ముద్దపప్పు -ఆవకాయే కాదు.. పప్పు ధాన్యాలతో వండే ఈ టేస్టీ వెరైటీలు రుచి చూశారా?-the most popular vegetarian recipes of 2021 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ముద్దపప్పు -ఆవకాయే కాదు.. పప్పు ధాన్యాలతో వండే ఈ టేస్టీ వెరైటీలు రుచి చూశారా?

ముద్దపప్పు -ఆవకాయే కాదు.. పప్పు ధాన్యాలతో వండే ఈ టేస్టీ వెరైటీలు రుచి చూశారా?

Rekulapally Saichand HT Telugu
Feb 28, 2022 04:29 PM IST

ఆహార ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను ఆస్వాదించాలనే ఆశ ఉంటుంది. పప్పు ధాన్యాలతో దాబా స్టైల్లో వండే ఈ వంటకాలను రుచి చూడండి. అదిరిపోతుంది, నాన్-వెజ్ ఇష్టపడే వారు కూడా వీటి రుచికి ఫిదా అవుతారు.

<p>శాఖాహార వంటకం</p>
<p>శాఖాహార వంటకం</p>

ఆహార ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను ఆస్వాదించాలనే ఆశ ఉంటుంది. నోరూరించే రుచుల కోసం ఎంతదూరమైనా వెళ్లిపోతారు. నచ్చిన ఫుడ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ వేసి తెప్పించుకుని, లొట్టలేసుకుంటూ తింటారు. నాన్-వెజిటేరయన్లకైతే బోలెడు ఆప్షన్‌లు ఉన్నాయి, మరి శాఖాహారులైతే? ఎప్పుడూ అవే చప్పిడి వంటకాలు తిని సరిపెట్టుకోవాలా? అవసరమే లేదు. పప్పు ధాన్యాలతో దాబా స్టైల్లో చేసే ఈ వంటకాలను రుచి అదిరిపోతుంది, నాన్-వెజ్ ఇష్టపడే వారు కూడా వీటి రుచికి ఫిదా అవుతారు. ముద్దపప్పు- ఆవకాయ మీ ఫేవరేట్ అయితే పుప్పుతో వండే ఈ నార్త్ ఇండియన్ రుచులను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.

1. చనా మసాలా

చాలా మంది శాఖాహార ప్రియులకు నచ్చే ఇష్టమైన వంటకం చనా మసాలా.  దీన్ని తెల్ల శనగలు, టొమాటోలు, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు, మసాలాలు వేసి తయారు చేస్తారు. ఈ వంటకం చాలా రుచికరంగా ఉంటుంది. రెస్టారెంట్ వెళ్ళినప్పుడు చనా మసాలా ఆర్డర్ చేసి అన్నం లేదా చపాతీ,  నాన్‌తో చనా మసాలాతో రుచిని ఆస్వాదించవచ్చు.

2. దాల్ చావల్

ఇది ప్రతి ఇంట్లో తయారుచేసుకునే సాధారణ వంటకం. కనీసం వారంలో మూడు లేదా నాలుగు సార్లు ఈ వంటకాన్ని తినడానికి ఇష్టపడతారు. అన్నం, పప్పుతో వివిధ కాయధాన్యాలను కలిపి దాల్ చావల్ తయారుచేస్తారు. 

3. దాల్ ఫ్రై

దాల్ ఫ్రై  భోజన ప్రియులు అమితంగా ఇష్టపడే వంటకం. ఏ పప్పుతోనైనా దాల్ ఫ్రై చేయవచ్చు.  పప్పులో నెయ్యి లేదా వెన్నతో కలిపి తింటే ఆ రుచే వేరు. దీనిని ఎక్కువగా చపాతీ, పులావ్ లేదా జీరా రైస్‌తో తీసుకుంటారు.

4. దాల్ మ‌ఖ‌నీ

ఇది భారతీయులు ఎక్కువగా ఇష్టపడే మరొక ప్రసిద్ధ పప్పు వంటకం. హిందీలో వెన్నని 'మాఖన్' అంటారు.  పప్పులో వెన్న కలిపి వండే వంటకం ఇది. దాల్ మ‌ఖ‌నీ చపాతీ , పూరీ, అన్నంలో కలుపు తింటే ఆ మజానే వేరు. పంజాబీలు ఎక్కువగా తినే  వంటకం ఇది. 

5.మటర్ కా దుల్మా 

బఠానీలను మసాలా దినుసులతో కలిపి వండే ఈ రెసిపీ రుచి అద్భుతంగా ఉంటుంది. మాంసాహార ప్రియులు కూడా అమితంగా ఇష్టపడే శాఖాహార వంటకం ఇది. బఠానీలను బాగా నానబెట్టి, ఆ తర్వాత వాటిని పేస్ట్‌గా చేసి మసాలా దట్టించి ఈ రెసిపీ తయారు చేస్తారు. దీనిని నాన్, చపాతీతో తింటే ఆ టేస్టే వేరు.

సంబంధిత కథనం