తెలుగు న్యూస్ / ఫోటో /
Promise Day 2023 : రిలేషన్షిప్లో మీరు చేయకూడని ప్రామిస్లు ఏంటి?
- Valentines Week 2023 : ప్రేమికుల రోజు దగ్గరకొస్తుంది. వాలెంటైన్స్ వీక్‌లో 'ప్రామిస్ డే' చాలా ముఖ్యమైనది. అయితే ఈ 'ప్రామిస్ డే' అనుకున్నంత ఈజీ కాదు. మీరు ప్రేమించిన వ్యక్తికి ఎప్పుడూ చేయకూడని ఐదు వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి.
- Valentines Week 2023 : ప్రేమికుల రోజు దగ్గరకొస్తుంది. వాలెంటైన్స్ వీక్‌లో 'ప్రామిస్ డే' చాలా ముఖ్యమైనది. అయితే ఈ 'ప్రామిస్ డే' అనుకున్నంత ఈజీ కాదు. మీరు ప్రేమించిన వ్యక్తికి ఎప్పుడూ చేయకూడని ఐదు వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి.
(1 / 6)
వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలై ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుతో ముగుస్తుంది. ఐదవ రోజు, ఫిబ్రవరి 11, ప్రామిస్ డేగా జరుకొంటారు. అయితే ఈ రోజున ప్రేమికులు వాగ్దానాలు చేసుకుంటారు. కానీ కొన్ని వాగ్దానాలు చేయకపోవడమే మంచిది. మీ భాగస్వామికి మీరు ఎప్పుడూ చేయకూడని ఐదు వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి.(Unsplash)
(2 / 6)
నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను : జంటలు ఒకరికొకరు చేసే అత్యంత సాధారణ వాగ్దానాలలో ఇది ఒకటి. చాలామంది తమ జీవితాంతం తమ భాగస్వామితో గడపాలని కోరుకుంటున్నారని చాలా మంది ఖచ్చితంగా అనుకుంటున్నప్పటికీ, చాలామంది అలా చేయరు. ఈ రోటిన్ వాగ్దానం కాకుండా కొత్తగా ట్రై చేయండి. నిజాయితీగా ప్రేమించండి.(Unsplash)
(3 / 6)
నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను : ఇలా చెప్పడం ద్వారా మీరు మీ భాగస్వామి అంచనాలను పెంచుతారు. మీరు ఎల్లప్పుడూ వారితో ఉండాలని ఆశిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల మీరు దీన్ని చేయలేకపోతే, వారు మిమ్మల్ని బాధపెడతారు.. నిందిస్తారు.(Unsplash)
(4 / 6)
నేను తాగను : మీరు తాగనని మీ భాగస్వామికి వాగ్దానం చేయడం మానేయండి. ఒకవేళ మళ్లీ తాగి వెళితే మీ మీద నమ్మకం పోవచ్చు. తాగితే ఆ విషయాన్ని మీరే చెప్పుకోవడం మంచిది. అయితే ఆ అలవాటను మెల్లమెల్లగా మానుకోండి. ఇది మీకు మీరు మంచి చేసుకునే మార్గం. మద్యపానం మానేయడం మీ సంబంధాన్ని అనేక విధాలుగా మెరుగుపరుస్తుంది.(Unsplash)
(5 / 6)
నేను నిన్ను ఎప్పటికీ బాధించను : మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తే, ఏదో ఒక సమయంలో మీరు వారిని బాధపెట్టడం సహజం. మనిషిని బాధపెట్టకుండా ఎవరూ ఉండలేరు. ఏదో ఒక చిన్న విషయంలోనైనా ఎవరో ఒకరు బాధపడతారు. అందుకే మీరు వారి వెనక ఏమీ చేయకండి. ఏదైనా దాచడానికి బదులుగా వారికి నిజం చెప్పండి.(Unsplash)
(6 / 6)
నేను నీకు ఎప్పుడూ అబద్ధం చెప్పను : పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పడం మంచిది కాదు. కానీ మనం ప్రేమించే వాళ్ల కోసం చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం అనేది సహజమే. వాళ్లు కూడా సంతోషంగా ఉంటారంటే.. చిన్న చిన్న అబద్ధాలు చెబితే ఏం కాదు. అయితే జీవితం ఎఫెక్ట్ అయ్యే అబద్ధాలు చెప్పకండి. అంతేకానీ నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అనే వాగ్దానం చేయకండి.(Unsplash)
ఇతర గ్యాలరీలు