Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. అద్భుతంగా పాట పాడిన దీప, భర్త అంటే మీలా ఉండాలని తండ్రిని మెచ్చుకున్న కార్తీక్-karthika deepam 2 serial today may 31st episode karthik is mesmerised by deepa beautiful singing ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. అద్భుతంగా పాట పాడిన దీప, భర్త అంటే మీలా ఉండాలని తండ్రిని మెచ్చుకున్న కార్తీక్

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. అద్భుతంగా పాట పాడిన దీప, భర్త అంటే మీలా ఉండాలని తండ్రిని మెచ్చుకున్న కార్తీక్

Gunti Soundarya HT Telugu
May 31, 2024 07:20 AM IST

Karthika deepam 2 serial today may 31st episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. స్కూల్ లో పాటల పోటీకి పేరు ఇచ్చానని పాట నేర్పించమని శౌర్య అడుగుతుంది. దీంతో దీప పాట పాడుతుంది. అది కార్తీక్ విని దీప గొంతు చాలా బాగుందని అనుకుంటాడు.

కార్తీకదీపం 2 సీరియల్ మే 31వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ మే 31వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today may 31st episode: శ్రీధర్ కావేరీతో ఫోన్ మాట్లాడుతూ కార్తీక్ రావడంతో కాల్ కట్ చేస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావ్ అని ఫోన్ తీసుకునేసరికి శ్రీధర్ టెన్షన్ పడతాడు. నువ్వు మాట్లాడిన నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడతానని కాసేపు ఆట పట్టిస్తాడు.

నిజం తెలియకూడదు 

బిఫోర్ మ్యారేజ్ నీ లైఫ్ లో ఎటువంటి లవ్ ట్రాక్ లేదా అని కార్తీక్ అడుగుతాడు. ఉందని చెప్తాడు. కాంచన అని నీకు వరుసకు అమ్మ అవుతుందని చెప్పి తప్పించుకుంటాడు. అమ్మకి ఫోన్ చేసి భోజనం చేసిందేమో కనుక్కోమని అంటాడు.

భర్త అంటే మీలా ఉండాలి. నేను ఇంతవరకు మీ అంత మంచి భర్తని చూడలేదు. నేను కూడా నా భార్య మీద ఇలాంటి ప్రేమ చూపించలేను ఏమోనని తండ్రిని మెచ్చుకుంటాడు. నేను చేసిన తప్పు తెలిస్తే లైఫ్ లో నాలాంటి భర్తను చూడలేదని అనుకుంటావ్ ఎప్పటికీ నీకు నిజం తెలియకూడదని శ్రీధర్ అనుకుంటాడు.

కూతురి ప్రేమకు మురిసిన దీప 

దీప శౌర్యకు ప్రేమగా అన్నం తినిపిస్తుంది. తాతయ్య కూడా ఇలాగే నీకు బువ్వ తినిపించాడా? అని అడుగుతుంది. అవును చాలా ప్రేమ చూపించేవాడని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తాతయ్య లేకపోతే ఏమి నేను నిన్ను తాతయ్యలాగా చూసుకుంటానని చెప్పి తల్లికి అన్నం తినిపిస్తుంది.

కూతురి ప్రేమకు మురిసిపోతుంది. స్కూల్ లో ఆటలు, పాటల పోటీలు పెడుతున్నారంట మా మిస్ చెప్పింది అంటే ఆటల పోటీకి పేరు ఇచ్చావా అంటే లేదు ఈ బుజ్జి బొజ్జతో పరిగెత్తలేను కదా అంటుంది. పాటల పోటీకి పేరు ఇచ్చానని పాట నేర్పించమని అడుగుతుంది.

నువ్వు వంట చేసేటప్పుడు పాడే పాట నేర్పించు. అది పాడితే నేను పోటీలో గెలుస్తానని శౌర్య తల్లిని బతిమలాడుతుంది. కొత్త పుస్తకాల మీద పేరు రాయమని దీపని అడుగుతుంది. రైటింగ్ బాగుండని శౌర్య మెచ్చుకుంటుంది. గుండ్రంగా రాసే వాళ్ళకు మంచి మనసు ఉంటుందని దీప అంటుంది.

పాట పాడిన దీప 

అయితే కార్తీక్ కి మంచి మనసు ఉంది. స్కూల్ అప్లికేషన్ రాసేటప్పుడు చూశానని చెప్తుంది. దీంతో దీప నరసింహ పాప తండ్రి కార్తీక్ అన్న విషయం తలుచుకుని కోపంగా ఉంటుంది. శౌర్య ఏమైందని అడిగితే ఏం లేదని మాట దాటేస్తుంది. ఇక స్కూల్ లో పాట పాడేందుకు పాట నేర్పించమని అడుగుతుంది.

దీప పాట పాడే టైమ్ కి కార్తీక్ వస్తాడు. దీప పాటలు కూడా పాడుతుందా అని తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. గొంతు చాలా బాగుంది సందర్భం వచ్చినప్పుడు తనని మెచ్చుకోవాలని అనుకుంటాడు. జ్యోత్స్న తన అత్త కాంచన దగ్గర కూర్చుని సరదాగా మాట్లాడుతుంది.

రహస్యం బయటపడుతుందని 

కాంచన ఆవకాయ పచ్చడి పెట్టాలని సుమిత్రను అడుగుతుంది. దీపను పిలిపించి పచ్చడి పెట్టమని అడుగుతుంది. తనని చూసి జ్యోత్స్న అసహ్యించుకుంటుంది. ఎవరిని ఎలా బుట్టలో పడేయాలో నీకు బాగా తెలుసు దీప అని జ్యోత్స్న తిట్టుకుంటుంది.

కార్తీక్ తల్లిని ఇంటికి వెళ్దామని అడుగుతాడు. బావ నిన్న ఎందుకు అలా ఉన్నాడు. వచ్చేటప్పుడు బాగానే ఉన్నాడు కానీ తర్వాత బాగా టెన్షన్ పడ్డాడు. ఏమైందని దశరథ కార్తీక్ ని అడుగుతాడు. ఆయన వెళ్ళిపోయింది నా గురించి రెండో భార్య గురించి ఎక్కడ చెప్తానోనని వెళ్లిపోయారని దీప అనుకుంటుంది.

ఇక్కడే ఉంటే ఆయన రహస్యం ఎక్కడ బయట పడిపోతుందోనని వెళ్లిపోయారని కార్తీక్ సరదాగా అంటాడు. దీంతో దీప వెంటనే తన వైపు చూస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024