Shadashtaka yogam: సూర్యుడు, శని వల్ల షడష్టక యోగం.. వీరికి కష్టకాలం, ఆర్థిక సమస్యలు వస్తాయి
Shadashtaka yogam: సూర్యుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు దాని మీద శని ప్రభావం కూడా ఉంటుంది. దీని వల్ల షడష్టక యోగం ఏర్పడబోతుంది. ఇది అశుభమైన యోగంగా చెప్తారు.
Shadashtaka yogam: ప్రస్తుతం సూర్య దేవుడు మిథున రాశిలో సంచరిస్తున్నప్పటికీ మరికొద్ది రోజుల్లోనే తన రాశి మారుతున్నాడు. సూర్యుడు నెలకు ఒకసారి రాశిని మార్చుకుంటాడు. సూర్య భగవానుడు జూలై 16 నుండి మిథునం నుండి కర్కాటక రాశికి మారనున్నారు. సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి వెళ్లడం వల్ల అనేక రాశుల వారికి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
కర్కాటక రాశిలోకి సూర్యుడి సంచారము జూలై 16, 2024 రాత్రి 11:08 గంటలకు జరుగుతుంది. దీన్ని కర్కాటక సంక్రాంతి అంటారు. సూర్యుడు శక్తికి ప్రధాన వనరు. అందుకే దీనిని గ్రహాల రాజు అంటారు. ఇది మాత్రమే కాదు ఈ సమయంలో సూర్యుడు, శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. జ్యోతిషశాస్త్రంలో ఇది చాలా అశుభకరమైన యోగంగా పరిగణిస్తారు. వాస్తవానికి శని ప్రస్తుతం కుంభ రాశిలో ఉంది. ఈ రెండు గ్రహాలు ఆరు, ఎనిమిదో గృహాలలో సంచరిస్తారు. దీని వల్ల అనేక రాశుల వారికి ఇబ్బందులు కలిగించే షడష్టక యోగం ఏర్పడుతోంది. ఈ యోగం ప్రభావంతో ఏ రాశుల వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో చూద్దాం.
వీరికి కష్టాలు
కర్కాటక రాశిలో సూర్యుడి సంచారము వృషభ రాశి వారికి బాగుంటుంది కానీ షడష్టక యోగం వల్ల కొందరిలో ఆందోళనలు పెరగవచ్చు. మీరు సమాజంలో గౌరవం పొందుతారు. ఈ విధంగా కర్కాటక రాశి వారికి శక్తి పెరిగి కోపం తగ్గుతుంది.
ఇది కాకుండా తుల, కన్యా రాశుల వారికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశుల వారి ఆదాయం రెట్టింపు అవుతుంది. అయితే మీరు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. షడష్టక యోగం అనుకూల ఫలితాలు ఇవ్వకపోవచ్చు. జూలై 16 నుండి ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. అనంతరం సూర్యుడు సింహ రాశిలోకి వెళ్లడం మంచి రోజులు వస్తాయి.
ఈ షడష్టక యోగం కుంభం, మీన రాశి వారి జీవితంలో కూడా చాలా మార్పులను తీసుకువస్తోంది. మీరు విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. డబ్బు విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండండి.
ఈ రాశులకు లాభాలే
మేషం, మిథునంతో సహా రెండు రాశుల వారికి శుభ ఫలితాలు చేకూరతాయి. సూర్యుడి సంచారం వల్ల వ్యాపారస్థులకు లాభదాయకమైన కాలంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి పొందే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారు. కష్టానికి తగిన ప్రశంసలు పొందుతారు. ఉన్నతాధికారుల నమ్మకాన్ని పొందగలుగుతారు. అందువల్ల మనసు చాలా సంతోషంగా ఉంటుంది. సంపదను కూడబెట్టడంతో కూడా విజయం సాధిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.