Bathukamma Songs Lyrics: బతుకమ్మ టాప్ 5 పాటలు ఇవే.. లిరిక్స్ చూసేయండి..-telangana floral festival bathukamma top 5 songs list with lyrics in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bathukamma Songs Lyrics: బతుకమ్మ టాప్ 5 పాటలు ఇవే.. లిరిక్స్ చూసేయండి..

Bathukamma Songs Lyrics: బతుకమ్మ టాప్ 5 పాటలు ఇవే.. లిరిక్స్ చూసేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 22, 2023 04:11 PM IST

Bathukamma Songs Lyrics in telugu : బతుకమ్మ అంటే అందరికీ గుర్తొచ్చేవి.. బతుకమ్మ పాటలు. ఈ సమయంలో పువ్వులకు ఎంత డిమాండ్ ఉంటుందో. పాటలకు అంతే డిమాండ్ ఉంటుంది. బతుకమ్మ పాటలతో వీధులన్నీ మార్మోమోగుతుంటాయి.

<p>బతుకమ్మ పాటలు</p>
<p>బతుకమ్మ పాటలు</p>

Bathukamma Songs Lyrics : బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ. ఈ పండుగలో ప్రధానంగా పువ్వులను పూజిస్తారు. ప్రతి మహిళా అందంగా ముస్తాబై.. పువ్వులతో బతుకమ్మను పేర్చి.. వాటికి పూజలు చేసి.. గుడికి తీసుకెళ్తారు. అక్కడ ఆరుబయట బతుకమ్మల చుట్టూ చేరి.. బతుకమ్మల పాటలు పాడుకుంటూ.. ఆనందంగా నాట్యం చేస్తారు. అందుకే బతుకమ్మ పాటలకు డిమాండ్ ఎక్కువ. అయితే మీకు బతుకమ్మ పాటలు లిరిక్స్ రాకపోతే ఇక్కడ మీకోసం టాప్ 5 సాంగ్స్ లిరిక్స్ ఉన్నాయి. వాటిని నేర్చేసుకోండి.

1. ఏమిమి పువ్వోప్పునే గౌరమ్మ

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే

తంగేడు పువ్వోప్పునే గౌరమ్మ తంగేడు కాయెుప్పునే

తంగేడు పువ్వులో తంగేడు కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (1)

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే

తెలుగంటి పువ్వోప్పునే గౌరమ్మ తెలుగంటి కాయెుప్పునే

తెలుగంటి పువ్వులో తెలుగంటి కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (2)

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే

ఉమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయెుప్పునే

ఉమ్మెత్త పువ్వులో ఉమ్మెత్త కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (3)

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే

జిల్లేడు పువ్వోప్పునే గౌరమ్మ జిల్లేడు కాయెుప్పునే

జిల్లేడు పువ్వులో జిల్లేడు కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (4)

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే

మందార పువ్వోప్పునే గౌరమ్మ మందార కాయెుప్పునే

మందార పువ్వులో మందార కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (5)

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే

గుమ్మడి పువ్వోప్పునే గౌరమ్మ గుమ్మడి కాయెుప్పునే

గుమ్మడి పువ్వులో గుమ్మడి కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (5)

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే

గన్నేరు పువ్వోప్పునే గౌరమ్మ.. గన్నేరు కాయెుప్పునే

గన్నేరు పువ్వులో గన్నేరు కాయలో

ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు

కలికి చిలుకలు రెండు కందువా మేడలో (6)

బతుకమ్మ వచ్చిందంటే చాలు.. ఈ పాట ప్రతి వీధిలోనూ మారుమోగుతూనే ఉంటుంది.

2. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (1)

రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే

రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (2)

వెండి బింద తీసుక వెలది నీళ్లకు వోతే

వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (3)

బంగారు బింద తీసుక బామ్మా నీళ్లకు వోతే

భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (4)

పగిడి బింద తీసుక పడతి నీళ్లకు వోతే

పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (5)

ముత్యాల బింద తీసుక ముదిత నీళ్లకు వోతే

ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన (6)

3. రామ రామ ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో

రామ రామ రామ ఉయ్యాలో

రామనే శ్రీరామ ఉయ్యాలో

హరి హరి ఓ రామ ఉయ్యాలో

హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో (1)

నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో

నెలవన్నెకాడ ఉయ్యాలో

పాపట్ల చంద్రుడా ఉయ్యాలో

బాల కోమారుడా ఉయ్యాలో (2)

ముందుగా నిను దల్తు ఉయ్యాలో

ముక్కోటి పోశవ్వ ఉయ్యాలో

అటెన్క నినుదల్తు ఉయ్యాలో

అమ్మ పార్వతమ్మ ఉయ్యాలో (3)

భక్తితో నిను దల్తు ఉయ్యాలో

బాసర సరస్వతీ ఉయ్యాలో

ఘనంగాను కొల్తు ఉయ్యాలో

గణపతయ్య నిన్ను ఉయ్యాలో (4)

ధర్మపురి నరసింహ ఉయ్యాలో

దయతోడ మముజూడు ఉయ్యాలో

కాళేశ్వరం శివ ఉయ్యాలో

కరుణతోడ జూడు ఉయ్యాలో (5)

సమ్మక్క సారక్క ఉయ్యాలో

సక్కంగ మముజూడు ఉయ్యాలో

భద్రాద్రి రామన్న ఉయ్యాలో

భవిత మనకు జెప్పు ఉయ్యాలో (6)

యాదితో నినుదల్తు ఉయ్యాలో

యాదగిరి నర్సన్న ఉయ్యాలో

కోటిలింగాలకు ఉయ్యాలో

కోటి దండాలురా ఉయ్యాలో (7)

కోర్కెతో నిను దల్తు ఉయ్యాలో

కొంరెల్లి మల్లన్న ఉయ్యాలో

కొండగట్టంజన్న ఉయ్యాలో

కోటి దండాలురా ఉయ్యాలో (8)

కోర్కెమీర దల్తు ఉయ్యాలో

కొత్తకొండీరన్న ఉయ్యాలో

ఎరుకతో నిను దల్తు ఉయ్యాలో

ఎములాడ రాజన్న ఉయ్యాలో (9)

ఓర్పుతో నిను దల్తు ఉయ్యాలో

ఓదెలా మల్లన్న ఉయ్యాలో

ఐలోని మల్లన్న ఉయ్యాలో

ఐకమత్య మియ్యి ఉయ్యాలో (10)

మన తల్లి బతుకమ్మ ఉయ్యాలో

మన మేలుకోరు ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బంగారు బతుకమ్మ ఉయ్యాలో (11)

4. శుక్రవారమునాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో

శుక్రవారమునాడు ఉయ్యాలో

చన్నీటి జలకాలు ఉయ్యాలో

ముత్యమంత పసుపు ఉయ్యాలో

పగడమంత పసుపు ఉయ్యాలో

చింతాకుపట్టుచీర ఉయ్యాలో

మైదాకు పట్టుచీరు ఉయ్యాలో

పచ్చపట్టుచీరు ఉయ్యాలో

ఎర్రపట్టుచీర ఉయ్యాలో

కురుసబొమ్మల నడుమ ఉయ్యాలో

భారీ బొమ్మల నడుమ ఉయ్యాలో

గోరంట పువ్వుల ఉయ్యాలో

బీరాయిపువ్వుల ఉయ్యాలో

రావెరావె గౌరమ్మ ఉయ్యాలో

లేచెనే గౌరమ్మ ఉయ్యాలో

అడెనే గౌరమ్మ ఉయ్యాలో

ముఖమంత పూసింది ఉయ్యాలో

పాదమంత పూసింది ఉయ్యాలో

చింగులు మెరియంగ ఉయ్యాలో

మడిమల్లు మెరియంగ ఉయ్యాలో

పక్కలు మెరియంగ ఉయ్యాలో

ఎముకలు మెరియంగ ఉయ్యాలో

కుంకుమబొట్టు ఉయ్యాలో

బంగారు బొట్టు ఉయ్యాలో

కొడుకు నెత్తుకోని ఉయ్యాలో

బిడ్డ నెత్తుకోని ఉయ్యాలో

మా యింటి దనుక ఉయ్యాలో

5. ఒక్కేసి పువ్వేసి చందమామ రాశికలుపుదాం రావె చందమామ

ఒక్కేసి పువ్వేసి చందమామ

రాశికలుపుదాం రావె చందమామ

నీరాశి కలుపుల్లు మేం కొలువమమ్మ

నీనోము నీకిత్తునే గౌరమ్మ

అదిచూసిమాయన్న గౌరమ్మ

ఏడుమేడల మీద పల్లెకోటల మీద

దొంగలెవరో దోచిరీ గౌరమ్మ

దొంగతో దొరలందరూ గౌరమ్మ

రెండేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ

మూడేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ

రాశిపడబోసి చందమామ

రత్నాలగౌరు చందమామ

తీగెతీగెల బిందె రాగితీగెల బిందె

నానోమునాకీయవే గౌరమ్మ

ఏడుమేడలెక్కిరి గౌరమ్మ

పల్లకోటల మీద పత్రీలు కోయంగ

బంగారు గుండ్లుపేరు గౌరమ్మ

బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ

బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ

బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ

ఈ పాటలన్నీ బతుకమ్మ సమయంలో ప్లే అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ పాటలు పాడుతూ.. బతుకమ్మను సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం