Karthika deepam 2 serial july 13th: నిశ్చితార్థానికి దీప ఉండాలన్న జ్యోత్స్న.. ఎలాగైన వెతికి తీసుకొస్తానన్న పారిజాతం
Karthika deepam 2 serial today july 13th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తన నిశ్చితార్థం దీప కళ్ల ముందే జరగాలని జ్యోత్స్న పారిజాతంతో చెప్తుంది. ఎలాగైనా తనని వెతికి పట్టుకుని తీసుకొస్తానని పారు మనవరాలికి మాట ఇస్తుంది.
Karthika deepam 2 serial today july 13th episode: కార్తీక్, జ్యోత్స్న నిశ్చితార్థానికి తప్పనిసరిగా రావాల్సిందేనని సుమిత్ర పిలుస్తుంది. తాను రాలేనని దీప అంటుంది. అది నీ ఇష్టం నేను అయితే నువ్వు వస్తావనే ఆశతో ఉన్నానని వెళ్ళిపోతుంది. శౌర్య వచ్చి అందరూ వచ్చారు కార్తీక్ ఎందుకు రాలేదని అడుగుతుంది.

ఎలా ఉన్నావ్ రౌడీ
నాకేలా తెలుస్తుందని దీప బాధగా అంటుంది. కార్తీక్ వచ్చి ఉంటే బాగుండేది నేను అసలు గుర్తు ఉన్నానా అని అనుకుంటుంది. కార్తీక్ దీప ఉన్న అవుట్ హౌస్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న బుక్ మీద శౌర్య పేరు చూసి ఎలా ఉన్నా రౌడీ నిన్ను ఒకసారి చూడాలని అనిపిస్తుందని అంటాడు.
ఇంట్లో డబ్బులు డబ్బాను చూస్తాడు. అందులో డబ్బులతో పాటు లెటర్ ఉంటుంది. మీరు ఇచ్చిన గడువులోగా మీ డబ్బు మీకు అందుతుందని రాసి ఉంటుంది. మరీ ఇంత మొండితనం ఏంటని అనుకుంటాడు. మరీ ఇంత ఆత్మాభిమానం పనికిరాదు. ఎవరిని నొప్పించకూడదని నువ్వు వెళ్లిపోయావు, ఎవరిని బాధపెట్టకూడదని నేను ఇంతవరకు తెచ్చుకున్నాను.
మీ అమ్మ చనిపోవడం ఖాయం
పారిజాతం కార్తీక్ దగ్గరకు వస్తుంది. ఈ పెళ్లి జరగదని కార్తీక్ గట్టిగా అంటాడు. ఈ పెళ్లి జరగపోతే మీ అత్త ఛీ కొట్టడం, జ్యోత్స్న చావడం, ఇల్లు ముక్కలు కావడం ఎంత నిజమో మీ అమ్మ చనిపోవడం కూడా అంతే నిజమని అంటుంది. నీకు జ్యోత్స్న మెడలో తాళి కట్టడం తప్ప వేరే దారి లేదు. అందరికీ నీ గురించి అబద్ధం చెప్పానని చెప్తుంది.
నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుందని అంటాడు. నీ నిర్ణయం ఇంతకముందే ఇంట్లో చెప్పి ఉంటే వాళ్ళు ఆలోచించే వాళ్ళు కానీ బాగా లేట్ అయిపోయింది నా మాట విని జ్యోత్స్నను పెళ్లి చేసుకో అంటుంది. అప్పుడే సుమిత్ర వాళ్ళు ఇంటికి వస్తారు. దశరథ వాళ్ళ దగ్గర పారిజాతం కార్తీక్ ని ఇరికిస్తుంది.
మీరు ఎప్పుడు వస్తారా? ముహూర్తాలు ఎప్పుడు పెడతారా? శుభవార్త విందామా అని ఎదురుచూస్తున్నాడని చెప్తుంది. నిశ్చితార్థం వచ్చే గురువారం పెట్టారు. ఆరోజే పెళ్లి ముహూర్తం చెప్తారని సుమిత్ర చెప్తుంది. ఈ విషయం నా మనవరాలికి తెలిస్తే ఎగిరి గంతేస్తుందని పారిజాతం ఉబ్బితబ్బిబ్బయిపోతుంది.
దీప కనిపించింది
జ్యోత్స్న అప్పుడే బయట నుంచి వస్తుంది. పారిజాతం సంతోషంగా తన దగ్గరకు వెళ్ళి ముద్దు పెట్టి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుని వచ్చారని చెప్తుంది. పారు మరీ శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తుందని కార్తీక్ తిట్టుకుంటాడు. కార్తీక్ ముభావంగా వెళ్లిపోతుంటే సుమిత్ర ఆపుతుంది.
గుళ్ళో దీప కనిపించిందని చెప్తుంది. జ్యోత్స్న కూడా వాళ్ళ మాటలు వింటుంది. నేను ఏం మాట్లాడినా అడిగినా ఎప్పుడో వెళ్తానని అన్నాను కదా అది ఇప్పుడే అయ్యిందని అంటుంది. కానీ నిజం అది కాదని అనిపిస్తుంది. మనకు తెలియనిది తన జీవితంలో ఏదో జరిగింది.
నరసింహ ఇక్కడ ఉండొద్దని బెదిరించి ఉంటాడు. లేదంటే ఇంకేదో జరిగిందని అనుమానపడుతుంది. మనిషిని చూస్తే చాలా బాధగా ఉంది. ఇదంతా నీకెందుకు చెప్తున్నాను అంటే ఇక నువ్వు తన కోసం వెతకాల్సిన పని లేదు. రావాలనుకుంటే వస్తుంది లేదంటే లేదు అంటుంది.
నన్ను పెళ్లి చేసుకోవడం బావకు ఇష్టం లేదా?
శౌర్య మళ్ళీ కార్తీక్ జపం మొదలుపెడుతుంది. దీప వాళ్ళు వెళ్తున్న ఆటో పక్క నుంచి కార్తీక్ కారు వెళ్తుంది. శౌర్య చూసి కార్తీక్ ఆగు నేను ఆటోలో ఉన్నానని అంటుంది. దీప తిడుతుంది. దీంతో శౌర్య కూడా కోప్పడుతుంది. మనం ఎంత వెతికినా దీప కనిపించకపోతే ఊరు వదిలి వెళ్ళిందని అనుకున్నాను కానీ ఇక్కడే ఉందని జ్యోత్స్న అంటుంది. బావను చూస్తే ఏదో డౌట్ వస్తుంది.
జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని బావ నీతో ఎప్పుడైనా చెప్పాడా అని జ్యోత్స్న పారిజాతాన్ని అడుగుతుంది. నీకు ఆ అనుమానం వచ్చిందని అంటుంది. ఇక్కడ అందరూ మహానటులే. శౌర్యకు నేనే కన్నతండ్రిని అని బావ ట్విస్ట్ ఇచ్చాడు. అది కన్ఫామ్ చేసుకుందామని అనుకుంటే దీప వెళ్ళిపోయింది.
నిశ్చితార్థానికి దీప ఉండాలి
ఊరంతా వెతికినా నాకు కనిపించలేదు. కానీ అమ్మకు గుడిలో కనిపించింది. నాకు ఇప్పుడు బావను పెళ్లి చేసుకోవడమే ఇంపార్టెంట్. కానీ నా జాతకం ఎలా ఉందంటే దీప ఉంటేనే నా నిశ్చితార్థం జరిగేలా ఉందని అంటుంది. దీప ఎక్కడ ఉన్నా నేను వెతికి పట్టుకుంటాను.
సుమిత్ర అడిగిన ప్రశ్నకు సమాధానం మనకు తెలుసు. అది అడ్డం పెట్టుకుని దీపను ఇంటికి తీసుకొస్తానని పారిజాతం అంటుంది. ఎంగేజ్ మెంట్ కి ఒక్కరోజు ముందైన దీప ఇంట్లో ఉండాలి. తన కళ్ళ ముందే బావకు నాకు ఎంగేజ్ మెంట్ జరగాలని జ్యోత్స్న చెప్తుంది. అలా చేయడం తన బాధ్యత అని పారిజాతం చెప్తుంది.
కాంచన సంతోషంగా అందరికీ ఫోన్ చేసి కొడుకు నిశ్చితార్థం గురించి ఫోన్లో మాట్లాడుతుంది. కార్తీక్ అప్పుడే వస్తాడు. అమ్మతో అయినా నిజం చెప్పాలని అనుకుంటాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
టాపిక్