Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. కనిపించకుండా పోయిన శౌర్య.. కూతురి కోసం అల్లాడిపోతున్న దీప-karthika deepam 2 serial today june 3rd episode shourya missing karthik offers to hep deepa to locate her daughter ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: కార్తీకదీపం 2 సీరియల్.. కనిపించకుండా పోయిన శౌర్య.. కూతురి కోసం అల్లాడిపోతున్న దీప

Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. కనిపించకుండా పోయిన శౌర్య.. కూతురి కోసం అల్లాడిపోతున్న దీప

Gunti Soundarya HT Telugu
Jun 03, 2024 07:27 AM IST

Karthika deepam 2 serial today june 3rd episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. స్కూల్ కి వెళ్ళిన దీప అక్కడ శౌర్య లేదని చెప్పేసరికి కంగారుపడుతుంది. కూతురు కోసం అంతా వెతుకుతుంది. కానీ కనిపించదు.

కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 3వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ జూన్ 3వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial today june 3rd episode: కార్తీక్ ని కలవడానికి జ్యోత్స్న ఆఫీసుకు వస్తుంది. నీకోక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. మన రెస్టారెంట్ మీద కేసు పెట్టిన వాడు క్షమాపణ చెప్పి పరువు నష్టం దావా వేయొద్దని బతిమలడాడని చెప్తుంది. కంగ్రాట్స్ చెప్తాడు. కేసు గెలిచాము కదా నీకు పార్టీ ఇస్తానని అంటుంది.

శౌర్య మిస్సింగ్ 

వర్క్ ఉందని తప్పించుకోవడానికి చూస్తాడు. కానీ జ్యోత్స్న మాత్రం కుదరదు అనేసి తనని తీసుకుని వెళ్తుంది. నీ ఆలోచనలు బిజినెస్ మీదకు డైవర్ట్ చేయాలని కార్తీక్ అనుకుంటాడు. దీప స్కూల్ దగ్గరకు వస్తుంది. టీచర్స్ మీటింగ్ ఉంటే గంటన్నర ముందే వెళ్లిపోయారని స్కూల్ సెక్యూరిటీ చెప్తాడు.

స్కూల్ లో తన కూతురు ఉంటుందని దీప కంగారుగా అంటుంది. తాను రాకుండా ఎక్కడికి వెళ్లదని చెప్తుంది. ఒక క్యాబ్ వచ్చింది, నేను పని ఉండి లోపలికి వెళ్ళి వచ్చేసరికి పాప లేదని చెప్తాడు. నరసింహ తీసుకుని వెళ్ళి ఉంటాడని దీప కంగారుగా వెళ్ళిపోతుంది.

దీప విషయంలో అనవసరంగా నరసింహని రెచ్చగొట్టొద్దని అనసూయ శోభకి చెప్తుంది. దాని బతుకు ఏదో అది బతుకుతుంది ఎందుకు మనకి దాంతో అంటుంది. కానీ శోభ మాత్రం ఒప్పుకోదు. పోలీసులు కాదు ఈసారి దీప ఇంటికి వస్తే అని శోభ అనగానే దీప అత్తయ్య అని కంగారుగా పిలుస్తూ వస్తుంది.

నా కూతురు ఎక్కడ?

నా కూతురు ఎక్కడని అనసూయని నిలదీస్తుంది. దీప కంగారుగా శౌర్య కోసం ఇల్లంతా వెతుకుతుంది. కానీ కనిపించదు. ఏం జరిగిందని అనసూయ అడుగుతుంది. నా కూతురు కనిపించడం లేదు నరసింహ నా కూతుర్ని ఎక్కడ దాచాడో చెప్పమని నిలదీస్తుంది.

నా భర్తని పోలీసులకు పట్టించడం కోసం ఇదొక కొత్త నాటకం ఆడుతున్నావా అని శోభ తిడుతుంది. స్కూల్ దగ్గర నుంచి కనిపించకుండా పోయింది. నిన్న నరసింహ స్కూల్ దగ్గరకు వచ్చి పాపతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. అయినా వినకుండా హోటల్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తే జనం బుద్ధి చెప్పి పంపించారు.

ఈరోజు స్కూల్ దగ్గరకు వచ్చి ఎత్తుకుని వచ్చాడు. మీరందరూ దూరం అయినా నాకు ఉన్న ఒకే ఒక బంధం అది. నా కూతురిని నాకు దూరం చేయవద్దని దీప ఏడుస్తూ అడుగుతుంది. నీ కూతుర్ని ఎత్తుకురావల్సిన అవసరం మాకు ఏంటి? మేం నిన్నే వద్దని అనుకుంటే ఇక దాంతో మాకేం పని అని అనసూయ అడుగుతుంది.

అది ఒక పిల్ల దరిద్రం 

నేను కూడా అందుకే ఇప్పటి వరకు నరసింహ తన తండ్రి అని చెప్పలేదు. కానీ ఇప్పుడు కావాలనే దానికి నిజాలు చెప్పి దాని మనసు పాడు చేయాలని చూస్తున్నాడు. మమ్మల్ని వదిలేయండి నా కూతురిని నాకు ఇచ్చెయ్యండి. నా కూతురు లేకుండా నేను బతకలేను అంటుంది.

చాలు ఆపు నీ నాటకాలు అని అనసూయ, శోభ ఇద్దరూ దీపని తిడతారు. నరసింహ నా కూతురిని ఎక్కడ దాచాడో చెప్పమని నిలదీస్తుంది. నీ కూతురు ఎక్కడ ఉందో మాకు తెలియదు. నువ్వే ఒక దరిద్రం అయితే అది ఒక పిల్ల దరిద్రం. నీ వెధవ వేషాలు తెలిసి నీ మొగుడు నిన్ను వదిలేసినట్టు నీ కూతురు కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది.

పారిజాతానికి చీవాట్లు 

నీకు మాకు ఏ సంబంధం లేదు. కూతురు కనిపించడం లేదని అడ్డమైన సాకులు చెప్పి ఈ ఇంటికి రావద్దు. నా కొడుకు నీ కూతురిని తీసుకురాలేదు. ఆ అవసరం కూడా లేదు ఎక్కడికైనా పోయిందో లేదంటే ఎవరైనా ఎత్తుకుపోయారో ఏమో వెళ్ళి వెతుక్కో అని అనసూయ దీపను వెళ్లగొడుతుంది.

పారిజాతం తనని తాను పొగుడుకుంటుంది. అది చూసి శివనారాయణ తనకు కౌంటర్ వేస్తాడు. ఇలా ఒంటరిగా కూర్చుని మాట్లాడుకునే వాళ్ళకి ఒక హాస్పిటల్ కి ఉంది. వెంటనే తీసుకుని వెళ్తానని శివనారాయణ గాలి తీస్తాడు. ఇంట్లో తనకు గుర్తింపు లేదని అంటుంది.

ఏం ఘనకార్యం చేశావని అడుగుతాడు. ఎడమొహం పెడమొహం పెట్టుకున్న మనవడు, మనవరాలిని కలపడానికి ప్రయత్నం చేశానని చెప్తుంది. నువ్వు మనవరాలు విషయంలో వేలు పెట్టకు, దానికి కాస్త దూరంగా ఉండు లేదంటే హాస్పిటల్ లో తీసుకెళ్ళి పడేస్తానని సున్నితంగా వార్నింగ్ ఇస్తాడు.

బిజినెస్ చూసుకోమన్న కార్తీక్ 

నా అసలు నీకు తెలియదు. నీ వంశంలో నీ రక్తం పుట్టకుండా చేస్తానని పారిజాతం అనుకుంటుంది. బిడ్డల్ని మార్చేశాను ఇక మీదట కొనసాగబోయేది నా కొడుకు దాసు రక్తం. నీ అసలు మనవరాలికి పుట్టుకతోనే నూరేళ్ళు నిండిపోయాయి. ఇక నా మనవరాలు ఈ ఇంటి వారసురాలు.

జ్యోత్స్న, కార్తీక్ కి పెళ్లి జరిపించడం నా జీవిత లక్ష్యమని పారిజాతం అనుకుంటుంది. కార్తీక్, జ్యోత్స్న కారులో వెళ్తూ ఉంటారు. కార్తీక్ బిజినెస్ గురించి మాట్లాడతాడు. మనకి చాలా రెస్టారెంట్ లు ఉన్నాయి కదా అందులో ఇన్వాల్వ్ అవమని చెప్తాడు.

తనకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమని చెప్తుంది. అయితే అందులోనే ఏదో ఒకటి చేసి ట్రెండ్ సెట్ చెయ్యి. చదువుకుని ఇంట్లో కూర్చోవడం ఎందుకని అంటాడు. అదే ఐదో తరగతితో ఆపేసిన దీపని చూడు సిటీకి కొత్త అయినా హోటల్ పెట్టుకుందని మెచ్చుకుంటాడు.

జ్యోత్స్న దీపని చూసి కారు ఆపమని చెప్తుంది. రోడ్డు పక్కన దీప ఏడుస్తూ కూర్చుంటే వెళ్ళి ఏమైందని అడుగుతారు. శౌర్య కనిపించడం లేదని దీప ఏడుస్తూ చెప్తుంది. స్కూల్ లో లేదు. ఇవాళ గంటన్నర ముందే స్కూల్ వదిలేశారు అంట నాకు తెలియదని చెప్తుంది.

చుట్టుపక్కల అంతా వెతికాను ఎక్కడా కనిపించడం లేదని చెప్తుంది. ఒకవేళ నరసింహ ఏమైనా అని కార్తీక్ అంటే లేదు అక్కడికి కూడా వెళ్ళాను తను కిరాయికి వెళ్లాడని చెప్తుంది. రండి వెళ్ళి వెతుకుదామని కార్తీక్ తనని కారు ఎక్కించుకుంటాడు. కారులో దీప కార్తీక్ పక్క సీట్లో కూర్చునేసరికి జ్యోత్స్న రగిలిపోతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner