Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. ప్రమాదంలో శౌర్య, నరసింహ కంటపడిన పాప.. కూతురు జాడ దీప తెలుసుకోగలుగుతుందా?
Karthika deepam 2 serial today july 16th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ కోసం శౌర్య రోడ్డు మీదకు వచ్చేస్తుంది. నరసింహ కంట పడుతుంది. పాపను ఎలాగైనా ఇంటికి తీసుకుని వెళ్లాలని నరసింహ శౌర్య వెంట పడతాడు.
Karthika deepam 2 serial today july 16th episode: ఏ ఒక్కరి కంట్లో కన్నీటి చుక్క రాకుండా పెళ్ళిని ఎలా ఆపాలి అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. కుటుంబం కోసం జ్యోత్స్న విషయంలో ఎవరు ఏమన్నా నవ్వుతూ వెళ్లిపోయాను కానీ నా బాధ మొహంలో చూపించలేదు. అప్పుడు గొప్ప పని చేశాను అనుకున్నాను కానీ అదే ఇప్పుడు నాకు నిద్రపట్టకుండా చేస్తుంది.
ఊరు వెళ్లిపోవాలి
నిశ్చితార్థం ఎలా ఆపాలి?అని ఆలోచిస్తాడు. శౌర్య దీపను ఇల్లులు మారుస్తున్నావంటూ తిడుతుంది. రోడ్డు మీద కారు వెళ్తుంటే సౌండ్ విని కార్తీక్ వచ్చాడెమో అనుకుంటుంది. దీప కూతురు మనసు మార్చేందుకు ప్రయత్నిస్తుంది. మన కోసం ఎవరు రారు. నీమీద ప్రేమ ఉంటే నీ ఫ్రెండ్ ఎప్పుడో వచ్చేవాడు. రాలేదంటే వాళ్ళు మనల్ని మర్చిపోయినట్టే.
ఇక ఎవరి గురించి ఎదురుచూడకు. మన ఇంటికి ఎవరు రారు అనేసరికి శౌర్య బాధగా వెళ్ళిపోతుంది. ఇక్కడే ఉంటే నీకు కార్తీక్ గుర్తుకు వస్తున్నాడు. అందుకే నేను నిన్ను తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోయి పాత జీవితాన్ని మొదలుపెడతాను. అప్పుల వాళ్ళు వస్తే నరసింహ అడ్రస్ తెలుసు కదా వాళ్ళను అక్కడికే పంపించేస్తానని అనుకుంటుంది.
జీవితం గురించి మాట్లాడాలి
కాంచన నిశ్చితార్థానికి సంబంధించి లిస్ట్ రాస్తుంది. కార్తీక్ ఈరోజు ఎలాగైనా నిశ్చితార్థం ఆపాలని అందుకే వెళ్తున్నానని అనుకుంటాడు. తల్లి దగ్గర ఆశీస్సులు తీసుకుని వెళతాడు. శౌర్య మళ్ళీ గోడ మీద కార్తీక పేరు చూస్తూ బాధపడుతుంది. దీప బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతుంది.
జ్యోత్స్న తన ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉండగా కార్తీక్ వస్తాడు. వాళ్ళు కార్తీక్ ని బావ అని పిలుస్తారు. అత్తతో మాట్లాడాలని అంటే ఇంట్లో లేదని బయటకు వెళ్ళిందని చెప్తుంది. ఏం మాట్లాడాలి ఏదైనా అర్జెంటా అంటే అవును అంటాడు. నా జీవితం గురించి మాట్లాడాలి అనేసరికి జ్యోత్స్న డౌట్ గా అడుగుతుంది.
దీప బయట నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో శౌర్య ఉండదు. దీంతో కంగారుగా దీప ఇంటి చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది. కార్తీక్ కోసం ఇల్లు వెతుక్కుంటూ వెళ్లిపోయిందేమోనని టెన్షన్ పడుతుంది. శౌర్య రోడ్డు మీద కార్తీక్ కారు కనిపిస్తుందేమోనని వెతుకుతూ ఉంటుంది.
రోడ్డు మీదకు వచ్చిన శౌర్య
అమ్మ బయటకు వెళ్ళింది తను వచ్చేలోపు ఎలాగైనా కార్తీక్ ని కలిసి ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది. రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరినీ కార్తీక్ ఇల్లు ఎక్కడో తెలుసా అని అడుగుతూ ఉంటుంది. ఎవరిని అడిగినా తెలియదని చెప్తారు. అప్పుడే రోడ్డు మీద నరసింహ వెళ్తుంటే శౌర్య కనిపిస్తుంది.
శౌర్య నీ కూతురని అనసూయ చెప్పిన మాట నరసింహ గుర్తు చేసుకుంటాడు. అమ్మ చెప్పింది నిజమే దీన్ని కాపాడటం కోసం కార్తీక్ అబద్ధం చెప్పి ఉంటాడు. శౌర్య నరసింహను చూసి బూచోడు ఎత్తుకుపోతాడని భయపడి పారిపోతుంది. నేను బూచోడిని కాదు మీ నాన్నను అంటూ నరసింహ వెంట పడతాడు.
నరసింహ కంట పడిన శౌర్య
శౌర్య పరిగెడుతూ వెళ్ళి నరసింహ నుంచి తప్పించుకుంటుంది. అంతా వెతుకుతాడు కానీ ఎక్కడ కనిపించదు. కార్తీక్ కోసం వస్తే ఈ బూచోడు వచ్చాడు ఏంటి అమ్మ కూడా లేదు నన్ను ఎత్తుకుపోతాడు ఏమోనని భయపడిపోతుంది. ఎలాగైనా శౌర్యను పట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లాలని అనుకుంటాడు.
ఫోన్ రావడంతో నరసింహ శౌర్యను వదిలేసి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోవడం చూసి శౌర్య ఊపిరి పీల్చుకుంటుంది. బూచోడు వెళ్ళిపోయాడు కార్తీక్ కార్తీక్ అంటూ ఏడుస్తుంది. అటు దీప శౌర్య కోసం రోడ్డు మీద అందరినీ అడుగుతూ వెతుకుతుంది. శౌర్య కోసం దీప కుమిలి కుమిలి ఏడుస్తుంది.
కార్తీక్ బాబు కోసం వెళ్ళి నువ్వు ఎక్కడ తప్పిపోయి తిరుగుతున్నావ్ ఏంటోనని దీప చాలా ఏడుస్తుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్