Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. శ్రీధర్ గురించి నిజం చెప్పడానికి ప్రయత్నించిన దీప.. విషం తాగి చస్తానన్న కాంచన
Karthika deepam 2 serial today june 24th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాంచనను వదిలిపెట్టి కావేరితో షికార్లు చేయడం దీప కంట పడుతుంది. ఎలాగైనా కాంచనతో నిజం చెప్పాలని ప్రయత్నిస్తుంది.
Karthika deepam 2 serial today june 24th episode: జ్యోత్స్న, పారిజాతం ఇంట్లో ఎవరి సపోర్ట్ ఎవరికి ఉందని మాట్లాడుకుంటారు. దీప గురించి ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి తిరిగే అవకాశం లేదని జ్యోత్స్న ధీమాగా చెప్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు.
జ్యోత్స్నకు షాకిచ్చిన దీప
కార్తీక్ కారులో నుంచి దీప కూడా దిగడం చూసి ఇద్దరూ షాక్ అవుతారు. మందుల కవర్ కిందపడిపోతే దీప తీసిస్తుంది. ఏమైందని అంటే అమ్మకి ఆరోగ్యం బాగోలేదు నాన్న కూడా ఇంట్లో లేరని మొత్తం చెప్తాడు. రోడ్డు మీద ఎదురుగా ఏం వస్తుందో కూడా చూసుకోకుండా నడుస్తున్నారంటే మీ మనసులో ఎంత బాధ మోస్తున్నారో అర్థం అవుతుంది, అది ఏంటో చెప్పమని అడుగుతాడు.
కొంచెం లేట్ అయితే మీ ప్రాణాలు పోయేవి అంత దాకా తెచ్చుకున్నారంటే అది మీ ప్రాణంతో సమానమైనది అయి ఉంటుందని అంటాడు. కానీ దీప మాత్రం చెప్పకుండా ఇంటికి వెళ్లిపొమ్మని చెప్తుంది. దీంతో కార్తీక్ వెళ్ళిపోతాడు. వీళ్ళని కలవకుండా ఆపడం కష్టం. నిన్న టిఫిన్ సెంటర్ దగ్గరకు వెళ్ళి అంత టార్చర్ చేసిన ఇలా చేశారంటే ఎంత తెగించారని జ్యోత్స్న రగిలిపోతుంది.
ప్రపంచం సర్వనాశనం అయిపోయినా నా పెళ్లి బావతోనే జరుగుతుందని జ్యోత్స్న తెగేసి చెప్తుంది. వామ్మో ఇది పూర్తిగా నాలగా మారిపోయింది. నీ కలలు అన్నీ పండాయి. దాసు మనకు ఇక తిరుగులేదు తొందర్లోనే ఈ ఇంటి మీద మన జెండా ఎగురుతుందని పారిజాతం సంతోషపడుతుంది.
పశ్చాత్తాపంతో కుమిలిపోయిన దీప
దీప కార్తీక్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కార్తీక్ ని అవమానించిన సంఘటనలు అన్నీ గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఆ మనిషి నిజం చెప్పాలని ప్రయత్నించాడు కానీ నేనే వినిపించుకోలేదు. చేయని తప్పుకు ఒక్క మాట అంటే కష్టంగా ఉంటుంది. కానీ నేను ఎన్ని మాటలు అన్నాను అన్నీ భరించాడు.
నేను ఎంత ద్వేషించినా పట్టించుకోకుండా నాకు సాయం చేశాడు. ఇప్పుడు నేను అతని మొహం ఏ ధైర్యంతో చూడగలను? తనకు శాపనార్థాలు పెట్టాను. అర్థం లేని ఆవేశంతో అదుపులేని కోపంతో మా నాన్న మీద ప్రేమ అంత అతని మీద ద్వేషంగా మార్చుకున్నాను. కానీ అతను ఒక్క మాట కూడా అనకుండా ఉండటం అతని సంస్కారం.
ఇప్పుడు నాకు నిజం తెలిసిందని క్షమించమని అడిగితే సరిపోతుందా? నేను చేసిన పాపం పోతుందా? కానీ ఆ మనిషిని క్షమించమని అడగాలని అనుకుంటుంది. శౌర్య వచ్చి ఎవరిని క్షమించమని అడగాలని అంటుంది. కూతురిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది.
దీప కంటపడిన శ్రీధర్
నరసింహ మాటలు గుర్తు చేసుకుంటూ నా ప్రాణం అడ్డు పెట్టి అయినా నిన్ను నేను కాపాడుకుంటాను. ఆ దుర్మార్గుడికి నిన్ను అప్పగించనని దీప ఫిక్స్ అవుతుంది. కార్తీక్ తల్లికి దగ్గరుండి సేవలు చేస్తాడు. తనకు జ్వరం తగ్గిపోయిందని చెప్పినా కూడా వినిపించుకోడు.
మీ నాన్న అక్కడ ఎలా ఉన్నారో ఏంటో తిన్నారో లేదో అని కాంచన ఫీల్ అవుతుంది. దీప టిఫిన్ సెంటర్ దగ్గర కారులో శ్రీధర్, కాంచన కనిపిస్తారు. మొదట భార్య జ్వరంతో బాధపడుతుంటే ఈయన రెండో భార్యతో షికార్లు చేస్తున్నారని ఇంటి దగ్గర తన పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని దీప బాధపడుతుంది.
కాంచన కిచెన్ లో వంట చేసుకుంటూ ఉండగా దీప వస్తుంది. మీకు ఆరోగ్యం బాగోలేదు కదా అందుకే మీకు సాయం చేద్దామని వచ్చానని చెప్తుంది. దీప మంచితనం చూసి కాంచన సంతోషపడుతుంది. ఇంట్లో ఎవరూ లేరా అని కావాలని అడుగుతుంది. సర్ లేరా అంటే లేరు నన్ను కనీసం గ్లాసు మంచి నీళ్ళు కూడా తీసుకొనివ్వరు.
నిజం చెప్పాలనుకున్న దీప
అలాంటి మనిషి ఈ మధ్య కొడుకు కంటే బిజీగా ఉన్నాడు. ఈ మధ్య క్యాంప్ అంటూ తిరుగుతున్నారని చెప్తుంది. బిజినెస్ పని మీద ఇప్పుడు క్యాంప్ కి వెళ్లారని అంటుంది. పని నేను తప్పితే ఆయనకు వేరే లోకమే లేదని కాంచన మురిసిపోతుంది. వేరే లోకం కాదు వేరే కుటుంబమే ఉంది.
మిమ్మల్ని ఇలా వదిలేసి ఆయన రెండో భార్యతో సంతోషంగా తిరుగుతున్నారని దీప ఆలోచిస్తూ ఉంటుంది. నా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేను నిజం చెప్పాలని అనుకుంటుంది. దీప ఏదో ఆలోచిస్తూ ఉంటుంటే నీకు నీ భర్త గుర్తుకు వచ్చాడు కదాని కాంచన అంటుంది.
నా భర్త నాకు చిన్న అబద్ధం చెప్తేనే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అలాంటిది నీకు తెలియకుండా ఇన్నాళ్ళూ మరొక భార్యతో ఉంటే ఇంకా విడాకులు ఇవ్వకుండా ఎందుకు ఆలోచిస్తున్నావని అడుగుతుంది. దీప భార్యను మోసం చేస్తున్న ఒక భర్త గురించి చెప్పాలని అంటుంది.
విషం తాగి చస్తా
ఒకడు ఉన్నాడు వాడి కథ మీకు చెప్తాను అంటుంది. పేరు ఏంటి అంటే పేరు చివర్లో చెప్తానని చెప్తుంది. భార్యా పిల్లలు ఉండగానే అతను ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. అతను ఆవిడతో కూడా బిడ్డను కన్నాడు. ఇప్పుడా భర్త ఇద్దరినీ మోసం చేస్తున్నాడు. నిజం తెలిసిన రోజున ఎవరికైనా అన్యాయం జరగవచ్చు.
అలాంటి మనిషిని ఏం చేయాలని అంటే కేసు పెట్టి జైల్లో వేయించాలి. నా భర్త ఎంతో మంచివాడని నిజాయితీగా నమ్ముతారు. ఆ నిజాయితీకి విలువ లేకుండా చేసిన మనిషిని చెప్పుతో కొట్టాలి. వింటుంటే నాకే ఇంత కోపం వస్తుందని కాంచన ఆవేశంగా మాట్లాడుతుంది.
నేను ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాను కదా అని దీప అంటుంది. నువ్వు వేరు భర్త మోసం చేసిన గుండె ధైర్యంతో ఉన్నావ్ అదే నాలాంటిది అయితే విషం తాగి చచ్చేది అనేసరికి దీప షాక్ అవుతుంది. నాకు నీ అంత ధైర్యం, మొండితనం లేవు. అబద్దం చెప్తేనే తట్టుకోలేను ఇక మోసం చేస్తే అసలు తట్టుకోలేను.
భర్త తాగుబోతు అయినా భరిస్తుంది. అంతే కానీ మరో ఆడదానితో జీవితం పంచుకున్నాడు అంటే ఏ ఆడది భరించలేదు. మోసం కంటే చావు మేలుగా అనిపిస్తుందని కాంచన ఎమోషనల్ గా చెప్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్