Promise: ప్రామిస్ చేసి మాట తప్పుతున్నారా? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా?-what is the meaning of swear and what happens when promise break ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Promise: ప్రామిస్ చేసి మాట తప్పుతున్నారా? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా?

Promise: ప్రామిస్ చేసి మాట తప్పుతున్నారా? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Jun 13, 2024 04:32 PM IST

Promise: చాలామంది నోటి నుంచి ప్రామిస్ చేస్తున్నా అనే మాట తరచూ వింటూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇది ఒక ఊత పదంగా మారిపోయింది. అయితే మీరు ఎవరికైనా ఒక్కసారి ప్రామిస్ చేసి దాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుందో తెలుసా?

ప్రామిస్ బ్రేక్ చేస్తున్నారా?
ప్రామిస్ బ్రేక్ చేస్తున్నారా? (pexels)

Promise: కొంతమంది చిన్న చిన్న విషయాలకే ఒట్టు పెట్టేస్తూ ఉంటారు. ఏంటి నా మాట మీద నీకు నమ్మకం లేదా? ప్రామిస్ ఎవరికీ చెప్పాను అని మాట ఇచ్చేస్తుంటారు. కానీ తర్వాత ఆ మాట నిలబెట్టుకోకుండా ఉంటారు.

ఈ మధ్య కాలంలో ప్రామిస్ చేయడం అనేది ఊత పదంగా మారిపోయింది. మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు అని చెప్పడం తరచూ వింటూనే ఉంటాము. తమ అభిప్రాయాన్ని నిజమని నమ్మించేందుకు కొంతమంది ఇలా అసత్య ప్రమాణాలు చేస్తే మరి కొంతమంది తమ అభిప్రాయం బలమైనదని నిరూపించుకోవడానికి ఇలా చేస్తారు. కానీ ప్రామిస్ చేయడం అనేది చిన్న విషయం మాత్రం కాదు. ఒక్కోసారి ప్రామిస్ చేసి దాన్ని నెరవేర్చులేకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసా?

వాగ్దానం చేయడం అంటే ఏంటి?

ప్రమాణం చేయడం అనేది ఒక పవిత్రమైన ప్రవర్తన, సంప్రదాయం. ఇది సరైన స్ఫూర్తితో నెరవేరినప్పుడు ప్రమాణం చేసిన వ్యక్తికి క్షేమం ఇస్తుంది. కానీ ఇప్పటి రోజుల్లో ప్రామిస్ అనేది ఒక ఊతపదంగా మారిపోయింది. చిన్న చిన్న వాటికి తప్పుడు వాగ్ధానాలు చేస్తున్నారు. అయితే పురాణాలలో కూడా ప్రమాణం గురించి ప్రస్తావించారు. ఒకరి ముందు మరొకరు ప్రమాణం చేయడం అంటే వారి పట్ల తమకి ఉన్న ప్రేమ, ఆందోళనను వ్యక్తపరచడం కోసం ఈ ప్రమాణాన్ని ఉపయోగించేవారు. అయితే కాలం మారుతున్న కొద్దీ దీని అర్థం కూడా మారిపోయింది. మాట ఇవ్వడం తర్వాత దాన్ని మర్చిపోవడం సర్వసాధారణం అయిపోయింది. ఒక్కసారి ప్రామిస్ చేస్తే దాన్నే అంత తేలికగా విచ్ఛిన్నం చేయకూడదు. అదే సమయంలో ప్రతి చిన్న దానికి ప్రామిస్ చేయడం కూడా సరికాదు.

నేటి సమాజంలో ప్రజలు ఎక్కువగా తమ పిల్లలపై, భర్తపై, తల్లిపై, ప్రియమైన వారిపై ప్రమాణాలు చేస్తూ ఉంటారు. వివిధ కారణాల వల్ల ఆ ప్రమాణాన్ని నిలుపుకోలేకపోతారు. కొంతమంది ఒక్కసారి ప్రామిస్ చేస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతటి కఠినమైన పరిస్థితులైన ఎదుర్కొంటారు. అయితే మరి కొందరు మాత్రం ప్రామిస్ కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు.

ప్రామిస్ బ్రేక్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

ఒక వ్యక్తి తప్పుడు ప్రమాణం చేసినా లేదా దానిని ఉల్లంఘించినా.. ఆ ప్రమాణాన్ని మరొకరిపై తమ అవసరం కోసం ప్రమాణం చేసి ఉల్లంఘించినా అది ఆ వ్యక్తికి పెద్ద నష్టం తీసుకువస్తుందని గర్గ సంహిత, విష్ణు పురాణంలో రాయబడింది. అదే సమయంలో ఎవరైనా జీవించి ఉన్న వ్యక్తిపై ప్రమాణం చేసి దానిని ఉల్లంఘించిన, వేరొకరిపై తప్పుడు ప్రమాణం చేసిన వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అది వారికి హానికరం అవుతుంది. ప్రమాణం చేసి ఉల్లంఘించిన వ్యక్తి అనారోగ్యంతో బాధపడవచ్చు లేదా జీవితంలో ఇతర సమస్యలు ఎదుర్కోవచ్చు.

ప్రమాణం ఉల్లంఘించడం లేదా తప్పుడు ప్రమాణం చేయడం ఆ వ్యక్తి జాతకంపై కూడా దాని ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రామిస్ ని దుర్వినియోగం చేయడం అంటే మీ ప్రియమైన వారి జీవితంతో లేదా మీ జీవితంతో ఆడుకున్నట్టే.

కష్టమైన నిలబెట్టుకున్నారు

ద్వాపరయుగంలో రాజా హరిశ్చంద్రుడి నుంచి మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి వరకు.. భీష్మ పితామహుడు నుంచి శ్రీకృష్ణుడి వరకు అనేక మంది ప్రమాణం చేసి ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ వాటిని నెరవేర్చిన సంఘటనలు ఉన్నాయి. శ్రీరాముడు తన తండ్రికి ఇచ్చిన వాగ్ధానం మేరకు అరణ్యవాసం చేశాడు. ఇలా పురాణాలలో ఎంతో మంది ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఎదురైన వాటిని నెరవేర్చారు. అందుకే ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరు ఎవరికైనా ప్రామిస్ చేస్తే దాన్ని నెరవేర్చడం చాలా ముఖ్యం.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel