Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. 'దీపకి, నీ కొడుక్కి ఏంటి సంబంధం'నిలదీసిన జ్యోత్స్న.. కార్తీక్ పై దీప ఫైర్
Karthika deepam 2 serial today may 20th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..జ్యోత్స్నకి కార్తీక్ గురించి లేనిపోనివి కల్పించి చెప్పి మనసు పాడు చేయవద్దని కాంచన పారిజాతానికి వార్నింగ్ ఇస్తుంది. అటు శౌర్యని కార్తీక్ పెద్ద స్కూల్ చేర్పించిన విషయం దీపకు తెలుస్తుంది.
Karthika deepam 2 serial today may 20th episode: కార్తీక్ శౌర్యని తనకి నచ్చిన స్కూల్ లో జాయిన్ చేస్తాడు. దీంతో శౌర్య చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు బయటకు రాగానే పారిజాతం, జ్యోత్స్న చూసి రగిలిపోతారు. ఇప్పటికైనా అర్థం అయ్యిందా ఇది జాలి కాదు బాధ్యతని అంటుంది.
దీపకి, నీ కొడుక్కి ఏంటి సంబంధం?
పారిజాతం వాళ్ళు కాంచన దగ్గరకు వస్తారు. జ్యోత్స్నని చూడగానే సంతోషంగా రా కోడలా అంటుంది. పారిజాతం పుల్లవిరుపు మాటలు మాట్లాడుతుంది. జ్యోత్స్న కాంచనతో చాలా సీరియస్ గా మాట్లాడుతుంది.
దీపకి, నీకొడుక్కి ఏంటి సంబంధమని జ్యోత్స్న నిలదీస్తుంది. దీప విషయంలో అంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏంటి? శౌర్యని జాయిన్ చేయడానికి బావ తీసుకెళ్ళాడు దీప లేదా తీసుకెళ్లాడానికి. దీప కాపాడింది మా మమ్మీని వాళ్ళు ఉంటుంది మా ఇంట్లో. వాళ్లేవరికి లేని ప్రత్యేక శ్రద్ధ బావకు ఎందుకత్త?
ఇప్పటికే దీప వాళ్ళ ఆయన ఎలాంటి నిందలు వేసి వెళ్లాడో తెలుసు కదా. బావ అటు రెస్టారెంట్, ఇటు నన్ను వదిలేసి పాప, దీప చుట్టూ తిరిగితే నిందలు నిజం అయినట్టే కదా అంటుంది. కాంచన సీరియస్ అవుతుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్న దానివి బావ ఎలాంటి వాడో నీకు తెలియదా అంటుంది.
కార్తీక్ ని సపోర్ట్ చేసిన కాంచన
అది చిన్నపిల్ల తెలియక మాట్లాడితే సర్ది చెప్పకుండా రెచ్చగొట్టి తీసుకొస్తావా అని కాంచన పారిజాతాన్ని తిడుతుంది. నా కొడుకు గురించి ఒకరు చెప్తే వినే పరిస్థితిలో నేను లేను. శౌర్యని స్కూల్ లో చేర్పించిన విషయం వాడు నాకు ఎప్పుడో చెప్పాడు.
తెలిసి కూడా ఏం అనలేదా అంటుంది. చేసేది మంచి పని అయితే ఎందుకు వద్దు అంటాను. మీ బావ ఎలాంటి వాడో తెలుసు కదా. ఎవరు ఎలాంటి చెత్త వాగుడు వాగినా పట్టించుకోవద్దని కాంచన చెప్తుంది.
ఈ మధ్య బావలో మార్పు మొదలైంది. అది నాకు ఈరోజు అర్థం అయ్యింది రేపు నీకు అర్థం అయ్యిందని చెప్పి జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోతుంది. జ్యోత్స్నని ఇలా రెచ్చగొట్టొద్దని కాంచన పారిజాతానికి చెప్తుంది. పిన్ని అర్థం లేని అనుమానాలతో కోడలి మనసు పాడు చేస్తుంది. వీలైనంత త్వరగా వీళ్ళ పెళ్లి చేయాల్సిందేనని కాంచన అనుకుంటుంది.
దీపకి నిజం చెప్పిన పారిజాతం
దీప ఇంటికి వచ్చి శౌర్య కోసం వెతుకుతుంది. అప్పుడే జ్యోత్స్న వాళ్ళు ఇంటికి వస్తే దీప ఎదురుపడుతుంది. ఇంట్లోకి వెళ్తున్న దీపని ఆపి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. నీ కూతురు ఎక్కడ ఉందో నీకు మాకు తెలుసని పారిజాతం, జ్యోత్స్న వంకరగా మాట్లాడతారు.
పారిజాతం దీపని నానామాటలు అంటుంది. నీ కూతురిని కార్తీక్ తో ఎందుకు పంపావని నిలదీస్తుంది. దీప తనకు నిజంగా తెలియదని అంటే పారిజాతం మాత్రం నమ్మదు. నువ్వు నీ కూతురిని తీసుకెళ్ళి చిన్న స్కూల్ లో జాయిన్ చేశాడు. ఇప్పుడు కార్తీక్ నీ కూతురిని తీసుకెళ్ళి పెద్ద స్కూల్ లో జాయిన్ చేశాడని అంటుంది.
తనకు అసలు ఇవేమీ తెలియదని దీప చెప్తున్నా కూడా పారిజాతం మాత్రం నమ్మదు. నోటికొచ్చినట్టు వాగుతుంది. అప్పుడే కార్తీక్ శౌర్యని తీసుకుని ఇంటికి వస్తాడు. శౌర్య వచ్చి కార్తీక్ నన్ను పెద్ద స్కూల్ లో చేర్పించాని సంతోషంగా చెప్తుంది. దీప కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది.
ఎవరిని అడిగి తీసుకెళ్లారని అంటుంది. కార్తీక్ ని ఏమి అనొద్దు నాకు ముందు స్కూల్ నచ్చిందని చెప్పాను అక్కడే జాయిన్ చేశాడని శౌర్య చెప్తుంది. కార్తీక్ ని కొప్పడద్దు నేను ఆ స్కూల్ లో బాగా చదువుకుంటానని అంటుంది.
కూతురిని కూడా దూరం చేస్తారా?
ఇంటికి వెళ్ళగానే ఇలా మాట్లాడమని ట్రైనింగ్ ఇచ్చారా? తండ్రిని దూరం చేశారు సరిపోలేదా? కూతురిని కూడా దూరం చేయాలా అని నిలదీస్తుంది. నేను చేసిన పని నీకు నచ్చదు, అదే మా అత్త ఈ పని చేస్తే ఇలా మాట్లాడతారా అంటాడు.
మీరు చేర్పించిన స్కూల్ శౌర్యకు నచ్చలేదని చెప్తాడు. మీరు చేస్తే పనుల వల్ల నలుగురితో మాటలు పడుతున్నామని అంటుంది. మీరు మా గురించి పట్టించుకోవద్దని దీప చెప్తుంది. కానీ ఇది నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తం. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మీకు శ్రేయోభిలాషిని.
బుద్ధి లేని వాళ్ళు బుర్ర లేని వాళ్ళు ఎన్నైనా అంటారు. నోరు ఉంది కదా సమాధానం చెప్పడానికి ఆత్మాభిమానం కోసం మొగుడి మీద చెప్పు ఎత్తిన మనిషివి. ఎవరైనా ఏమైనా అంటే ఎందుకు తలదించుకోవాలి బుద్ధి చెప్పాలని అంటాడు.
స్కూల్ ఫీజు నేనే కడతా
చదువు లేని కారణంగా స్కూల్ వాళ్ళు చేర్పించుకోమని అన్నారు. ఒకవేళ ఒప్పుకుంటే మీరు చేర్పించేవాళ్ళు కదా అంటాడు. నేను చేర్పిస్తే తల్లిగా అది నా బాధ్యత అవుతుంది. మీరు చేర్పిస్తే ఏమంటారని అంటుంది.
నేను స్కూల్ చేర్పించాను మాన్పించవద్దు. నేనే ఫీజు కట్టి చేర్పించుకుంటానని అంటుంది. అయితే ఫీజు ఎంతో చెప్పమని అడుగుతుంది. ఫీజు వివరాలు మాత్రం కార్తీక్ చెప్పడానికి ఒప్పుకోడు. దీప తన చీర కొంగులో నుంచి డబ్బులు తీసి ఇస్తుంది.
స్కూల్ ఫీజు ఎనభై వేలు అనేసరికి దీప షాక్ అవుతుంది. నాకు అంత స్తోమత లేదు పాప స్కూల్ ఫీజు కట్టలేనని అంటుంది. కట్టగలరు మీ వల్ల అవుతుందని అంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్