Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్..తన తండ్రి చావు గురించి అసలు నిజం తెలుసుకున్న దీప, కావేరితో శ్రీధర్ జాలీ ట్రిప్
Karthika deepam 2 serial today june 22nd: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కుబేర యాక్సిడెంట్ వెనుక ఉన్న అసలు నిజాన్ని కార్తీక్ దీపకు చెప్తాడు. దీంతో దీప చాలా పశ్చాత్తాపడుతుంది. అటు శ్రీధర్ ఇంట్లో అబద్ధం చెప్పి కావేరి దగ్గరకు వెళతాడు.
Karthika deepam 2 serial today june 22nd episode: పాపను ఇచ్చేస్తే మళ్ళీ లైఫ్ లో నీ జోలికి రానని నరసింహ చెప్తాడు. ఇందులో బలవంతం ఏం లేదు. పాప నాకు పుట్టిన కూతురు అయితేనే నాకు ఇచ్చేయ్, నాకు పుట్టలేదు అంటే నీ దగ్గరే పెట్టుకో. కానీ ఏదో ఒక సమాధానం చెప్పమని అంటాడు. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించి సమాధానం చెప్పమని చెప్తాడు.
ఇదే ముగింపు
మన ఇద్దరి జీవితాలకు నువ్వే చెప్పే సమాధానమే ముగింపు అనేసి వెళ్ళిపోతాడు. దీప అక్కడే కూలబడిపోయి ఏడుస్తుంది. జ్యోత్స్న ఫోన్ చూస్తూ ఉండగా సుమిత్ర వచ్చి లాగేసుకుని ప్రేమగా జ్యూస్ తాగిస్తుంది. పారిజాతం అది చూసి మురిసిపోతుంది. మాతో చెప్పకుండా నువ్వు మీ బావ షికార్లు చేస్తున్నారని తెలిసిందని సుమిత్ర అంటుంది.
ఇంతకముందు జరిగిన వాటి వల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని భయపడ్డాను కానీ ఇప్పుడు అదేమీ లేదని అంటుంది. పారిజాతాన్ని పిల్లలకు కాస్త దూరంగా ఉండమని సుమిత్ర చెప్తుంది. మీ లేనిపోని అనుమానాలు వాళ్ళ మీద రుద్ది వాళ్ళ మధ్య దూరం పెంచుతున్నారని చురకలు వేస్తుంది.
కావేరి దగ్గరకు శ్రీధర్
శ్రీధర్ బ్యాగ్ సర్దేసుకుని కావేరీ దగ్గరకు బయల్దేరబోతాడు. అప్పుడే కార్తీక్ తల్లికి ఫీవర్ వచ్చిందని చెప్తాడు. తనకేం కాలేదని ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని అంటుంది. హాస్పిటల్ కి తీసుకుని వెళ్దామని కార్తీక్ అంటే వద్దని ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని శ్రీధర్ ఆపుతాడు.
బ్యాగ్ చూసి ఎక్కడికని అంటే ఆఫీసు పని మీద క్యాంప్ కి వెళ్లాలని అమ్మకు బాగోలేదు కదా అందుకే ఆగిపోదామని అనుకున్నా అని డ్రామా ఆడతాడు. కానీ కాంచన మాత్రం తనకేమి కాలేదని క్యాంప్ కి వెళ్ళమని చెప్తుంది. భార్య మీద తెగ ప్రేమ నటిస్తాడు. అది చూసి కార్తీక్ మురిసిపోతూ మీ మంచితనం మీద పీహెచ్డీ చేయాలని ఉందని అంటాడు.
యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న దీప
నువ్వు రెండు పెళ్ళిళ్ళు చేసుకో అప్పుడు తెలుస్తుందని శ్రీధర్ మనసులో అనుకుంటాడు. దీప నరసింహ మాటలు తలుచుకుంటూ రోడ్డు మీద పరధ్యానంగా నడుస్తుంది. దుర్మార్గుడికి నా బిడ్డను ఇవ్వలేను. ఇవ్వకపోతే వేసిన నింద నిజమవుతుంది. శౌర్య నా ప్రాణం అని బాధపడుతుంది.
అప్పుడే దీపకు ఎదురుగా ఒక కారు వచ్చి డ్యాష్ ఇవ్వబోయి ఆగిపోతుంది. వెనుక నుంచి కార్తీక్ కారు ఉంటుంది. కార్తీక్ కారు దిగి ఆరు అతన్ని తిడతాడు. తప్పు నాదే చూసుకోకుండా కారుకు అద్దం వచ్చానని దీప అంటుంది. ఒకప్పుడు మనం ఎదుర్కొన్న సమస్య వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పడం చాలా సులువు అవుతుందని అంటాడు.
నిజం చెప్పిన కార్తీక్
కార్తీక్ నిజం చెప్పడానికి చూస్తే దీప మాత్ర వినిపించుకోదు. మీ నాన్న చావుకు కారణం నేను కాదు ఈరోజు నీ ప్లేస్ లో మీ నాన్న ఉన్నారు. కారు ఉన్న ప్లేస్ లో నేను ఉన్నానని ఆరోజు జరిగింది చెప్తాడు. కుబేర బండి మీద వస్తూ ఎదురుగా వస్తున్న కార్తీక్ వాళ్ళ కారుకు అతని బండి తగిలి కింద పడిపోతాడు.
తల రాయికి గుద్దుకోవడంతో కార్తీక్ కంగారుగా వస్తాడు. దీప అక్కడే ఉంటుంది. తప్పు అయింది బాబు నేనే చూసుకోలేదని కార్తీక్ తో చెప్పి దీపను పిలుస్తూనే ప్రాణాలు వదిలేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు మీ నాన్న ని ఇతనే కారుతో గుద్ది చంపేశాడని చెప్తారు. కార్తీక్ ఫ్రెండ్స్ తనని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు.
దీప కార్తీక్ ని చూస్తుంది. నాన్న అని మీరు బాధతో అరిచిన అరుపులు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. మీ గురించి తర్వాత ఎంక్వైరీ చేశాను. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను సీసీటీవీ ఫుటేజ్ చూసి నా తప్పేమీ లేదని నన్ను వెళ్లమన్నారు. మిమ్మల్ని కలిసి మీకు క్షమాపణలు చెప్పాలని అనుకున్నాను.
పశ్చాత్తాపడ్డ దీప
మీరు అక్కడికి కాస్త ముందు వస్తే నా తప్పు లేదని మీ నాన్న చెప్పిన మాటలు వినేవాళ్ళు. నేను చేయని తప్పుకు ఒక మనిషి మనసులో దోషిగా మిగిలిపోయాను. మీకు క్షమాపణ చెప్పాను. అందుకే మీరు అర్థం చేసుకోలేదు. ఒక మనిషి చావును అడ్డం పెట్టుకుని అబద్ధాలు చెప్పే మనిషిని కాదు. మీ నాన్న చావుకు కారణం నేను కాదని చెప్తాడు.
శౌర్య అని గట్టిగా అరిచారు ఏమైంది? కారును కూడా చూసుకోకుండా ఏం ఆలోచిస్తున్నారని అడుగుతాడు. జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. ఈ ఇంట్లో రెండు గ్రూపులు ఉన్నాయి. కొందరు నాకు, కొందరు దీపకు సపోర్ట్ చేస్తారు. మీ బావ నీకు కాకుండా దీపకు సపోర్ట్ చేస్తాడని పారిజాతం అంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్