Mahalakshmi rajayogam: 18 సంవత్సరాల తర్వాత మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి ఆదాయం వృద్ధి
Mahalakshmi rajayogam: సుమారు 18 సంవత్సరాల తర్వాత మేష రాశిలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఇది అత్యంత పవిత్రమైనది. దీని ప్రభావంతో మూడు రాశుల వారికి ఆదాయం వృద్ధి ఉంటుంది.
Mahalakshmi rajayogam: గ్రహ సంచారం మానవుడి జీవితం మీద సానుకూల ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఒక రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల కలయిక జరగడం వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. జులై నెలలో అనేక గ్రహాలు రాశులను మార్చుకోవడం వల్ల అలాంటి యోగం ఒకటి ఏర్పడింది. అదే మహాలక్ష్మీ రాజయోగం.
వేద జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడు, చంద్రుడు ప్రతి వ్యక్తి జీవితాలను ప్రభావితం చేసే శక్తి ఈ రెండు గ్రహాలకు ఉంది. ఇవి రెండు వ్యతిరేక స్వభావం కలిగిన గ్రహాలు. ప్రస్తుతం కుజుడు మేష రాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా ఇదే రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల శుభకారమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. సుమారు 18 సంవత్సరాల తర్వాత ఈ యోగం ఏర్పడిందని పండితులు చెబుతున్నారు. చంద్రుడు, కుజుడి కలయిక ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే సమాజంలో కీర్తిని పెంచుతుంది. దీని ప్రభావం పన్నెండు రాశుల మీద విభిన్న ప్రభావాలు ఇచ్చినప్పటికీ మూడు రాశుల వారికి మాత్రం అపారమైన ఆర్థిక ప్రయోజనాలు తీసుకొస్తుంది. అవి ఏ రాశులకో చూసేయండి.
మేష రాశి
చంద్రుడు, కుజుడు రెండు వేర్వేరు స్వభావాలు కలిగిన గ్రహాలు. వీటి వల్ల ఏర్పడిన మహాలక్ష్మీ రాజయోగం మేష రాశిలో జరిగింది. ఇది ఈ రాశి వారికి చాలా శుభప్రదమైనది. ఈ రాశి లగ్న గృహంలో రాజయోగం ఏర్పడింది. ఫలితంగా వృత్తిలో పురోగతి ఉంటుంది. వ్యాపారవేత్తలు మంచి లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. సమాజంలో గౌరవ, ప్రతిష్ఠలు పెరుగుతాయి. డబ్బు సంపాదించడంతో పాటు ఆదా కూడా చేసుకుంటారు. పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
మహాలక్ష్మీ రాజయోగం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి ఐదో ఇంట్లో రాజయోగం ఏర్పడింది. ఈ కాలంలో జీవనోపాధి చాలా బాగుంటుంది. విజయవంతమైన ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా లాభపడతారు. వాహనం లేదా ఆస్తి కొనుగోలు జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తెలివితేటలు, నైపుణ్యాలు మెరుగుపడతాయి. వివిధ వనరుల నుంచి డబ్బు సంపాదించేందుకు పుష్కలమైన అవకాశాలు లభిస్తాయి.
తులా రాశి
తులా రాశి వారికి మహాలక్ష్మీ రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి ఏడో ఇంట్లో ఇది ఏర్పడుతుంది. దీని కారణంగా గొప్ప ఆర్థిక లాభాలు వస్తాయి. వైవాహిక జీవితంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. సమాజంలో గౌరవ, ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. ఆనందంగా జీవిస్తారు. వ్యాపారాలు విస్తరించుకుంటారు. మీ కృషితో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం భారీ లాభాలను ఇస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.