Saturn retrograde: శని తిరోగమనంతో అరుదైన రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి స్వర్ణ కాలం-saturn retrograde create rare raja yogam three zodiac signs get golden days ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Retrograde: శని తిరోగమనంతో అరుదైన రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి స్వర్ణ కాలం

Saturn retrograde: శని తిరోగమనంతో అరుదైన రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి స్వర్ణ కాలం

Gunti Soundarya HT Telugu

Saturn retrograde: కుంభ రాశిలో శని తిరోగమన స్థానం అరుదైన రాజయోగాన్ని సృష్టించింది. ఈ రాజయోగం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి.

శని తిరోగమనంతో అరుదైన రాజయోగం

Saturn retrograde: జ్యోతిష్య శాస్త్రంలో శని స్థానం చాలా ముఖ్యమైనది. ప్రతి రెండున్నరేళ్లకు ఒకసారి శని తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం శని కుంభ రాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు.

30 సంవత్సరాల తరువాత శని తన మూలత్రికోణ రాశిలో ఉన్న కుంభ రాశిలో తిరోగమనం కారణంగా శశ అనే రాజయోగం ఏర్పడింది. 15 నవంబర్ 2024 వరకు కుంభ రాశిలో శని తిరోగమనంలో ఉంటాడు. దీని ప్రభావం కొన్ని రాశులపై చాలా శుభప్రదంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. శని తిరోగమనం వల్ల ఏర్పడే అరుదైన రాజయోగం వల్ల ఏ రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయో తెలుసుకోండి.

శశ రాజయోగం ఎప్పుడు ఏర్పడుతుంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని తన సొంత రాశిలో ఉన్న కుంభం లేదా మకరరాశిలో ఉన్నప్పుడు.. తన ఉచ్ఛమైన రాశిలో తులా రాశిలో ఉండి జాతకానికి మధ్య గృహంలో ఉన్నప్పుడు శశ రాజయోగం ఏర్పడుతుంది. శని కుంభ రాశిలో ఉన్నన్ని రోజులూ ఈ రాజయోగం ప్రభావం ఉంటుంది. ఈ రాజయోగం మూడు రాశుల వారికి మేలు చేస్తుంది. అవి ఎ రాశులో తెలుసుకుందాం.

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్ర, శని మధ్య స్నేహ భావన ఉంది. అటువంటి పరిస్థితిలో శని తిరోగమన స్థానం వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ అసంపూర్ణమైన పని పూర్తవుతుంది. ఉద్యోగాలలో పని చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

కుంభ రాశి

కుంభ రాశి లగ్న గృహంలో శని తిరోగమనం శశ రాజయోగాన్ని సృష్టించింది. శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అదృష్టవశాత్తూ కొన్ని పనులు పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. మీరు మీ కెరీర్‌లో కొత్త విజయాలు పొందవచ్చు. మీరు మీ శ్రమతో సౌకర్యవంతమైన పరిస్థితిని కూడా చేరుకుంటారు. మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే చాలా లాభం పొందుతారు. పురోగతి కూడా ఉంటుంది.

వృశ్చిక రాశి

శని తిరోగమనం వృశ్చిక రాశి వారికి ఆర్థిక, శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి కోణం నుండి ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. శుభవార్తలు అందుకోవచ్చు. ఉద్యోగాలలో పనిచేసే వారికి లాభిస్తుంది. మీరు ఇప్పుడు కొన్ని పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఇస్తాయి. ఇది మీ ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది.

శని తిరోగమనం వల్ల మేషం, సింహం, కన్య, కర్కాటకం, మీన రాశుల వారికి అశుభ పరిణామాలు కలిగిస్తుంది. ఒత్తిడి ఎక్కువ చేస్తుంది. ఆర్థికంగా నష్టపోతారు. కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.