Shadashtaka yogam: అశుభకరమైన షడష్టక యోగం వచ్చేసింది.. ఆగస్ట్ 16 వరకు వీరి జీవితంలో ఆర్థిక సమస్యలు
Shadashtaka yogam: ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. శని ప్రభావం కర్కాటక రాశి మీద ఉంటుంది. సూర్యుడు, శని గ్రహాలు కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరిచాయి. ఇది కొన్ని రాశుల జీవితాల్లో చాలా కష్టాలను తెస్తుంది.
Shadashtaka yogam: గ్రహాల రాజు సూర్యుడు 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుని సంచారాన్ని సంక్రాంతి అంటారు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన జూలై 16న కర్కాటక సంక్రాంతిని జరుపుకుంటారు. ఆగస్ట్ 16 వరకు సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటాడు.
సూర్యుడి సంచారము, శని దాని మూలత్రికోణ రాశిచక్రం కుంభ రాశిలో ఉండటం వల్ల షడష్టక యోగం ఏర్పడింది. ఈ రెండు గ్రహాల మధ్య తండ్రీ కొడుకుల బంధం ఉందని చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, శని ఒకరికొకరు ఆరు, అష్టమ గృహాలలో ఉన్నప్పుడు షడష్టక యోగం ఏర్పడుతుంది. సూర్యుడు-శని ద్వారా ఏర్పడిన షడష్టక యోగం జ్యోతిష్యశాస్త్రంలో అశుభమైనదిగా పరిగణిస్తారు. షడష్టక యోగం ఏర్పడటం వల్ల ఏ రాశి వారి జీవితంలో అలజడి రేగుతుంది. ఎలాంటి సమస్యలు ఎదురుకాబోతున్నాయో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి షడష్టక యోగం మంచిది కాదు. ఈ కాలంలో మీ విశ్వాసం, ధైర్యం తగ్గుతుంది. డబ్బుకు సంబంధించిన ఎలాంటి రిస్క్ తీసుకోకండి లేకపోతే ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. మీరు మీ ఉద్యోగంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆగస్ట్ 16 వరకు ఈ యోగం వల్ల కష్టాలు ఉంటాయి.
సింహ రాశి
సూర్యుడు సింహ రాశికి అధిపతి. అయినప్పటికీ సూర్యుడు-శని ద్వారా ఏర్పడిన షడష్టక యోగం సింహ రాశి వారికి ఆర్థిక సవాళ్లను తెచ్చిపెడుతుంది. మీరు కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఇంట్లో ఘర్షణ వాతావరణం కారణంగా అశాంతి నెలకొంటుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. దాని వల్ల ఇద్దరి మధ్య తగాదాలు జరిగే అవకాశం ఉంది.
కన్యా రాశి
కన్యా రాశి వారికి సూర్యుడు, శని వల్ల ఏర్పడే యోగం అశుభ ఫలితాలు ఈషతునది. షడష్టక యోగం ప్రభావం వల్ల శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. కార్యాలయంలో జరిగే రాజకీయాలకు మీరు బలి అయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో డబ్బుకు సంబంధించి ఎలాంటి రిస్క్ తీసుకోకండి, లేకుంటే ఆర్థిక నష్టం జరగవచ్చు. గౌరవం, ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ కాలం హెచ్చు తగ్గులతో కూడి ఉంటుంది. ఈ సమయంలో ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఉండటమే మంచిది. లేకుంటే మీరు కోర్టుకు వెళ్లవలసి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఆఫీసులో ఇబ్బందులు తప్పవు.
కుంభ రాశి
శని, సూర్యునిచే ఏర్పడిన షడష్టక యోగం కుంభ రాశి వారికి అశుభం. ఈ సమయంలో మీరు అనవసర వివాదాల్లో చిక్కుకోవచ్చు. గాయాలు సంభవించవచ్చు. మీరు కొన్ని ఇబ్బందుల్లో పడవచ్చు. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏ కొత్త పనిని ప్రారంభించవద్దు. అది శుభ ఫలితాలు ఇవ్వకపోవచ్చు.
ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.