత్తిపీట పెట్టి వార్నింగ్

Gunti Soundarya HT Telugu
Jun 05, 2024 07:46 AM IST

Karthika deepam 2 serial today june 5th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్య జోలికి వస్తానని నరసింహ చెప్పేసరికి దీప ఆవేశంగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఒక్క దెబ్బతో ముగ్గురికి వణుకుపుట్టేలా చేస్తుంది.

కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 5వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 5వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial today june 5th episode: కార్తీక్ చేసిన పనికి జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. దీపకు శౌర్య దొరికింది, కానీ నాకే బావ దొరకడం లేదు. అన్నింటికీ ఒక్కటే కారణం దీప అని ఆవేశపడుతుంది. నువ్వు ఇలా మాట్లాడటానికి ఎవరు కారణమో నాకు అర్థం అవుతుంది, ఎవరు చెప్పేది నువ్వు నమ్మొద్దు నీ మనసు చెప్పేది నమ్మమని సర్ది చెప్పడానికి చూస్తుంది సుమిత్ర.

పారిజాతానికి సుమిత్ర వార్నింగ్

మనకు కావాల్సిన వాళ్ళకు ఇంకెవరో దగ్గర అయితే భరించలేమని జ్యోత్స్న బాధగా వెళ్ళిపోతుంది. నా కూతురు జీవితాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని పారిజాతాన్ని సుమిత్ర నిలదీస్తుంది. లేని పోనీ విషయాలు చెప్పి ఎందుకు మనసు పాడు చేస్తున్నారని అడుగుతుంది.

ఆ పని చేస్తుంది నేను కాదు దీప. దాన్ని నువ్వు నెత్తిన పెట్టుకున్నావ్ చూస్తూ ఉండు ఏదో ఒక రోజు నీ కూతురు జీవితంలో సంతోషం లేకుండా పోతుందని పారిజాతం అంటుంది. నా కూతురు జీవితంలో సంతోషం పోకుండా ఎలా చూసుకోవాలో నాకు తెలుసు మీరు దానికి దూరంగా ఉండండి అని సుమిత్ర పారిజాతానికి వార్నింగ్ ఇస్తుంది.

దీప, కార్తీక్ మధ్య మనకు తెలిసింది కాకుండా ఇంకేదో సంబంధం ఉంది. నరసింహతో మాట్లాడితే ఏమైనా తెలుస్తుందని పారిజాతం ఫిక్స్ అవుతుంది. అనసూయ నరసింహ చేసిన పనిని తిడుతుంది. ఆయన తలతిక్క పని ఏం చేయలేదు మంచి పని చేశాడు.

గేట్లు తన్నుకుని వచ్చిన దీప

ఈ దెబ్బతో అది ఊరు వదిలి పారిపోతుందని శోభ అంటుంది. అప్పుడే దీప కోపంగా గేటు తన్నుకుని లోపలికి వస్తుంది. శోభ దీపని చూసి షాక్ అవుతుంది. కోపంగా దీపకు ఎదురు వెళ్ళి గుమ్మం దగ్గర ఆపుతుంది. ఒకసారి చెప్తే బుద్ధి లేదా నీకు మళ్ళీ ఎందుకు వచ్చావని శోభ నిలదీస్తుంది.

దీప కోపంగా శోభ చెంప చెల్లుమనిపిస్తుంది. దెబ్బకు పోయి నరసింహ మీద పడుతుంది. ఎంత ధైర్యం కాకపోతే నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా అనేసరికి మరొకటి పీకుతుంది. నీ నోట్లో నుంచి ఇంకొక మాట బయటకు వస్తే నువ్వు బయట పడతావని దీప వార్నింగ్ ఇస్తుంది.

నరసింహ ఆవేశంగా దీప దగ్గరకు వెళ్ళి ఏయ్ ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా అంటాడు. దీప అంతే ఆవేశంగా సరిపోలేదురా అని ఒక్క తోపు తోసేసేసరికి కిందపడిపోతాడు. పక్కనే ఉన్న కత్తిపీట తీసుకొచ్చి నరసింహ మెడ మీద పెడుతుంది. ఇప్పుడు మాట్లాడరా అంటుంది.

నీ గొంతు మీద కత్తి పెడతా

నా కొడుకు గొంతు మీద కత్తిపీట పెడతావా అని అనసూయ అంటుంది. అడ్డు వస్తే నీ గొంతు మీద కూడా పెడతానని దీప వార్నింగ్ ఇస్తుంది. నేను మీకులా మాట తప్పే మనిషిని కాదు అడ్డు వస్తే మీకు గొంతు మీద కత్తి పెడతాను. ఏంటి అన్నావ్ నన్ను ఏడిపించడానికి సరదాగా చేసిన ఆట ఇదా?

చెప్పిన మాట వినకపోతే ఇక నా కూతురు ఇంటికి రాదా? నువ్వు అలా అనగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద వాలి నన్ను నా కూతురిని వదిలేయ్ అని అడుగుతానని అనుకున్నావా? నా జీవితాన్ని నాశనం చేశావ్ భరించావు. అందరిలో నన్ను సంస్కారం లేని దానిగా నిలబెట్టావు సహించాను.

నేను కూతురి కోసం బతుకుతున్నాను. నిన్ను సాయం అడిగానా? లేదంటే మాకోక దారి చూపించమని వేడుకున్నానా? మా బతుకు ఏదో మమ్మల్ని బతకనివ్వమని వేడుకున్నాను. అయినా వదలకుండా వెంట పడతాను, వేధిస్తాను. నీ కూతురిని దూరం చేస్తానని నోటికొచ్చినట్టు మాట్లాడితే సమాధానం ఫోన్లో కాదు గేట్లు తన్నుకుంటూ వస్తుంది.

నా బిడ్డ జోలికి వస్తే పీక కోస్తా

తిట్టినా భరిస్తుంది కొట్టినా భరిస్తుంది కూతురు జోలికి వెళ్ళినా ఇలాగే ఉంటుందని అనుకోకు. నా బిడ్డ జోలికి వస్తే పీక కోస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. దీప దెబ్బకు ముగ్గురు హడలిపోతారు. ఇది మాత్రం సూపర్ సీన్. మీ ముగ్గురికి చెప్తున్నా నా బిడ్డ జోలికి వస్తే ప్రాణాలతో మిగలరు అనేసరికి అనసూయ వణికిపోతుంది.

దీప అనసూయ వైపు వస్తుంటే నన్ను ఏం చేయవద్దు దీప నీ జోలికి వెళ్లొద్దని వాడికి చెప్తూనే ఉన్నానని వణుకుతూ చెప్తుంది. ఇక రాడులే నేను చెప్పాను కదా. నువ్వు ఆరోజు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లేటప్పుడు ఒక మాట అన్నావ్ కదా అత్తయ్య. తర్వాత నీడలాగా ఆ మాట నన్ను వెంటాడుతూనే ఉంది.

మా నాన్న ఏం పొరపాటు చేశాడు. నువ్వు ఎందుకు ఆ మాట అన్నావని దీప అడుగుతుంది. అలా అన్నావ్ అంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏంటి ఆ కారణమని నిలదీస్తుంది. అనసూయ గతంలో జరిగిన విషయం గుర్తు చేసుకుంటుంది.

ప్రతిసారి కత్తిపీట పెట్టలేను

నా తమ్ముడి మీద ఒట్టు వేశాను చచ్చినా ఈ నిజం ఎవరికీ చెప్పకూడదని అనసూయ అనుకుంటుంది. ఆ మాట ఎందుకు అన్నావని దీప గట్టిగా అడిగేసరికి ఊరికే కోపంలో అన్నానని అంటుంది. వదిలేసుకున్న మనిషి మీద కోపం ఎందుకు మీరు వదిలేసుకోండి. లేదంటే ప్రతిసారి నేను వచ్చి కత్తిపీట తీయలేనని చెప్తుంది.

శోభని రమ్మని పిలిస్తే భయపడిపోతుంది. దీప కత్తిపీట తన చేతిలో పెడుతుంది. మీ ముగ్గురికి మళ్ళీ చెప్తున్నా నా కూతురు జోలికి రావొద్దు నేను మాట తప్పను కత్తిపీటతోనే సమాధానం చెప్తానని సూపర్ గా చెప్పేసి వెళ్ళిపోతుంది. దీప వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

శోభ మాత్రం రగిలిపోతుంది. కాంచన కోపంగా ఉంటుంది. శ్రీధర్ వచ్చి జ్యూస్ తాగాలని చెప్పాను కదా అంటాడు. మీరు అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారని నిలదీస్తుంది. ఇప్పుడే ఫోన్ మాట్లాడాను వదిన మాట్లాడింది. కార్తీక్ జ్యోత్స్నని తీసుకుని బయటకు వెళ్లాడని చెప్పారు కానీ కోడలు ఇంట్లోనే ఉందని వదిన చెప్పిందని అంటుంది.

దీపకు విడాకులు ఇప్పించండి

మళ్ళీ కార్తీక్ కి ఫోన్ చేస్తే శౌర్య ఒక్కతే ఉందంట దీప వచ్చే వరకు తోడుగా ఉన్నానని చెప్పాడని అంటుంది. ఇప్పటికే దీప భర్త కార్తీక్ గురించి ఎలాంటి నింద వేశాడో తెలుసు కదా. ఇప్పుడు ఇలా ఉంటే ఏమనుకుంటారో బయట మనిషిగా ఆలోచించు దీంట్లో ఎంత పెద్ద తప్పో అర్థం అవుతుందని శ్రీధర్ అంటాడు.

అయితే మీరు ఒక పని చేయండి దీపకు వాళ్ళ ఆయనకు విడాకులు ఇప్పించండి. అప్పుడు వాడు దీప జోలికి రాడు. అప్పుడు దీప తన కూతురిని తీసుకుని ఇంకెక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకుతుందని చెప్తుంది. రెండో పెళ్లి చేసుకున్న వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని కాంచన నిలదీస్తుంది.

అలాంటి భర్తను క్షమించను

నేను దీప భర్తనే కాదు భార్యని మోసం చేసిన ఏ భర్తని క్షమించను. ఏ జన్మలోనో పాపం చేసుకుంటే తప్ప అలాంటి పాపాత్ములు భర్తగా రారు. అందరూ మీలా ఉండరని మొగుడిని మళ్ళీ మెచ్చుకుంటుంది. దీపకు మనకు చేతనైన సహాయం చేద్దామని శ్రీధర్ అనేసరికి కాంచన సంతోషపడుతుంది.

ఇంతకీ నా కొడుక్కి ఆ పాప అంటే ఎందుకు అంత ఇష్టమని శ్రీధర్ ఆలోచనలో పడతాడు. కార్తీక్ శౌర్యని బయటకు తీసుకెళ్ళి ఇంటికి తీసుకొస్తాడు. నేనంటే నీకు ఎంత ఇష్టం కార్తీక్ అని శౌర్య ముద్దుగా అంటుంది.

అప్పుడే దీప ఇంటికి వస్తుంది. రావడం లేట్ అయితే ఇలాగే నిలబడి ఎదురు చూస్తూ ఉంటారా? మధ్యాహ్నం ఎప్పుడో తిన్నది దానికి ఆకలేస్తుందని పట్టించుకోవద్దా అని దీప కార్తీక్ మీద సీరియస్ అవుతుంది.

నేను తినేశానని శౌర్య చెప్తుంది. ఏం తిన్నావని అడిగితే పిజ్జా అంటుంది. ఎవరు పెట్టారు అమ్మమ్మనా అంటే లేదు కార్తీక్ తినిపించాడని చెప్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024