NNS 21st May Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (మే 21) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రామ్మూర్తి, భాగీ తమ నిజాయితీని నిరూపించుకోవడానికి సరస్వతిని వెతకడానికి వెళ్తారు. వాళ్లు సరస్వతిని తీసుకుని వచ్చేలోపు అమర్, పిల్లల్ని ఊర్లో నుంచి తీసుకెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంది మనోహరి.
కానీ పిల్లలు, రాథోడ్ అడగడంతో కాదనలేక వాళ్లు తిరిగి వచ్చేవరకు ఉండడానికి ఒప్పుకుంటాడు అమర్. రామ్మూర్తి, భాగీ ఊరంతా తిరుగుతుండగా సరస్వతి కనపడుతుంది. కానీ వాళ్లు దగ్గరకి వచ్చేలోపు సరస్వతిని తీసుకెళ్లిపోతాడు బాబ్జి.
అక్కడే ఉన్నావిడ సడెన్‌గా ఎలా మాయమైందో అర్థంకాక ఆశ్చర్యపోతారు రామ్మూర్తి, భాగీ. అసలు మనోహరి అమర్ దగ్గర ఎందుకు నటిస్తుందో కావాలని తమని ఎందుకు చెడు చేయాలనుకుందో అర్థంకాక ఆలోచనలో పడతారు. సరస్వతి తనకి దొరికిందని చెప్పడంతో వెంటనే చంపేయమంటుంది మనోహరి.
కానీ మళ్లీ సరస్వతి చనిపోతే ఆమె ఈ ఊరు వచ్చిన విషయం తెలిసిపోతుందని చంపొద్దు వెంటనే ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయమంటుంది. సరేనన్న బాబ్జి వెంటనే సరస్వతిని హాస్పిటల్లో చేర్పించి రాత్రే ఆమె వచ్చేసిందని చెప్పమంటాడు.
సరస్వతి మేడమ్‌ని వెతకడానికి వెళ్లినవాళ్లు రాకపోవడంతో హైదరాబాద్ వెళ్లేందుకు బయల్దేరతారు అమర్, పిల్లలు. ఇంకాసేపు వేచి ఉందాం అని రాథోడ్ ఎంత బతిమాలినా వినకుండా కారు తీయమంటాడు. అప్పుడే రామ్మూర్తి, భాగీ ఇంటికి వచ్చి ఏమైంది, ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతారు. మిమ్మల్ని నమ్మి ఇప్పటివరకు వెయిట్ చేశాం. ఇంకా నీ మాటలు నమ్మి ఉండలేను అంటాడు అమర్.
అదే అదనుగా మనోహరి.. భాగీ, రామ్మూర్తిని నానామాటలు అంటుంది. నేను, మా నాన్న అబద్ధం చెప్పారనుకుంటున్నారా? అని అడుగుతుంది భాగీ. అవును అంటుంది మనోహరి. నేను అడుగుతుంది ఆయనను.. నిన్ను కాదు అంటుంది భాగీ. కానీ నేను మాట్లాడుతుంది నీతోనే.. అమర్‌కి నీకు అబద్ధం చెప్పే అవసరం లేదు అంటుంది మనోహరి.
ఆయనే సమాధానం చెప్పాలి అంటుంది భాగీ. అవసరం లేదు అంటున్న మనోహరిని.. తాళి కట్టిన భర్తగా నా మాటకి సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఆయనకు ఉంది, కానీ మా మధ్యకు వచ్చి మాట్లాడే హక్కు నీకు లేదు అంటుంది భాగీ. చూశావా అమర్ నీముందే నన్ను ఎన్ని మాటలు అంటుందో అని నటిస్తుంది మనోహరి. మోసం చేసి పెళ్లి చేసుకున్న నీకు బాధ్యత, హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదు అంటాడు అమర్.
ఇంకా వాదన అనవసరం అని బయల్దేరతాడు అమర్. అప్పుడే డాక్టర్ ఫోన్ చేసి సరస్వతి రాత్రి నుంచి హాస్పిటల్లోనే ఉందని చెప్పడంతో భాగీ అబద్ధం చెప్పిందని నమ్మి అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతారు అమర్, పిల్లలు. రామ్మూర్తి ఎంత బతిమాలినా వినకుండా తనని నమ్మని ఇంటికి తానూ వెళ్లనని అంటుంది భాగీ.
చిత్రగుప్తతో మాట్లాడి ఇంకొన్నాళ్లు తనకు సమయం కావాలంటుంది అరుంధతి. కానీ ఎట్టిపరిస్థితుల్లో సూర్యాస్తమయానికి మా లోకానికి వెళ్లాలి అంటాడు గుప్త. లేదు గుప్తగారు ఒక చెల్లిగా మిమ్మల్ని అర్తిస్తున్నా నాకు ఇంకొన్నాళ్లు నాకు సమయం ఇవ్వండి అంటుంది అరుంధతి. అన్న అని పిలిచి నా చేతులు కట్టేశావు నీ మాట తీసేయకుండా మరొక్క రోజు మాత్రం నీకు సమయం ఇస్తానంటాడు గుప్త. జరుగుతున్నదంతా చూసి బాధపడుతుంది అరుంధతి. మనోహరి మాయమాటలు నమ్మి అమర్ భాగీ పట్ల ప్రవర్తించే తీరుకి బాధపడుతుంది.
ఇంటికి వచ్చిన అమర్‌ని మిస్సమ్మ ఏదని, ఇంకో రెండు రోజులు ఉండకుండా ఎందుకు వచ్చేశారు అని అడుగుతుంది నిర్మల. ఆ తండ్రీకూతుళ్ల మోసాన్ని గుర్తించి ఆ బంధాన్ని వదులుకుని వచ్చేశాడని చెబుతుంది మనోహరి. నువ్వు ఈ ఇంటికోడలి గురించి మాట్లాడుతున్నావ్ మనోహరి అది గుర్తుంచుకో అంటుంది నిర్మల. మిస్సమ్మ ఎప్పటికీ ఈ ఇంటికోడలు కాలేదమ్మా అంటాడు అమర్. సరస్వతి విషయంలో భాగీ తప్పు లేదని అమర్‌కి తెలుస్తుందా? మిస్సమ్మ ఎలా తన నిజాయితీని నిరూపించుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు మే 21న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్