Mars transit: వృషభ రాశిలోకి కుజుడు.. ఇక వీరికి డబ్బే డబ్బు, వ్యాపారంలో లాభాలు
Mars transit: అంగారకుడు తన తదుపరి సంచారం వృషభ రాశిలో చేయబోతున్నాడు. దీని ఫలితంగా మూడు రాశుల వారికి డబ్బు వర్షం కురవబోతుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు.

Mars transit: అన్నీ గ్రహాలకు అధిపతిగా అంగారకుడిని భావిస్తారు. మండుతున్న స్వభావం కలిగిన వాడిగా చెబుతారు. నిర్ధిష్ట సమయం తర్వాత కుజుడు తన రాశి చక్రం మార్చుకుంటూ ఉంటాడు. దీని ప్రభావం అన్ని రాశులపై శుభ, అశుభంగా చూపెడుతుంది. మే 1వ తేదీ నుంచి కుజుడు మేష రాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో తన రాశిని మార్చుకోబోతున్నాడు.
కుజుడు త్వరలో శుక్రుని రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అంగారకుడు తన వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాడు. జూలై నెలలో కుజుడు సంచరించబోతున్నాడు. ప్రస్తుతం కుజుడు మేష రాశిలో ఉన్నాడు. కుజుడు జూలై 12న వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఆగస్ట్ 25 వరకు కుజుడు వృషభ రాశిలోనే ఉంటాడు. మేష రాశి నుండి వృషభ రాశికి కుజుడి సంచారం కొన్ని రాశుల వారికి శుభంగా ఉంటుంది. మరికొందరికి మాత్రం అననుకూల పరిస్థితులను ఏర్పరుస్తుంది.
కుజుడి ప్రభావం
వృషభ రాశిలో కుజుడు ప్రవేశించినప్పుడు ఒక వ్యక్తి విశ్వసనీయంగా ఉంటాడు. ఆచరణాత్మక స్వభావాన్ని పెంపొందించుకునేందుకు ఇది ఉత్తమ సమయం. సరిగా ప్రయత్నిస్తే ఏ పనిలోనైనా విజయం వరిస్తుంది. అభిరుచులు నెరవేర్చుకునేందుకు ఇది అనుకూలమైన కాలంగా పండితులు సూచిస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన విధానంతో ప్రతి విషయంలో రాణించేందుకు ఇదే సరైన సమయం.
కుజుడు శుభ స్థానంలో ఉంటే ధైర్యం, శక్తి లభిస్తాయి. అదే అశుభ స్థానంలో ఉంటే విజయం సాధించడం కష్టం అవుతుంది. కెరీర్, వృత్తి, వ్యాపార జీవితంలో గెలిచేందుకు కుజుడి శుభ స్థానం చాలా ముఖ్యం. వృషభ రాశిలో అంగారకుడి సంచారం కొన్ని రాశిచక్ర గుర్తులకు బంగారు సమయాన్ని ప్రారంభించవచ్చు.
మేష రాశి
మేష రాశి వారికి అంగారకుడి సంచారం అనేక ప్రయోజనాలు అందిస్తూ శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చదువుపై ఎక్కువగా దృష్టి పెడతారు. మంచి ప్రణాళికలు వేసుకుని వాటిని అమలుపరచడం వల్ల వ్యాపారంలో లాభాలను ఆర్జించవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జంక్ ఫుడ్ తినడం మానుకోవాలి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. తల్లిని జాగ్రత్తగా చూసుకోండి.
వృషభ రాశి
వృషభ రాశిలోకే కుజుడు ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. వ్యాపారంలో ధనానికి సంబంధించిన ఒత్తిడి పరిస్థితులు క్రమంగా సమసిపోతాయి. అదే సమయంలో మీ జ్ఞానంతో మీరు మీ పనితీరును కూడా మెరుగుపరుచుకుని అందరి ప్రశంసలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించడం వల్ల దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి అంగారకుడి ఈ రాశి మార్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుజుడి సంచారం మీ రాశి పదకొండో ఇంట్లో జరుగుతుంది. రాబోయే కాలంలో మీరు వేసే ప్రతి వ్యూహం విజయానికి మెట్లు వేస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండండి. వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందవచ్చు.