Karthika deepam 2 serial today june 15th episode: కార్తీక్ జ్యోత్స్నకు ఫోన్ చేసి బ్రేక్ ఫాస్ట్ కి వెళ్దామని అడుగుతాడు. పట్టరాని ఆనందంతో సరే అంటుంది. నేను అనుకున్నది ఒకటి అయితే బావ ఇలా రివర్స్ లో షాక్ ఇచ్చాడు ఏంటి? బావతో కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడాలని అనుకుంటుంది.
పేరెంట్స్ మీటింగ్ కి శౌర్య దీపను తీసుకుని వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ మీ అమ్మ ఒక్కతే వచ్చింది ఏంటి నాన్న ఎక్కడని అడుగుతారు. జ్యోత్స్న మాటలు దీప గుర్తు చేసుకుంటుంది. నాన్న ఊరు వెళ్లాడని శౌర్య చెప్తుంది. దీప దగ్గర ఫోన్ తీసుకుని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. దీప ఎందుకు అతనికి ఫోన్ చేస్తున్నావని లాగేసుకుంటుంది.
నువ్వు వస్తే నన్ను స్కూల్ లోనే చేర్పించుకోలేదు. ఇప్పుడు నేను రైమ్స్ చెప్పకపోతే స్కూల్ నుంచి పంపించేస్తే, కార్తీక్ వస్తే నాకు ధైర్యంగా ఉంటుందని అంటుంది. కార్తీక్ కాల్ చేస్తే నువ్వు స్కూల్ కి రా భయంగా ఉందని శౌర్య చెప్తుంది. ముందు శౌర్య దగ్గరకు వెళ్ళి తర్వాత జ్యోత్స్న దగ్గరకు వెళ్దామని అనుకుంటాడు.
కార్తీక్ వచ్చి ఏమైందని అడుగుతాడు. రైమ్స్ అడుగుతారంట భయంగా ఉంది, అమ్మకి కూడ ఏం తెలియదు కదా మళ్ళీ నన్ను స్కూల్ నుంచి పంపించేస్తారా అని అంటుంది. కంగారుపడకు నువ్వు ఎలా చదువుతున్నావో మీ పేరెంట్స్ కి తెలిసేందుకు చిన్న నాలెడ్జ్ టెస్ట్ పెడతారని తనకు ధైర్యం చెప్తాడు.
మీటింగ్ కు ఉండమని అడుగుతుంది. నీకు ఇంగ్లీష్ వచ్చు కదా నాకు హెల్ప్ చెయ్యి అని అంటుంది. శౌర్య భయపడుతుందని కాసేపు ఉండి వెళ్తానని చెప్తాడు. శౌర్య ఒక చేత్తో కార్తీక్ మరొక చేత్తో దీపను పట్టుకుని వెళ్తుంది. అది ఎవరో ఫోటో తీస్తారు. సుమిత్ర బ్రేక్ ఫాస్ట్ కి రమ్మని జ్యోత్స్నని పిలిస్తే బావతో కలిసి బయటకు వెళ్తున్నానని సంతోషంగా చెప్తుంది.
నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండు రుజువులు లేకుండా ఏవి నమ్మొద్దు. కార్తీక్ చాలా మంచివాడు వాడితో నీ లైఫ్ చాలా బాగుంటుందని చెప్తుంది. అప్పుడే జ్యోత్స్న ఫోన్ కి ఫోటో వస్తుంది. అది చూసి షాక్ అవుతుంది. మీటింగ్ లో ప్రిన్సిపల్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే దీపకు అర్థం కాక బిక్క మొహం వేస్తుంది.
జ్యోత్స్న ఆవేశంగా స్కూల్ దగ్గరకు వస్తుంది. జ్యోత్స్న ఫ్రెండ్ శ్రీవాణి తనని మీటింగ్ జరిగే రూమ్ కి తీసుకెళ్తుంది. దీప కార్తీక్ ని వెళ్ళమని చెప్తుంది. మీటింగ్ లో దీప, కార్తీక్ కలిసి కూర్చోవడం జ్యోత్స్న చూసి రగిలిపోతుంది. శౌర్య జోని కార్తీక్ కి చూపిస్తుంది.
మీటింగ్ కి తాను తన కూతురు మాత్రమే వెళ్తున్నామని దీప చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. జో నువ్వు నాకోసం వచ్చావా అని అడుగుతుంది. ప్రిన్సిపల్ ఎవరు ఈమె అంటే శౌర్య కోసం వచ్చానని చెప్తుంది. తన గురించి మాట్లాడటానికి వచ్చానని అంటుంది.
కార్తీక్ మా బావ ప్రస్తుతం శౌర్యకు గార్డియన్ గా ఉన్నాడు. తను చాలా బిజీ ఇలాంటి పర్సన్ ని మీరు పేరెంట్స్ మీటింగ్ కి పిలిచి తన టైమ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పటి నుంచి శౌర్యకు గార్డియన్ గా నేను ఉంటాను. నా ఫోన్ నెంబర్ తీసుకోండి అని చెప్తుంది.
బ్రేక్ ఫాస్ట్ అన్నావ్ రెస్టారెంట్ లో కాదా స్కూల్ లోనా అని వెటకారంగా మాట్లాడుతుంది. శౌర్య భయపడుతుందని అంటే వచ్చానని చెప్తాడు. కానీ జ్యోత్స్న మాత్రం దీప ఇక నీకు ఏ అవసరం వచ్చినా నేను గార్డియన్ గా ఉన్నానుగా నేను చూసుకుంటానని అంటుంది.
ఈ విషయం గురించి జ్యోత్స్న ఎన్ని మాటలు అంటుందో ఏమో, ఏం చేయకుండా మాటలు పడాల్సి వస్తుందని దీప బాధపడుతుంది. జ్యోత్స్న కార్తీక్ ని దీప హోటల్ దగ్గరకు తీసుకువస్తుంది. కడియం ఎవరు మీరు అని అడుగుతాడు. కార్తీక్ ని చూపిస్తే జ్యోత్స్న మరదలు అనేసి కడియం అర్థం చేసుకుంటాడు.
కార్తీక్ బాబులాగే మీరు దీపమ్మకు సాయంగా ఉంటే అని కడియం మాట్లాడబోతుంటే దీప ఆపుతుంది. కార్తీక్ వెళ్లిపోదామని అంటే జ్యోత్స్న నేను దీప ఉప్మాకు అభిమానిని అని వంకరగా మాట్లాడుతుంది. నీకు ఏం కావాలి జ్యోత్స్న అని దీప అంటే మా బావ అని కోపంగా చెప్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్