Karthika deepam 2: కార్తీక దీపం 2 సీరియల్, కాంచనతో పెళ్లి ఇష్టం లేదని చెప్పలేక తనలో తానే కుమిలిపోతున్న కార్తీక్-karthika deepam 2 serial today july 15th episode karthik cant say that he doesnt want to marry kanchana ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియల్, కాంచనతో పెళ్లి ఇష్టం లేదని చెప్పలేక తనలో తానే కుమిలిపోతున్న కార్తీక్

Karthika deepam 2: కార్తీక దీపం 2 సీరియల్, కాంచనతో పెళ్లి ఇష్టం లేదని చెప్పలేక తనలో తానే కుమిలిపోతున్న కార్తీక్

Haritha Chappa HT Telugu
Jul 15, 2024 09:22 AM IST

Karthika Deepam 2 Serial Latest Episode: కార్తీక్ కు జ్యోత్స్సతో పెళ్లి ఇష్టం లేదని తల్లికి, తండ్రికి చెప్పాలనుకుంటాడు. కానీ తల్లి మాటలు విన్నాక తన మనసులోని మాట చెప్పలేకపోతాడు.

కార్తీక దీపం సీరియల్
కార్తీక దీపం సీరియల్ (Hotstar/starmaa)

Karthika Deepam 2 Latest Episode: తనకు జ్యోతి నిశ్చితార్థం ఇష్టం లేదని కార్తీక్ తల్లికి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ లోపు కాంచన... ఫోన్లో తన స్నేహితులతో మాట్లాడుతూ కనిపిస్తుంది. కార్తీక్ నిశ్చితార్థం గురించి ఆమె చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూశాక కార్తీక్ తల్లి కన్నా తండ్రికి నిశ్చితార్థం ఇష్టం లేదనే విషయం చెప్పాలనుకుంటాడు. తండ్రి ద్వారా తల్లితో చెప్పించి నిశ్చితార్ధాన్ని ఆపాలి అనుకుంటాడు. అయితే అది వీలు కాదు. రెస్టారెంట్ ఓపెనింగ్ పేరు చెప్పి నిశ్చితార్ధాన్ని వాయిదా వేయాలని ప్రయత్నించవద్దని కచ్చితంగా చెప్పేస్తుంది కాంచన.

yearly horoscope entry point

కాంచన ఎమోషనల్

కార్తీక్ తో మాట్లాడుతూ తన అవిటితనం గురించి బాధపడుతూ ఉంటుంది కాంచన. తనకు కాళ్ళే ఉంటే కొడుకు పెళ్లి బాధ్యతలు భుజాన వేసుకొని క్షణం తీరిక లేకుండా పనులు చేస్తూ హడావిడిగా ఉండే దాన్నని, కానీ దేవుడు తనకు అదృష్టం ఇవ్వలేదని బాధపడుతుంది. అయితే తను ఏ రోజు కోసం ఆశగా ఎదురు చూశానో ఆ రోజు ఇప్పుడు వస్తోందని కాళ్లు లేకపోయినా చేతులు ఉన్నాయని, తన ముచ్చట తీర్చుకుంటానని చెబుతుంది. కొడుకు పెళ్లిలో ఏది మిస్ అవ్వకుండా తన కళ్ళతో చూసి సంతోషపడతానని కార్తీక్ తో అంటుంది. తన అవితితనం తలుచుకొని ఎప్పుడూ బాధపడలేదు అని ఎమోషనల్ అవుతుంది. అది చూశాక కార్తీక్ తన మనసులో సంతోషంగా ఉన్న తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదని ఎలా చెప్పడం కరెక్ట కాదని, నాన్నతో చెప్పడమే మంచిది అనుకుంటాడు .

దీప, శౌర్య దగ్గరకు వస్తే శౌర్య గోడమీద మళ్ళీ కార్తీక్ పేరు రాస్తుంది. ఆ పేరు దగ్గరే కూర్చుని ఉంటుంది. దీపా శౌర్యకు పులిహోర చేసి తినిపించడానికి వెళుతుంది. శౌర్య తాను అలిగానని తనతో మాట్లాడవద్దని చెబుతుంది. కార్తీకదీపం పులిహార తింటానని అంటుంది. దీప వాళ్లతో మనకి సంబంధం లేదని శౌర్యతో చెబుతుంది. దానికి శౌర్య, కార్తీక్ ఇంటికి వెళ్ళనివ్వడం లేదని రోడ్డు మీద కనిపించిన మాట్లాడనివ్వడం లేదని తల్లి పై కోప్పడుతుంది. మళ్ళీ వారి కుటుంబంలోకి వెళ్లి ఎవరి సంతోషాలు దూరం చేయలేనని దీప తనలో తాను అనుకుంటుంది.

అనసూయ, శోభ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అనసూయ దీప గురించి మాట్లాడుతూ ... దీప పీకలదాకా కోపంతో ఉందని ఆమె దగ్గరికి వెళ్లి రెచ్చగొట్టినట్టు మాట్లాడితే ఊరుకుంటుందా, అందుకే రెండు దెబ్బలు వేసిందని మాట్లాడుతుంది. దానికి శోభ పెళ్ళాన్ని తగ్గించడానికి వెళ్లి, నువ్వు కూడా తన్నులు తిని వచ్చావు, నువ్వేం మగాడివయ్యా అంటూ నరసింహతో అంటుంది. దానికి అనసూయ నువ్వు ఇలాగే వాడిని రెచ్చ రెచ్చగొట్టు... పోయినసారి నీ రెండు చెంపలు వాయించింది, ఈసారి వీధిలో జుట్టు పట్టుకుని లాక్కెళ్తుంది అని హెచ్చరిస్తుంది. దానికి శోభ అంతవరకు వస్తే ఊరుకుంటానా? మా అమ్మని రంగంలోకి దింపుతాను అంటుంది. వెంటనే అనసూయ దాని ఆవేశం తెలిసి కూడా ఇలాగే రెచ్చగొడితే నీ మొగుడిని కూడా నిజంగానే చంపేస్తుంది, కూతుర్ని కార్తీక్ కు అప్పగించి జైలుకు వెళ్ళిపోతుంది, అందరికీ దూరంగా బతుకుతుంది.... కాబట్టి దీప జోలికి ఎవరూ వెళ్లదు అని హెచ్చరిస్తుంది. దానికి శోభ ‘అయితే ఇక బిడ్డ రాదా, నేను మా చుట్టాల్లో ఎవరు ఒక బిడ్డను పెంచుకుంటాను’ అని అంటుంది. వెంటనే అనసూయ ‘ఎవరి బిడ్డో.. వాడికి బిడ్డ ఎలా అవుతుంది? వాడికి కూతురు ఉంది కదా, అది నీకు కూతురు అవుతుంది... కొద్ది రోజులు ఓపిక పట్టు’ అని మాట్లాడుతుంది

జ్యోత్స్న ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుంది. నిశ్చితార్థం గురించి వారు మాట్లాడుకుంటూ ఉంటారు. నిశ్చితార్థం డ్రెస్సులు గురించి మాట్లాడుతూ ఉంటారు. బావకు తానే డ్రెస్ డిజైన్ చేస్తానని జ్యోత్స్న అంటుంది. ఇక శివనారాయణ దీప గురించి అడుగుతాడు. జ్యోత్స్న దీప ఏదో ప్లాన్ చేస్తుందని అనుకొని తన నిశ్చితార్థానికి దీప ఉండాలని అంటుంది.

శౌర్య, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. శౌర్య దీపతో... అమ్మమ్మ నీతో ఏం చెప్పిందని అడుగుతుంది. దానికి దీప కార్తీక్, జ్యోత్స్నకు పెళ్లి చేస్తారని అంటుంది. దానికి శౌర్య మనం కూడా వెళ్తామా అని ప్రశ్నిస్తుంది.

మరోవైపు కార్తీక్ నిశ్చితార్థం ఎలా ఆపాలా? అని ఆలోచిస్తూ ఉంటాడు జోత్స్నకు కు చెబితే మంచిదేమో అనుకుంటాడు. కానీ గతంలో జ్యోత్స్న ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన విషయం గుర్తొచ్చి చెప్పలేక ఆగిపోతాడు. అంతే ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది

Whats_app_banner